దళితులపై జరిగిన దాడుల విషయంలో చర్చకు టీడీపీ సిద్ధమా..?
టీడీపీ హయాంలో దళితులపై జరిగిన దాడుల విషయంలో చర్చకు సిద్ధమా? అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఎవరైనా దళితుడిగా పుట్టాలి అపుకుంటారా అని చంద్రబాబు అన్నప్పుడు టీడీపీ దళితుల ఏమైపోయారు?.. జగన్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా చేసిన సంక్షేమంపై చర్చకు టీడీపీ రాగలుగుతుందా? అని ఆయన సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వంలో మేము లబ్దిదారులం.. పేద వర్గాలకు ఇళ్ళు ఇస్తుంటే కోర్టుకు వెళ్ళి అడ్డుకోవటానికి చేసిన కుట్రల పై టీడీపీ నేతలు చర్చకు రాగలరా? అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
చంద్రబాబు పక్షాన మాట్లాడటానికి టీడీపీ దళిత నేతకు సిగ్గు రావటం లేదా? అని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. నక్కా ఆనంద బాబు ఒళ్ళు బలిసి మాట్లాడకూడదు.. అనంత బాబు విషయంలో కోర్టు ఏ విధానం తీసుకుంటే వైసీపీ అదే విధానాన్ని అనుసరిస్తుంది అని ఆయన అన్నారు. పేద ప్రజలకు ఇళ్లు, స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపిన నీచ చరిత్ర టీడీపీది అని మంత్రి పేర్కొన్నారు. ఇంగ్లీషు మీడియం చదవాలనుకున్న పిల్లలకు ఆ ఛాన్స్ రాకూడదని కోర్టులకు వెళ్లారు.. దళితులకు అసైన్డ్ భూములను అప్పగించిన సీఎం జగన్‌ని చూసి మిగతా రాష్ట్రాలు వారి మ్యానిఫెస్టోలో పెట్టుకుంటున్నారు అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయుడు.. సైంటిస్టులకు ప్రధాని సూచన
గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన సన్నాహాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మిషన్ సన్నద్ధతను అంచనా వేయడానికి ఈ సమావేశం నిర్వహించబడింది. ఉన్నత స్థాయి సమావేశంలో ఇస్రో శాస్త్రవేత్తలు సమగ్ర నివేదికను ప్రధానికి అందించారు. ఇందులో మిషన్‌కు సంబంధించిన అనేక ముఖ్యమైన సమాచారం ఉంది.
2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయుడిని పంపాలని, 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ కోరినట్లు సమావేశానికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అక్టోబరు 21న జరగనున్న గగన్‌యాన్ మిషన్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ వెహికల్ తొలి విమాన సన్నాహాలను సమీక్షించేందుకు జరిగిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
రాజుల సొమ్ము రాళ్ల పాలు అనే చందంగా ఉంది చంద్రబాబు పరిస్థితి
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి నేతలు అసత్య ఆరోపణలు చేయడంపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఆధారాలు చూపకుండా జైల్లో ఎవరు పెట్టారు చంద్రబాబును అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి సంబంధం ఏంటి అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు పెట్టడమే మా బాధ్యత.. ఏ ఆధారాలు లేకుండానే సీఐడీ, ఏసీబీ, హైకోర్టు, సుప్రీం కోర్టులు చంద్రబాబును జైల్లో ఉంచారా అని ఆయన అడిగారు.
తన అపారమైన మేధస్సును చంద్రబాబు ఉపయోగించి సుమారుగా 19 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు అని పేర్నినాని ఆరోపించారు. ప్లిడర్లు అందరూ చంద్ర బాబు పాపపు సొమ్ముతో పండుగ చేసుకుంటున్నారు.. సాక్ష్యాలు లేకుండా ఏ కోర్టు అయినా ఏన్నాళ్ళు వుంచుతుంది జైలులో.. ఇప్పటికీ ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్కిల్ డిపార్ట్మెంట్ లో అవినీతి జరిగిందని కేసులు నమోదు చేసింది.. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, జీఎస్టీ డిపార్ట్మెంట్ లు అవినీతి జరిగినట్లు కేసులు నమోదు చేశాయని ఆయన తెలిపారు. వాటన్నిటినీ ప్రామాణికంగా చేసుకొని విచారణ చేసి కేసు నమోదు చేసింది సీఐడీ డిపార్ట్మెంట్ అని పేర్నినాని వెల్లడించారు.
సిద్దిపేట దశాబ్దాల కలను నిజం చేసిన నాయకుడు కేసీఆర్
బీఆర్‌ఎస్ పార్టీ నేడు సిద్ధిపేటలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ కలను నిజం చేసిన సిద్దిపేట పురిటిగడ్డ మన సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. ఇది ఎన్నికల ప్రచార సభలగా లేదని.. మన కలను నిజం చేసిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞత సభలా అనిపిస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట దశాబ్దాల కలను నిజం చేసిన నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. కేసీఆర్ ని కారణజన్ముడు అంటారని, ఆనాటి సీఎం ఎన్టీరామారావుకి సిద్దిపేట జిల్లా కావాలని సీఎం కేసీఆర్ వినతి పత్రం ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆయనే సిద్దిపేటను జిల్లా చేశారన్నారు. సిద్దిపేటకి రైలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని మంత్రి హరీష్ రావు అన్నారు.
