CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా విజయనగరం షెడ్యుల్ రద్దు అయ్యింది. దీంతో రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమం అనకాపల్లి జిల్లాకు మారింది. శ్రీకాకుళం నుంచి నేరుగా పరవాడ ఫార్మా సిటీలోని లారస్ ఫార్మా కంపెనీ అడ్మిన్ బిల్డింగ్ కు చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ అధికారులతో సమీక్ష, ఫొటో ఎగ్జిబిషన్ లో పాల్గొంటారు చంద్రబాబు. అక్కడ నుంచి వెన్నెల పాలెం గ్రామానికి చేరుకుని రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రుషికొండకు చేరుకుంటారు ఏపీ సీఎం.. గత ప్రభుత్వం నిర్మించిన వివాదాస్పద టూరిజం భావనల్ని పరిశీలిస్తారు. సుమారు 500కోట్ల రూపాయలతో కట్టిన ఈ భావనాలను ఏ విధంగా వినియోగంలోకి తేవాలనే కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకస్మికంగా వెళ్లి ఆ భవనాలను పరిశీలించిన విషయం విదితమే..
Read Also: IND vs NZ: టీమిండియాకు వైట్‌వాష్ తప్పాలంటే.. రెండోరోజు ఆటే కీలకం!
ఇక, ఇప్పుడు సీఎం చంద్రబాబు షెడ్యుల్ లో మార్పులు చోటు చేసుకోగా.. రుషికొండ యాడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థాయిలో రుషికొండ భవనాలపై కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 100 రోజుల ప్రభుత్వ పాలన , విశాఖ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. ఎలివెటెడ్ కారిడార్ ల నిర్మాణం, వైజాగ్ మెట్రో, నక్కపల్లి దగ్గర స్టీల్ ప్లాంటు, వైజాగ్ ఐటీ వంటి కీలకమైన అంశాలపై సమీక్ష జరిగే అవకాశం వుంది. కాగా, పాలిట్రిక్స్ లో మిత్రధర్మం పాటించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు , నాయకులకు ఆయన దిశానిర్దేశం చేసారు. ఒకపార్టీ అంతర్గత విషయాల్లో మరోపార్టీ జోక్యం చేసుకోదన్నారు. కో-ఆర్డినేషన్ లో సమష్యలు వస్తాయని , ఎక్కడి కక్కడ కూర్చోని మాటాడుకోవాలని కేడర్ కు సూచించారు. వైసీపీ రాజకీయపార్టీ కాదని , నేరస్తుల అడ్డా అన్నారు. రాజకీయ ముసుగులో జేబులు కొట్టేవాళ్లు, నేరస్తులు వైసిపి పార్టీలో చేరిపోయారన్నారు చంద్రబాబు. కార్యకర్తలు నేతలు మిత్రదర్మం పాటించాలని ఆయన సూచించారు. కక్ష సాధింపు రాజకీయాలు చేయనన్నచంద్రబాబు.తప్పు చేసేవారిని, నేరస్ధులను మాత్రం విడిచిపెట్టనని హెచ్చరించారు. దామాషా పద్దతిలో మిత్ర పక్షాలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు. రాష్ట్ర అభివృద్ధే తన ముందున్నకర్తవ్యమని నిన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం విదితమే..
సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్..
* నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సీఎం చంద్రబాబు టూర్..
* ఉదయం 11.10 గంటలకు పరవాడ ఫార్మాసిటీకి చేరుకోనున్న సీఎం..
* లారస్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించనున్న ఏపీ సీఎం..
* మధ్యాహ్నం 12.20 గంటలకు వెన్నెల పాలెంలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు..
* మధ్యాహ్నం 12.45 నుంచి 12.55 వరకు మీడియా బ్రీఫ్…
* మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత పరవాడ నుంచి రుషికొండ వెళ్లనున్న చంద్రబాబు….
* రూ.500 కోట్లతో గత ప్రభుత్వం నిర్మించిన విలాస భవనలను పరిశీలించనున్న సీఎం..
* మధ్యాహ్నం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించనున్న ఏపీ సీఎం చంద్రబాబు..