Washington DC Plane Crash: మిస్టరీ వీడనుంది… అమెరికన్ విమాన ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ దొరికింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Washington DC Plane Crash: వాషింగ్టన్ డీసీలో బుధవారం రాత్రి జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లోనే అమెరికా ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్ హాక్ (H-60) ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 67 మంది ప్రయాణికులు మరణించారు. జాతీయ రవాణా భద్రతా బోర్డు (NTSB) దర్యాప్తును చేపట్టింది. శుక్రవారం నాటికి 28 మంది మృతదేహాలను గుర్తించగా, 41 మృతదేహాలను నీటిలోనుండి వెలికి తీశారు. విమానం నది అడుగుభాగంలో ఉన్నందున మిగతా మృతదేహాలు ఇంకా లభించలేదు. బ్లాక్ బాక్స్ లోని ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ డేటా విశ్లేషణ ద్వారా ప్రమాదానికి గల అసలు కారణం బయటపడే అవకాశం ఉంది.
బ్లాక్ బాక్స్ దొరికింది, కానీ తేమతో నిండింది
NTSB సభ్యుడు టాడ్ ఇన్మాన్ మాట్లాడుతూ.. “బ్లాక్ బాక్స్ దొరికింది కానీ అది తేమతో నిండిపోయింది. దానిలోని డేటాను పూర్తిగా విశ్లేషించడానికి కొన్ని రోజులు పడుతుంది” అని తెలిపారు.
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
Read Also:Chhaava: ‘ఛావా’ సినిమాతో వారి అనుభూతిని పంచుకున్న విక్కీ కౌశల్, రష్మిక..
హెలికాప్టర్ ఎందుకు ఢీకొట్టింది?
ఈ ప్రమాదానికి హెలికాప్టర్ కారణమా? లేక ఇతర సాంకేతిక లోపమా? అనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం తర్వాత విమాన శకలాలు పోటోమాక్ నదిలో పడిపోయాయి. వాషింగ్టన్ రోనాల్డ్ రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ల్యాండ్ కావాల్సిన ఈ విమానం కాన్సాస్ సిటీ నుండి వాషింగ్టన్ కు వస్తోంది.
ప్రమాదంపై ట్రంప్ ప్రశ్నలు
ఈ విమాన ప్రమాదంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. “ఆకాశం నిర్మలంగా ఉన్నా, ఈ ప్రమాదం ఎలా జరిగింది? హెలికాప్టర్ ఎందుకు విమానం వైపుగా కదిలింది? పైలట్ ఎందుకు తప్పించుకోలేకపోయాడు?” అని ప్రశ్నించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రంప్ వైట్ హౌస్ లో ఉన్నారు. వైట్ హౌస్ నుండి విమానాశ్రయం కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. NTSB దర్యాప్తు పూర్తి అయిన తర్వాత మాత్రమే అసలు నిజం బయటకు రానుంది.
Read Also:Chandoo Mondeti : ‘కార్తికేయ-3’ గురించి అప్డేట్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటి
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!