Uses of Chilly Powder కారం ఎక్కువ అయితే కడుపులో మంటలాంటివి వస్తాయని ఈ మధ్య కాలంలో చాలా మంది దాని వాడకాన్ని తగ్గించారు. చప్ప చప్పగా తినడానికి అలవాటు పడిపోయారు. ఏదో కొన్ని ప్రాంతాల వారు తప్పితే చాలా మంది ఎక్కువ కారం తినలేదు. అయితే విదేశీయులకు పోలిస్తే మన భారతీయ వంటకాల్లో కారం కాస్త ఎక్కువగానే ఉంటుంది. కారం వల్ల నష్టాలు కాదు ఎన్నో లాభాలు ఉన్నట్లు తెలుస్తోంది. కారానికి కారణమైన మిరపకాయలు తింటే కొన్ని వ్యాధులు దూరం అవుతాయంట. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. వాటిని ఓసారి పరిశీలిస్తే..
Also Read: Xiaomi 13T Pro Price: ఐఫోన్ 15కి పోటీగా ‘షావోమి’ స్మార్ట్‌ఫోన్.. బలమైన బ్యాటరీ, సూపర్ ఫీచర్స్!
బరువు తగ్గాలనుకునే వారికి కారం మంచి ఉపాయం అంట. దీనిని తినడం వల్ల బరువు సమస్య తీరుతుందంట. ఇక దీనిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువ అందుకే ఎక్కువ కాలం బతకవచ్చు. ఇక దీని వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అందుకే కారం ఎక్కువ తినని వారికి తినే వారితో పోలిస్తే జబ్బులు ఎక్కువ వస్తాయి. మిరపకాయలో ఉండే క్యాప్సైసిన్, డీహైడ్రోక్యాప్సైసిన్ వల్ల రక్తంలో చక్కర శాతం, గ్లూకోజ్ శాతం అదుపులో ఉంటుంది నిపుణులు పేర్కొంటున్నారు. కారం వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే దీని వల్ల ధమనుల్లో ఉండే అధిక కొవ్వు తొలుగుతుంది. శరీరంలో ఇన్యులిన్ లెవల్స్ కూడా కారం వల్ల అదుపులో ఉంటాయి. దీని వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కారం తినడం వల్ల ఎక్కువ కాలం బతకవచ్చు అనే ఆధారాలు ఉన్నాయని చెప్పకపోయినా..చాలా ఆనారోగ్యాలు దూరం అవుతాయని మాత్రం చెబుతున్నారు.