Indraja: హా.. నీ జీను ప్యాంట్ చూసి బుల్లెమ్మో.. నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మో. మనస్సు లాగేస్తోంది లాగేస్తోంది.. అంటూ కుర్రాళ్ళ గుండెలను కూడా లాగేసుకుంది నటి ఇంద్రజ. స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఆమె.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ పుణ్యమా అని ఇంద్రజ ఎంట్రీ ఇచ్చింది. అమాయకత్వంగా కనిపిస్తూనే కౌంటర్లు వేస్తూ జబర్దస్త్ జడ్జిగా ఫిక్స్ అయిపోయింది. ఇంకోపక్క శ్రీదేవి డ్రామా కంపెనీ షో కు అయితే పర్మినెంట్ జడ్జిగా కూడా మారిపోయింది. ఇంద్రజ జడ్జిమెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో భాను సాంగ్ కు కామెంట్స్ ఇచ్చినప్పుడే తెలిసిపోయింది. అప్పుడు ఆమెను ఎంత డెప్త్ గా ట్రోల్ చేసారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ షోలో మధ్య మధ్యలో ఆమె తన ట్యాలెంట్ ను కూడా చూపిస్తోంది. మంచి మంచి సాంగ్స్ కు తనదైన రీతిలో డ్యాన్స్ వేస్తూ అదరగొడుతోంది.
Ramabanam Triler: వీడు తమ్ముడులా లేడు టెర్మినేటర్ లా ఉన్నాడు
ఇక తాజాగా ఇంద్రజ.. దసరా సినిమాలో కీర్తి సురేష్ పెళ్లి డ్యాన్స్ ను రీ క్రియేట్ చేసింది. వెన్నెల సెలబ్రేషన్స్ పేరుతో కీర్తి సురేష్ డ్యాన్స్ ఎంత పేరు తెచ్చుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్లో కలర్ చీర.. పెళ్లి కూతురు గెటప్ లో వెన్నెల ఆకా కీర్తి సురేష్ తీన్మార్ స్టెప్పులు నభూతో నభవిష్యత్తు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రేమించినవాడిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆ పెళ్లి కూతురులో ఉండే ఆనందం.. వెన్నెల మోములో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ డ్యాన్స్ వీడియో బయటికి వచ్చిన దగ్గరనుంచి ప్రతి ఒక్కరు ఇదే డ్యాన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఇంద్రజ కూడా వెన్నెలగా మారిపోయింది. కీర్తి సురేష్ లానే పెళ్లి కూతురు గెటప్ లో తీన్మార్ స్టెప్స్ వేసి అదరగొట్టేసింది. అచ్చుగుద్దినట్లు కీర్తి స్టెప్స్ తో పాటు ఆమె హావభావాలను కూడా దించేసింది. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ప్రోమో చూసిన నెటిజన్స్.. ఈ వయస్సులో కూడా ఇంత ఎనర్జటిక్ గా డ్యాన్స్ చేస్తున్నారు అంటే ఇంద్రజ గ్రేట్ అంటూ చెప్పుకొస్తున్నారు.