బీజేపీ ఓట్లు చీల్చెందుకే ఆకుల లలితను కాంగ్రెస్ లోకి పంపుతున్నారు
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ బీజేపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి, కవితలు వ్యాపార భాగస్వాములు.. ఇద్దరూ ఒకే కంపెనీ లో డైరెక్టర్‌లు అని ఆయన అన్నారు. బోధన్, నిజామాబాద్ అర్బన్ కు ఎమ్మెల్సీ కవిత ఇంఛార్జి గా ఉన్నారని, ఆకుల లలితను రేవంత్ కు చెప్పి కాంగ్రెస్ కు కవిత నే పంపిస్తున్నారన్నారు. బీజేపీ ఓట్లు చీల్చెందుకే ఆకుల లలితను కాంగ్రెస్ లోకి పంపుతున్నారని, డీఎస్ ను మోసం చేసి దిగ్విజయ్ సింగ్ కు డబ్బులు ఇచ్చి ఆకుల లలిత ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీ సర్కార్ వెంటనే కుల గుణన చేపట్టాలి..
బీసీ కుల గణనతో సమూల మార్పులు వస్తాయని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. కుల గణన వల్ల అన్ని వర్గాలకూ లబ్ధి చేకూరుతుంది.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుల గుణన చేపట్టాలి.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ కులాల గణనను చేపట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు, ఎన్జీఓలు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులూ అందుబాటులో ఉంటారు.. వెంటనే ఏపీలో కుల ఆధారిత జనగణన ప్రారంభించి చిత్త శుద్ధిని నిరూపించుకోవాలి అని గిడుగు రుద్రరాజు అన్నారు.
అయితే, ఈ నెల 21న కదిరిలో కులగణనపై సమావేశం ఏర్పాటు చేశామని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. కుల గణన ప్రాముఖ్యాన్ని వివరిస్తూ పీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేస్తాం.. నవంబర్ 7న నంద్యాల, 9న విజయనగరం , 10వ శ్రీకాకుళం, 11వ తేదీన విశాఖల్లో కులగణనపై సమావేశాలు.. ఈ నెల 30వ తేదీన ఏపీ పీసీసీ కొత్త కమిటీ సమావేశం.. ప్రస్తుతం ఏపీలో ఇద్దరు నేతల మధ్య రాజకీయం నడుస్తుంది అని ఆయన అన్నారు.
కేటీఆర్ మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు… ఆదరించి గెలిపించండి..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలోనే నేడు సిరిసిల్లలో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అప్పర్ మానేరు నుంచి సిరిసిల్ల వరకు మానేరు సజీవ జల ధార గా మారిందన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో మానేరు మట్టి కొట్టుకుపోయిందని, సిరిసిల్లలో ఆత్మహత్యలు వద్దని వాల్ రైటింగ్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నానన్నారు. రాష్ట్రం వచ్చాక చేనేత నేతన్నల ఆత్మహత్యలు అపగలిగినమని, షోలాపూర్ ఎట్లుంటదో సిరిసిల్ల అలా అవుతుందన్నారు. నేతన్నలకు ఉపాధి పేదలకు బట్టలు అందించే విధంగా కృషి చేశామని, కొందరు దుర్మార్గులు బతుకమ్మ చీరలు కాలబెట్టారు… వారిని బతుకమ్మ చీరలు ఎవరు కట్టుకోమన్నారు? బలవంతం చేశామా? అని కేసీఆర్ అన్నారు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సాలకు మూడు అంచెల భద్రత
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సాలకు మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశామని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 1800 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు.. గరుడ సేవ రోజు 1253 మంది పోలీసులు అదనంగా బందోబస్తులో పాల్గొంటారు.. ఈనెల 19 న గరుడ వాహన సేవకు పటిష్ట మైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. అలిపిరి దగ్గర ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం.. బయట ప్రాంతాలు నుంచి వాహనాల్లో వచ్చే భక్తులకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
ఈ నెల 19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు అని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తేల్చి చెప్పారు. తిరుమలలో 32 పార్కింగ్ ప్రాంతాల్లో 15 వేల వాహనాలు పట్టే విధంగా పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. తిరుమల మాడ వీధి గ్యాలరీలో లక్ష 20 వేల మందికి మాత్రమే సామర్థ్యం ఉంది.. గరుడ వాహనం సమయంలో మాడ వీధుల్లోకి వెళ్ళే విధంగా ఐదు క్యూ లైన్ పాయింట్ ఏర్పాటు చేశారు.. భక్తులు సంయమనం పాటించాలి అని ఆయన తెలిపారు. చిన్న పిల్లలకు జియో ట్యాగింగ్ విధానం అందుబాటులో ఉంటుంది అని ఎస్పీ వెల్లడించారు.
