పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఓప్పుకున్న చిత్రాలు కూడా అంతే స్పీడ్‌గా ఫినిష్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నటిస్తున్న చిత్రాలో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఏప్రిల్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు. అయితే సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిన రోజుల నుంచే ఇది తమిళ స్టార్ విజయ్ బ్లాక్‌బస్టర్ ‘తేరి’ రీమేక్ అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తూనే వచ్చింది. అయితే
Also Read : Pradeep Ranganathan: ప్రదీప్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’పై భారీ బజ్..
డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ విషయంలో ఎప్పుడూ స్పష్టత ఇవ్వకపోయినా, మేకర్స్ మాత్రం “ఇది రీమేక్ ఫీల్ రాకుండా పూర్తిగా కొత్త గా ఉంటుంది” అని చెబుతూనే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ‘తేరి’ సినిమా నుంచి కోర్ పాయింట్‌ను మాత్రమే తీసుకుని, మిగతా కథ, సన్నివేశాలు, పాత్రల తీరు అన్నీ పవన్ కళ్యాణ్ స్టైల్‌కు, తెలుగు నేటివిటీకి పూర్తిగా సరిపోయే విధంగా మార్చినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ రీమేక్‌లను స్వంత స్టైల్‌లో కొత్తగా రూపొందించడంలో నిపుణుడు కావడంతో, అభిమానుల్లో సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి మరింత పెరిగింది.
ఇదే విషయంపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ స్పందిస్తూ ‘‘ఈ కథలో అంత బలమైన కంటెంట్ ఉంది. స్క్రిప్ట్ పవర్ స్టార్ ఇమేజ్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. రీమేక్ అనిపించే ప్రశ్నే లేదు. ఫుల్ మాస్, ఫుల్ పవర్‌తో సినిమా వస్తుంది’’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. నిర్మాత వ్యాఖ్యలు బయటకు రావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై బజ్ మరింత పెరిగిపోయింది. పవన్–హరీష్ శంకర్ కాంబినేషన్ గతంలో ‘గబ్బర్ సింగ్’ తో సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. అందుకే ఈ చిత్రం కూడా భారీ బ్లాక్‌బస్టర్ అవుతుందనే అంచనాలు మొదలయ్యాయి.