తమిళ ఇండస్ట్రీలో ఓవర్‌నైట్‌గా సెన్సేషన్‌గా మారిన పేరు ప్రదీప్ రంగనాథన్. దర్శకుడిగా జయం రవితో ‘కోమలి’ సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, నటుడిగా–దర్శకుడిగా చేసిన ‘లవ్ టుడే’తో సౌత్ మొత్తానికి తన టాలెంట్‌ను నిరూపించాడు. ఆ సినిమా వచ్చిన తర్వాత ప్రదీప్ గ్రాఫ్ ఒకే దెబ్బకు ఆకాశాన్ని తాకింది. అదే ఫామ్ కొనసాగిస్తూ ఈ ఏడాది వరుసగా ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో బారీ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు అతన్ని మరొక పెద్ద రికార్డు వైపు నెట్టే చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. స్టార్ హీరోయిన్ నయనతార భర్త, క్రియేటివ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 18 న విడుదలకు సిద్ధంగా ఉంది.
Also Read : Triptii Dimri: ఎన్టీఆర్ పై కన్నేసిన ‘స్పిరిట్’ బ్యూటీ !
కృతి శెట్టి హీరోయిన్‌గా నటించడం వల్ల ఈ సినిమాపై యూత్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. ట్రైలర్, సాంగ్స్‌తోనే సినిమాపై భారీ హైప్ రాగా, ఇది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే 100 కోట్ల మార్క్ చేరడం చాలా ఈజీ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలా జరిగితే, ఒక్క ఏడాదిలో మూడు 100 కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోగా ప్రదీప్ పేరుపొందనున్నాడు. ఇప్పటి వరకు ఈ ఫీట్ సాధించిన హీరోలు చాలా తక్కువ. అందుకే ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మీద అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో.. ప్రదీప్ నిజంగానే కొత్త రికార్డు సెట్ చేస్తాడో లేదో తెలుసుకోవాలంటే డిసెంబర్ 18 వరకు ఆగాల్సిందే.