ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ గా బరిలోకి దిగిన కోహ్లీ.. రాహుల్ చాహర్ బౌలింగ్ లో రెండు పరుగులు తీయడం ద్వారా వ్యక్తిగత స్కోర్ 30 వద్ద ఓ రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్ లో 100వ సారీ విరాట్ కోహ్లీ 30 ఫ్లస్ మార్క్ ను దాటాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో 30 ఫ్లస్ స్కోర్ చేసిన తొలి ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు.
Also Read : Indraja: కీర్తి సురేష్ డ్యాన్స్ తో ఇచ్చిపడేసిన ఇంద్రజ.. ఈ వయస్సులో కూడా
అయితే విరాట్ కోహ్లీ 221 ఇన్సింగ్స్ ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఆ తరువాత పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 209 ఇన్సింగ్స్ ల్లో 91 సార్లు, డేవిడ్ వార్నర్ 167 ఇన్సింగ్స్ ల్లో 90 సార్లు, రోహిత్ శర్మ 227 ఇన్సింగ్స్ ల్లో 85 సార్లు స్కోర్ సాధించిన జాబితాలో ఉన్నారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 47 బంతులను ఎదుర్కొని 5 ఫోర్లు, ఒక సిక్స్ తో 59 పరుగులు చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పక్కటెముక గాయంతో బాధపడుతుండడంతో ఫీల్డింగ్ చేయకపోవడంతో కోహ్లీ ఆర్సీబీ స్టాండింగ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. టీమ్ ఇండియా సారథ్య బాధ్యతలను వదిలి వేశాక 556 రోజుల తర్వాత ఇలా ఓ జట్టును కోహ్లీ నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. ఇక పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 24 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ మీద విజయం సాధించింది.
Also Read : Election Commission: ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి.. ఎలక్షన్ కమిషన్ ఆమోదం