టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వెన్నెల కిషోర్. కేవలం హాస్య భరితమైన సినిమాలలో మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో కూడా ఆయన నటించి మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా వెన్నెల కిషోర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘చారి 111 ‘. ఇకపోతే ఈ సినిమా మార్చి ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినీ థియేటర్లలో విడుదల అయింది. స్పై కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమాలో వెన్నెల కిషోర్ సరసన సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హాలీవుడ్ లోని ‘జానీ ఇంగ్లీష్’ స్ఫూర్తితో తెరకెక్కించారు. ఇకపోతే., ఈ సినిమాను మొదటగా కేవలం ఓటీటీ ప్లాట్ఫామ్ లోనే రిలీజ్ చేయాలని భావించిన.. చివరికి థియేటర్లలో రిలీజ్ చేసి మంచి రెస్పాన్స్ అందుకుంది. కాకపోతే ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. కేవలం ఓ మోస్తారు కలెక్షన్లతో సరిపెట్టుకుంది. దాంతో ఇంకేముంది కొద్ది రోజుల్లోనే ఓటీటీలో విడుదల చేసారు చిత్ర బృందం. అయితే ఈ సినిమాకు ఓటీటీ విడుదలపై ఎటువంటి ప్రకటన లేదు.
కాకపోతే నేరుగా ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నేడు ఏప్రిల్ 5 నుండి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్స్లో ఈ సినిమా చూడని వారు ఇప్పుడు ఆమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సంయుక్త విశ్వనాథన్ తో పాటు తాగుబోతు రమేష్, సత్య, మురళి శర్మలు కీలక పాత్రలను పోషించారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. హైదరాబాదులో జరిగిన ఓ బాంబు బ్లాస్ట్ లో భాగంగా నేరస్తులను హీరో చారి ఎలా కనిపెడతాడో అన్న విషయంపై ముందుకెళ్తుంది.