మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని అరుంధతి నగర్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మృతి చెందిన చిన్నారులు దుర్గా ప్రసాద్ (11), సుబ్రహ్మణ్యం(8)గా గుర్తించారు పోలీసులు. చిన్నారులు అరుంధతి నగర్ లో వుండే బంధువుల ఇంటికి వచ్చారు. నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి ఆడుకునేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి శవాలుగా తేలడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అయితే చిన్నారుల కోసం కుటుంబ సభ్యులు వెతకగా…