Video: కొన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో నవ్వు పుట్టిస్తున్నాయి. చాలా ఫన్నీగా ఉండడంతో నెటిజన్లు రిపీటెడ్ గా చూస్తుంటారు. కానీ కొన్ని వీడియోలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. ఈ మధ్యకాలంలో మెట్రోకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ మెట్రో లోపల, డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ కనిపిస్తారు. మీరెప్పుడా మెట్రోలో సోఫా తీసుకెళ్లడం చూశారా.. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇందులో ఇద్దరు వ్యక్తులు మెట్రో లోపల సోఫాను మోస్తూ కనిపించారు. ఈ వీడియో ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై ఇద్దరు వ్యక్తులు సోఫాతో నిల్చున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. ఆ తర్వాత మెట్రో రాగానే సోఫా ఎత్తుకుని లోపలికి వెళ్లడానికి లేచి నిలబడతారు. దీని తర్వాత మెట్రో డోర్ తెరుచుకోగానే వారు సోఫాను మోస్తూ లోపలికి ప్రవేశిస్తారు. కట్ చేస్తే వారు దానిని అవతలి వైపు నుండి బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది చూస్తే కాస్త గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది ఎలా జరిగింది.. అని ప్రజలను ఆలోచింపజేసే వీడియో. అసలు వాళ్లు మెట్రో స్టేషన్‌కు సోఫాను ఎలా తీసుకెళ్లారు అనేది ప్రజలను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో భారత్ కు చెందినది కాదు. ఇది న్యూయార్క్ నగరంలోని మెట్రో స్టేషన్లో చిత్రీకరించినది.
Read Also:Chandrababu: నేడు చంద్రబాబు కేసుల్లో కీలక తీర్పులు.. బెయిల్ వస్తుందా? రాదా?
ఈ వీడియో mancelnyc అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. దీనిని ఇప్పటివరకు 6.9 మిలియన్లు మంది చూశారు. ఒక లక్షా 13 వేల మందికి పైగా ప్రజలు వీడియోను లైక్ చేసారు. వివిధ ఫన్నీ రియాక్షన్‌లు ఇచ్చారు. ‘అప్పట్లో రైలు ఖాళీగా ఉంది కాబట్టి అర్ధరాత్రి ఈ పని చేసి ఉంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘నేను న్యూయార్క్‌లో 35 ఏళ్లుగా ఉంటున్నాను, కానీ ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు. నన్ను నమ్మండి, ఇది న్యూయార్క్ వీక్షణ కాదు. అంటూ మరో నెటిజన్ కామెంట్స్ చేశాడు.
https://www.instagram.com/p/CxeOKRVuOls/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again