K. Laxman: రూ.2 లక్షలు రుణమాఫీ ఎందుకు చేయలేదు..? రేవంత్ రెడ్డికి లక్ష్మణ్ ప్రశ్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K. Laxman: రూ.2 లక్షలు రుణమాఫీ ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి అని సీఎంకు ఎంపీ రాజ్యసభ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. సంగారెడ్డి రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి ఉందన్నారు. రైతుల పడుతున్న గోస పై భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందన్నారు. అప్పు చేసి వ్యవసాయం చేస్తున్న రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు బేడీలు వేసి, ఈ రోజు పాతాళానికి చేరిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా రతులకు అలవి కానీ హామీలు ప్రకటించిందన్నారు. సోనియా గాంధీ మాట తప్పదు అని చెప్పారని తెలిపారు. మరి సోనియా గాంధీ ప్రకటించిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు.
Read also: Kishan Reddy: కాంగ్రెస్ హామీల అమలుకు నోట్లు ముద్రించే మిషన్ లు పెడతారేమో..!
Also Read
- Indigo : పవర్ బ్యాంక్లో మంటలు.. శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్లో కొత్త సాఫ్ట్‌వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
రాజస్తాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల అప్పు తీర్చలేక పోయిందని తెలిపారు. కానీ తెలంగాణా లో కాంగ్రెస్ నీ గెలిపిస్తే రైతు రుణ మాఫీ చేస్తా అని రాహుల్ గాంధీ అన్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి నీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి రాహుల్ రాజస్తాన్ వెల్లాడా? అని ప్రశ్నించారు. రాజస్తాన్ లో రైతులు కాంగ్రెస్ కి బుద్ది చెప్పి ఓడించారన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద నరేంద్ర మోది రైతులకు అండగా నిలిచాడన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించి రైతులకు సహాయం పడ్డది కూడా నరేంద్ర మోడీ నే అన్నారు. యూరియా, విత్తనాలపై కేంద్రం సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటుందన్నారు. అనవసరమైన ఉచితాలు ప్రకటించకుండా కేంద్రం సబ్సిడీ ఇస్తుందన్నారు. వ్యవసాయం చేసే రైతులకు, కవులు రైతులకు సబ్సిడీ అందించి వారికి న్యాయం చేస్తుంది కేంద్రం అని తెలిపారు.
Read also: Chaari 111: ఓటీటీలో ప్రత్యక్షమైన వెన్నెల కిషోర్ యాక్షన్ కామెడీ మూవీ..!
రైతులను జైలుకు పంపిన పాపానికి కెసిఆర్ ప్రభుత్వం కూలీ పోయిందన్నారు. ఎన్నికల ముందు బ్యాంక్ కు వెళ్లి 2 లక్షల లోన్ తీసుకోండి డిసెంబర్ 9 మాఫీ చేస్తా అని రేవంత్ చెప్పాడన్నారు. ఇప్పటి వరకు 2 లక్షలు రుణ మాఫీ ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి అని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ లను గెలిపిస్తే హామీలు అమలు అవుతాయని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టే కాంగ్రెస్ మాటలు నమ్మి అధికారాన్ని కల్పించారన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో సొంత ఎమ్మెల్యే లు తిరగబడుతున్నారని తెలిపారు. కర్ణాటకలో తాగు నీరు కూడా అందించలేని పరిస్థితిలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్నారు. రేవంత్ రెడ్డి నిన్ను తెలంగాణా ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు.
Read also: Danam Nagender: 10 నిమిషాల్లో 45 వేల టికెట్లు ఎలా అమ్ముడు పోతాయి..?
ఈ రోజు మళ్ళీ తుక్కుగుడలో హామీలు పేరుతో రాజకీయం చేస్తున్నారని తెలిపారు. రైతులు ఏడిస్తే రాష్ట్రానికి మంచిది కాదన్నారు. రైతులు బాగుంటేనే దేశం భాగుంటుంది..రైతులు బాగుంటే ప్రజలు బాగుంటారన్నారు. రైతులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుందన్నారు. రైతులకు న్యాయం జరగాలని రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టామన్నారు. మళ్ళీ దేశంలో మోడీ నే ప్రధాని అవుతున్నాడని తెలిపారు. రైతులకు మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఏ రైతు కూడా అత్మహాత్య చేసుకోవద్దనీ మనవి చేస్తున్నానని, రైతులకు ప్రకటించిన హామీలను నెరవేర్చాలని బిజెపి తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని ఎడల ఈ దీక్ష ఇంకా ముందుకు తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నామన్నారు.
Daggubati Purandeswari : రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్లో మంటలు.. శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..