Harish Rao : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 27 వరకు కొనసాగనున్నాయి. బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం అనంతరం ఈనెల 19న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలపై విపక్షాల నుంచి పలు కీలక అభ్యంతరాలు, డిమాండ్లు వెలువడ్డాయి. బీఏసీ సమావేశం అనంతరం బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల పట్ల తమ అభిప్రాయాలను స్పష్టం చేస్తూ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు. కనీసం…
BRS KTR: బీఆర్ఎస్ పార్టీపై వైరం కారణంగా సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం త్యాగం చేయవద్దని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు ఈ సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తిచేసినందుకు మోడీకి ధన్యవాదాలు చెబుతూ తీర్మానం.. వికసిత భారత్ సాకారం చేయడానికి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.. ఏమైంది..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్…
BRS Parliamentary Party: ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 12:30 గంటలకు సభ జరగనుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. అందుకోసం జనవరి మూడో తేదీ నుంచి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి,…
హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ అభివృద్దిపై మంత్రి కేటీఆర్ పర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కాళేశ్వరాన్ని బద్నాం చేయవద్దు.. బ్యారేజ్ లలో సమస్యలు రావడం సహజం అంటూ వ్యాఖ్యనించారు.
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు పదోన్నతి లభించింది. పాలనా యంత్రాంగం ఆయనకు కీలక పదవిని అప్పగించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ను నియమిస్తూ జాతీయ నాయకత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.
కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలోని ప్రధాన కార్యదర్శుల సంఖ్యను 84 నుంచి 119కి పెంచాలని హస్తం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని అధిష్టానం ఏఐసీసీ కార్యదర్శులకు ఆదేశించింది.
ప్రధాని మోడీ వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి వచ్చి.. తెలంగాణపై విషం చిమ్మారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణపై మోడీకి విద్వేషం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. సహజ మిత్రుడు, పార్ట్‌నర్ అంటూ అసదుద్దీన్ గురించి రేవంత్ మాట్లాడారు.