విశ్వంలోని ఇతర గ్రహాలపై మానవ మనుగడ కోసం ప్రయోగాలు చేస్తున్న వేళ.. భూమిపై మాత్రం ఇప్పటి వరకు విద్యుత్ సరఫరా లేని గ్రామాలు ఉండడం ఆశ్చర్యం కలిగించకమానదు. కారణాలు ఏవైనా ఇంకా చీకటిలోనే గ్రామాలు మగ్గుతున్నాయి. అయితే ఇటీవలి కాలంలో కరెంట్ సదుపాయం లేని గ్రామాలకు విద్యుత్ ను ఏర్పాటు చేసి వెలుగులు నింపుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామానికి తొలిసారిగా విద్యుత్ వచ్చింది. Also Read:Bihar: బీహార్ ఓటర్ల జాబితా నుంచి…
ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారు.. తూర్పు గోదావరి జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో ప్రధాని ప్రచారం కొనసాగనుంది.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి రానున్నారు ప్రధాని మోడీ.. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్‌లో నిర్వహించనున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. అనంతరం విశాఖ జిల్లా అనకాపల్లి బయలుదేరి వెళ్తారు.. ప్రధాని మోడీ బహిరంగ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు..
ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4న జనసేన ఎన్నికల శంఖారావం పూరించనుంది. అందుకోసం అనకాపల్లిలో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. నూకాలమ్మ తల్లి అమ్మవారి దీవెనలతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు జనసేనాని.