IND vs WI 3rd T20: సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన టీమిండియా.. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టీ20లో వెస్టిండీస్‌తో తలపడనుంది. గయానాలో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పుంజుకోవాలని చూస్తోంది. మంగళవారం గయానా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సిరీస్‌లోని మూడో మ్యాచ్ తప్పక గెలవాల్సిందే. ఈ కీలక మ్యాచ్‌లో భారత జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.
Also Read: Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కోచ్‌గా కివీస్ లెజెండ్
సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్న సంజూ శాంసన్ స్థానంలో ఎడమచేతి వాటం ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను భారత్ తీసుకురావచ్చు. వరుసగా రెండు మ్యాచ్‌లో పరాజయం పాలు కాగా.. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిపై వేటు వేసి యువ ప్లేయర్ యశస్వీ జైస్వాల్‌కు చోటిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విండీస్ గడ్డపై టెస్టుల్లోకి అడుగుపెట్టి యశస్వి జైస్వాల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే శతకంతో చెలరేగిపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో అదే జోరును కొనసాగించాడు. ఈ క్రమంలోనే అతడిని తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అయితే జైస్వాల్‌ను జట్టులోకి తీసుకొస్తే ఎవర్నీ పక్కనపెట్టాలా అనేది సవాల్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో టీమిండియాకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ సంజూ శాంసన్. సంజూ స్థానంలో యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. గాయం కారణంగా రెండో టీ20కి దూరమైన కుల్దీప్ యాదవ్ కూడా రవి బిష్ణోయ్ స్థానంలో జట్టులోకి తిరిగి రావచ్చు. మొదటి మ్యాచ్‌లో 24 పరుగులు, రెండో మ్యాచ్‌లో 35 పరుగులిచ్చి, రెండు మ్యాచ్‌లలో కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్న ముఖేష్ కుమార్ కోసం ఎక్స్‌ప్రెస్ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను కూడా భారత్ పరిశీలించే అవకాశం ఉంది. విండీస్ జట్టు విషయానికి వస్తే రెండో టీ20లో ఆల్-రౌండర్ జాసన్ హోల్డర్ గాయపడ్డాడు. అతను మూడవ మ్యాచ్‌లో కోలుకుంటే తన స్థానాన్ని నిలబెట్టుకోగలడు. వెస్టిండీస్ తమ గెలుపు ఫార్ములాకు కట్టుబడి 2016 తర్వాత తొలిసారిగా భారత్‌పై టీ20 సిరీస్ విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది.
భారత జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (WK), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
వెస్టిండీస్(అంచనా)
కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (wk), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్ (c), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్.