CM YS Jagan: సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధం అవుతోంది ప్రభుత్వం.. దీనిపై తగిన ఏర్పాట్లు చేయాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు సమీక్ష నిర్వహించిన సీఎం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి నిధులకు ఎలాంటి లోటు లేదని స్పష్టం చేశారు.. 2022-23 సంవత్సరంలో 10,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయనున్నాం.. ఎక్కడా బకాయిలు లేవన్నారు.
Read Also: Vizag Swetha Case: శ్వేత మృతి కేసు.. కీలకంగా మారిన పోస్టుమార్టం రిపోర్టు
ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు సీఎం వైఎస్ జగన్.. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. అన్ని జిల్లాల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వేయికి పైగా ఇళ్లు నిర్మిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.. 10.03 లక్షల లబ్ధిదారులకు రూ.3,534 కోట్లకు పైగా రుణాలు మంజూరు అయ్యాయని.. ప్రతి శనివారం హౌసింగ్ డేగా పరిగణించాలని తెలిపారు. ఇక.. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 48 వేల మంది పేదలకు ఏపీ సీఆర్డీఏ ప్రాంతంలో మే రెండో వారంలో ఇళ్ల పట్టాల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, మే 25 నుంచి రెండో దశ గ్రామాల్లో సర్వే ప్రారంభం అవుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.