ప్రభుత్వం మొత్తం 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇఛ్చింది. 555 అభ్యర్థులు సెలెక్టయ్యారు. ఫిబ్రవరి 14న ఎంపికైన ఎక్సైజ్ కానిస్టేబుళ్ల కు ప్రభుత్వం అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చింది. ఏప్రిల్ 13వ తేదీ వరకు జాయినింగ్ టైమ్ ఇచ్చింది. సెలెక్టయిన 555 మంది అభ్యర్థుల్లో ఇప్పటివరకు 397 మంది జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. వీరందరూ 3 నెలల పాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. 45 రోజులు ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. 120 మంది అభ్యర్థులకు ఎక్సైజ్…
15,644 పోలీసు కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి ఎంపిక ప్రక్రియను నాలుగు వారాల్లోగా ప్రారంభించాలని, త్వరితగతిన ఎంపికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డును హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం ఆదేశించింది. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి మరియు జస్టిస్ ఎన్. రాజేశ్వర్ రావుతో కూడిన ధర్మాసనం, ‘తప్పు ప్రశ్నల’ వివాదాన్ని తొలగించాలని కోరిన స్వతంత్ర నిపుణుల సంఘానికి మళ్లీ సూచించింది. స్వతంత్ర నిపుణుల సంఘం నుంచి రెండో అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే ఎంపిక…
తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ టెస్టులు ఆపాలని ఎస్పీలు, కమిషనర్లకు TSLPRB ఆదేశాలు ఇచ్చింది
Asifabad: ఇటీవల తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. స్థానికత ఆధారంగా సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్పీ, అగ్నిమాపక విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) గతేడాది రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో 17,516 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి టీఎస్‌ఎల్పీఆర్బీ ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎస్సై, ఏఎస్ఐ పోస్టుల అభ్యర్థుల చివరి లిస్ట్ ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 587 ఎస్సై పోస్టులకు గాను 434 మంది పురుషులు, 153 మంది మహిళలను టీఎస్ఎల్పీఆర్బీ ఎంపిక చేసినట్లు ప్రకటించింది. కాగా, ఈ ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను రేపు ఉదయం నుంచి వెబ్ సైట్‌లో ఉంచుతామని వెల్లడించింది.…
జీవో 46ను రద్దు చేయాలని, మళ్ళీ పాత పద్ధతిలోనే పోలీస్ టీఎస్ఎస్పీ, ఐటీ, కమ్యూనికేషన్ నియామకాలు చేపట్టాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు అర్ధనగ్న ప్రదర్శనతో మోకాళ్ళపై నడిచారు. పోలీసు బోర్డ్ నియామకం ప్రకారం క్వాలిఫై అయిన మాకు ఈ జీవో వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవో ప్రకారం ఫలితాలు ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని అవకాశం…
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు సంబంధించి పూర్తయినట్లు తెలిపింది. మరోవైపు అభ్యర్థుల వయసు సడలింపు వివాదం చివరి దశలో తెరమీదికి వచ్చింది.
తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటలకు కానిస్టేబుల్ తుది పరీక్ష హాల్ టికెట్ల్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది.