తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్టీలోని అంతర్గత విభేదాలను తొలగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం అన్ని రకాల ప్రయత్నాలను చేస్తుంది. ఇప్పటికే పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా మాణిక్ రావు ఠాక్రేను నియమించగా.. ఆయన పలుసార్లు హైదరాబాద్ కు వచ్చి నేతలందరితో సమావేశం అయ్యారు. అయితే నాయకుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పార్టీలో ఇబ్బందులు తలెత్తున్నాయి.
Also Read : IPL 2023 : లక్నో సూపర్ జెయింట్స్ తో పంజాబ్ కింగ్స్ ఢీ..
అయితే ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉండగా.. పార్టీ నాయకుల తీరుతో అధిష్టానం అయోమయంలో పడింది. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలోని ప్రధాన కార్యదర్శుల సంఖ్యను 84 నుంచి 119కి పెంచాలని హస్తం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని అధిష్టానం ఏఐసీసీ కార్యదర్శులకు ఆదేశించింది.
Also Read : CM YS Jagan: సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీ.. ఏర్పాట్లుకు సీఎం ఆదేశం
దీంతో ప్రధాన కార్యదర్శులకు ఒక్కొక్కరికి ఒక్కో నియోజకవర్గాన్ని కేటాయించాలని పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు పీసీసీలోకి మరో ముగ్గురు ఉపాధ్యక్షులుగా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఏఐసీసీ ప్రకటించిన పదవులతో కాంగ్రెస్ కలకలం రేగింది. దీంతో అసంతృప్తితో ఉన్న నాయకులకు ఈ పదవులు అప్పగించి బుజ్జగించాలని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.
Also Read : Joe Biden: బైడెన్‌కు మతిమరుపు వచ్చిందా..? చివరి విదేశీ పర్యటన కూడా గుర్తు లేదా..?
కాగా ఈ ఏడాది డిసెంబర్ లోపు రాష్ట్రంలో ఎన్నికలు జరగాలి.. దీంతో పార్టీలన్నీ కూడా గెలుపు కోసం ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నాయి. ఇక కాంగ్రెస్ నాయకులు కూడా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పాదయాత్రలకు అనుకున్నంతగా నాయకుల నుంచి సహకారం అందడం లేదు. రేవంత్, భట్టి విక్రమార్క మినహా మిగతా వారు ఇంకా పాదయాత్ర మొదలుపెట్టలేదు. ఈ క్రమంలో అధిష్టానం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read : SL vs IRE : 71 ఏళ్ల వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన శ్రీలంక బౌలర్
అయితే కాంగ్రెస్ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. ఎప్పటికప్పుడు ప్రజల్లో పార్టీ గురించి సానుకూల అంశాలపై మాట్లాడకుండా.. వ్యక్తిగత లాభం కోసం పదవుల కోసం పార్టీ పెద్దలపై గుర్రుగా ఉంటున్నారు. అందుకే నియోజకవర్గాల్లో కీలక నాయకులకు ప్రధాన కార్యదర్శులుగా కేటాయించి పార్టీకి కొత్త ఊపు తేవాలని చూస్తున్నారు. మరి ఈ మార్పులు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సహయపడతాయో చూద్దాం.. మరీ..