ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు పదిమంది సెల్ ఫోన్ ఉపయోగిస్తే అందులో 8 మంది ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. దాంతో ప్రస్తుతం దేశంలో కూడా ఎన్నో సేవలను మొబైల్ ద్వారా క్షణాల్లో చేసుకుంటున్నాము. ఇక డబ్బులు ట్రాన్స్ఫర్ కోసం ఫోన్ పే, గూగుల్ పే, పేటియం లాంటి ఇంకా ఎన్నో యూపీఐ యాప్స్ వినియోగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. యూపీఐ సేవలను విస్తృతంగా వాడుతున్న నేపథ్యంలో ప్రజల కోసం ఆర్బిఐ మరికొన్ని కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఆర్బిఐ మరో కీలక నిర్ణయాన్ని తీసుకువస్తుంది. ఇందులో భాగంగానే యూపీఐ లో కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు ఆర్బిఐ గవర్నర్ శశికాంత్ దాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొన్ని కష్టాలకు చెక్ పదనునట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: K. Laxman: రూ.2 లక్షలు రుణమాఫీ ఎందుకు చేయలేదు..? రేవంత్ రెడ్డికి లక్ష్మణ్ ప్రశ్న..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కస్టమర్లకు కోసం ఎప్పటికప్పుడు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం విధితమే. ఇకపోతే తాజాగా జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్ ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు. అసలు కొత్త ఫీచర్ ఏంటన్న విషయానికి వస్తే.. డిపాజిట్ సమయంలో మిషన్ లో క్యాష్ డిపాజిట్ చేసేందుకు నేరుగా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు కేవలం యూపీఐ ద్వారా క్యాష్ విత్ డ్రాకు మాత్రమే అవకాశం ఉండగా.. త్వరలో డిపాజిట్ కూడా యూపీఐ ద్వారా సేవలను అందుకోవచ్చు. విత్ డ్రాకు సంబంధించి యూపీఐ విధానం వల్ల మంచి స్పందన రావడంతో ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ ని తీసుకురాబోతున్నట్లుగా తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం కేవలం డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే క్యాష్ డిపాజిట్ చేసే అవకాశం ఉండగా ఇక ఈ సేవ వినియోగంలోకి వచ్చాక యూపీఐ ద్వారా కూడా క్యాష్ ను మిషన్లలో డిపాజిట్ చేసుకోవచ్చు.
Also read: Top Headlines @1PM : టాప్ న్యూస్
ఈ కొత్త సేవలకు సంబంధించి అతి త్వరలోనే పూర్తి మార్గదర్శకాలను విడుదల చేస్తామని ఆర్బిఐ గవర్నర్ తెలిపారు. ఈ కొత్త సేవలను తీసుకురావడం ద్వారా కష్టమర్లకు బ్యాంకింగ్ సేవలు పొందడం మరింత సులువుగా అవుతుందని బ్యాంకుల్లో క్యూ లైన్ లలో వేచి ఉండాల్సిన కష్టాలకు చెక్ పాడుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చూడాలి మరి ఈ కొత్త ఆప్షన్ బ్యాంకు కస్టమర్లకు ఎలా ఉపయోగపడుతుంది., ఎలాంటి స్పందన వస్తుంది.