ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్(టీఎస్‌ఎల్పీఆర్‌బీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిలిమ్స్‌లో 7 ప్రశ్నల విషయంలో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ ప్రశ్నలకు మార్కులు కలపాలని నిర్ణయించింది. అయితే..దీంతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితాను వెబ్ సైట్‌లో పొందుపరచనున్నట్లు పోలీస్ నియామక బోర్డు ప్రకటన విడుదల చేసింది. వీటిని వారి వ్యక్తిగత లాగిన్ తో(Login) తెలుసుకోవాలని సూచించింది. వీటిని రేపు అనగా జనవరి 30, 2023న అందుబాటులో ఉంచుతామని నోటీస్ లో పేర్కొంది.
Also Read : Novok Djokovic : ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జకోవిచ్.. నాదల్ రికార్డ్ సమం
అర్హత సాధించిన అభ్యర్థులు పార్ట్ 2 అప్లికేషన్ చేసుకోవాలని తెలిపింది. ఇది వరకు నిర్వహించిన పీఈటీ, పీఎంటీ పరీక్షలో అర్హత సాధించిన వారు మరో సారి పార్ట్ 2 దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతే కాకుండా.. పీసీ/ఎస్సై లో ఏదో ఒకటి అర్హత సాధించి.. ఇప్పుడు పీసీ/ఎస్సైలో అర్హత సాధించిన వారు పార్ట్ 2 చేసుకోవాలని తెలిపింది. అయితే.. కొత్తగా అర్హత సాధించిన వారికి ఫిబ్రవరి 15 నుంచి ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు టీఎస్‌ఎల్పీఆర్బీ తెలిపింది. పార్ట్ 2 దరఖాస్తులను ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 5లోపు సమర్పించాలని సూచించింది టీఎస్‌ఎల్పీఆర్బీ. ఈ తేదీలు ఎట్టి పరిస్థితుల్లో పొడిగించడం కుదరదని టీఎస్‌ఎల్పీఆర్బీ వెల్లడించింది.
Also Read : Vedha: ‘వేద’ గా రాబోతున్న కన్నడ సూపర్ స్టార్