కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జన సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వి. హనుమంత రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి. హనుమంత రావు మాట్లాడుతూ.. గద్దర్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. గత 9 ఏళ్ళల్లో ప్రధానిగా మోడీ ఓబీసీగా బీసీలకు చేసింది ఏమి లేదని ఆయన మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయాలని చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. రాహుల్ జోడో యాత్ర ద్వారా మోడీకి భయం మొదలయిందని వ్యాఖ్యానించారు వీహెచ్. దేశంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. బీసీలను విడదీసే కుట్ర జరుగుతుందని, కేసీఆర్ బీసీ బంధు పేరుతో మోసానికి తెరలేపారన్నారు.
Also Read : Mangalavaram: గణ గణ మోగాలిరా.. పూనకాలు తెప్పిస్తున్న మంగళవారం సాంగ్..
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఈ సారి గెలిపించండని, బీసీలకు రాజ్యాధికారం రావాలన్నారు వీహెచ్. బీసీలు ఏకం అయితేనే న్యాయం జరుగుతుందని, వెనుకబడిన తరగతులకు ఉన్నత విద్యను అందించాలనే కాంగ్రెస్ ఎయిమ్స్, ఐఐటీలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమన్న వీహెచ్.. ఉపాధి కల్పనలో కేసీఆర్, మోడీ విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం బీసీలకు సీట్లు పెంచే తీర్మానం చేసిందన్నారు. వీరసావర్కర్ ను దేశభక్తుడనటం దురదృష్టమని, ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వ పాలన నడుస్తోందని ఆయన దుయ్యబట్టారు. బీసీ గర్జన విజయవంతం చేసి మన సత్తా చాటుదామన్నారు. బడుగుబలహీన వర్గాల అభ్యన్నతే ధ్యేయంగా బీసీ గర్జన అని, బీసీ గర్జనకు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు వీహెచ్.
Also Read : Pakistan: దైవదూషణ ఆరోపణలు.. పాకిస్థాన్‌లో చర్చిలు ధ్వంసం