కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది.. బయో కెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మైక్రో బయాలజీ టెక్నీషియన్ జిమ్మీ రాజు, బయో కెమిస్ట్రీ ఎల్ టీ గోపాలకృష్ణ, పాదాలజీ ఎల్‌టీ ప్రసాద్ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు విద్యార్థినులు.. మెయిల్ ద్వారా ఒకేసారి ఫిర్యాదు చేశారు 50 మంది విద్యార్థినులు.. అయితే, ఈ ఘటనపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నిందితులపై కఠిన…
వైద్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైఎస్ జగన్ ను కలిశారు వైద్య విద్యార్ధులు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. విదేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు.
Road Accident: నార్సింగ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువ వైద్యుడు ప్రాణాలు కోల్పోగా, మరో వైద్యురాలు తీవ్రంగా గాయపడింది. ప్రమాద సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు ఖానాపూర్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో జస్మిత్ అనే యువ వైద్యుడు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. భూమిక అనే మరో వైద్యురాలు తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ ఇద్దరు వైద్యులు జన్వాడలో జరిగిన ఓ ఫంక్షన్…
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి జలపాతంలో కొట్టుకుపోయిన మెడికల్ విద్యార్థి హరదీప్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 40 మంది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి.. వర్షం కారణంగా కొండవాగులు పొంగిపొర్లడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది.
Adilabad Rims: ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రి వద్ద అర్థరాత్రి సందడి నెలకొంది. ఆస్పత్రిలోకి చొరబడిన దుండగులు వైద్య విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. తాము రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ అభిమానులమని దుండగులు చెప్పినట్లు సమాచారం.
Medical Students: భారతీయ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఇకపై ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ విదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
CM KCR: దేశంలోనే వైద్యరంగంలో తెలంగాణలో శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలను సీఎం కేసీఆర్ సాక్షాత్తు ప్రారంభించారు.
ఆపరేషన్ థియేటర్ లోకి హిజాబ్ ధరించి వెళ్లడానికి అనుమతి లేకపోవడంతో తమకు వేరే వాటిని ధరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముస్లిం వర్గానికి చెందిన మహిళా వైద్య విద్యార్థినులు కోరారు
Medical Students: ఏపీలో వైద్య విద్యార్థులు డ్రెస్ కోడ్ పాటించాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించరాదని తన ఆదేశాల్లో పేర్కొంది. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు అబ్బాయిలు అయితే టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు వేసుకోకూడదని.. అమ్మాయిలు అయితే చీర, చుడీదార్ మాత్రమే ధరించాలని సూచించింది. విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో జరిగిన వారాంతపు సమీక్షలో ఈ నిర్ణయాలను…