TTD: ప్రముఖ పుణ్యక్షేత్రం, కొలిచినవారి కొంగుబంగారం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తుంటారు. ఇక, త్వరలోనే వేసవి సెలవులు రానుండడంతో.. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడే పరిస్థితి లేకపోలేదు.. మరోవైపు.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.. అయితే, శ్రీవారి భక్తులకు శుభవార్త చెబుతూ.. శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను పెంచింది టీటీడీ.. ఎన్నికల కోడ్ నేఫథ్యంలో సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన నేపథ్యంలో.. భక్తుల సౌకర్యర్దం ఆఫ్ లైన్ విధానంలో కేటాయించే శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను పెంచినట్టు టీటీడీ ప్రకటించింది.. అయితే, ఇవి ఆఫ్‌లైన్‌కే పరిమితం.. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండవు.
Read Also: Parvo Virus In Dogs: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ లో కుక్కలకు పార్వో వైరస్.. ఆందోళనలో ప్రజలు
ఇక, రేపటి నుంచి ఆన్ లైన్ లో జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. మరోవైపు.. ఎల్లుండి నుంచి అంటే ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ పేర్కొంది.. నిన్న 83,825 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. 25,690 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. ఇదే సమయంలో.. నిన్నటి రోజున శ్రీవారికి హుండీ ద్వారా రూ.4.57 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ తెలిపింది.