వారికి దీపావళి కానుక.. ఒక గ్యాస్ సిలిండర్ ఫ్రీ..
ఉజ్వల పథకం లబ్ధిదారులకు దీపావళి కానుకగా ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ప్రకటించారు. బులంద్‌షహర్‌లో జరిగిన కార్యక్రమంలో రూ.632 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్టులలో ప్రారంభోత్సవం చేసిన రూ.208 కోట్ల విలువైన 104 ప్రాజెక్టులు, శంకుస్థాపన చేసిన రూ.424 కోట్ల విలువైన 152 ప్రాజెక్టులు ఉన్నాయి.
“ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల యోజన ద్వారా ప్రతి కుటుంబానికి బహుమతిని అందించారు. సిలిండర్ ధరలను రూ.300 తగ్గించారు. ఇప్పుడు మేము ప్రతి ఉజ్వల యోజన కనెక్షన్ లబ్ధిదారునికి దీపావళి కానుకగా ఒక వంట గ్యాస్ సిలిండర్‌ను ఉచితంగా అందించాలని నిర్ణయించాము.” అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 2014లో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు పొందడం చాలా కష్టమైన పని అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే సుమారు 1.75 కోట్ల కుటుంబాలు ఉజ్వల పథకం ద్వారా లబ్ధి పొందాయని ఆయన చెప్పారు. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన అనేది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్ కోసం ఆర్థిక సహాయాన్ని అందించే కేంద్ర ప్రభుత్వ చొరవ.
పురంధేశ్వరి బీజేపీ నుంచి వచ్చి చంద్రబాబు, లోకేశ్ కు కోవర్టుగా పని చేస్తుంది..?
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి సచివాలయంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబం పై హాట్ కామెంట్ చేశారు. దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ నుంచి వచ్చి చంద్రబాబుకు ఆయన కొడుకు కోవర్టుగా పనిచేయడానికి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. అలాగే చంద్రబాబు ఆరోగ్యంపై రకరకాలుగా చెప్తున్నారు.. కోడలు నారా బ్రాహ్మణి చంద్రబాబు కిడ్నీ చెడిపోయింది అని ఆయన భార్య భువనేశ్వరి ఆరోగ్యం క్షీణించిందని అంటున్నారు అంటూ డిప్యూటీ సీఎం ఆరోపించారు.
మా రోజుల్లో అప్పటి పాక్ టీమ్ ఎలా ఉండేది అంటే..?
అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ లో టీమిండియా విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ఈసారైనా భారత్ జోరుకు బ్రేకులు వేద్దామన్న పాక్ కల.. కలగానే ఉండిపోయింది. వరుసగా వరల్డ్ కప్ ల్లో భారత్ 8 మ్యాచ్ ల్లో గెలిచింది. భారత బౌలర్ల దాటికి పాకిస్తాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 155/2 స్కోరుతో ఉన్న పాకిస్తాన్.. 36 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ 86, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించడంతో 7 వికెట్ల తేడాతో టీమిండియాకి ఘన విజయం దక్కింది. ఇదిలా ఉంటే.. టీమిండియాపై పాకిస్థాన్ ఓటమి తర్వాత బాబర్ అజామ్ జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతని సొంత దేశానికి చెందిన పలువురు మాజీ ఆటగాళ్లు జట్టు వైఖరి, బాబర్ అజామ్ కెప్టెన్సీపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలో పాక్ జట్టుపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
నన్ను సీఎం చేసింది, ఇంత ఎత్తుకు పెంచింది సిద్దిపేట గడ్డే
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలోనే నేడు సిద్ధిపేటలో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సిద్దిపేట ఊళ్ళల్లో ఎవరైనా ఉన్నారా అందరూ ఈ సభకే వచ్చారా అని అన్నారు. లెక్కపెట్టలేనంత మంది వచ్చారని, జనని జన్మ భూమిచ్చా స్వర్గదపి గరీయసి.. సిద్దిపేట పేరు విన్న, చూసిన నాకు కలిగే భవన ఇది అని ఆయన అన్నారు. నన్ను సీఎం చేసింది, ఇంత ఎత్తుకు పెంచింది సిద్దిపేట గడ్డేనని, నన్ను ఇంత వాడిని చేసినా నా మాతృభూమికి నమస్కారమన్నారు కేసీఆర్.
అంతేకాకుండా.. ‘ఈ గడ్డ రుణం నేము ఏమిచ్చినా తీర్చుకోలేను. తన పాత మిత్రులను గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్. మిషన్ భగీరథ అమలు అవుతున్నది అంటే సిద్దిపేట వేదికగా నేను పెట్టిన పథకమే. చింతమడకలో నేను చిన్న వాణ్ణి ఉన్నప్పుడు నాకు తాగడానికి పాలు లేకపోతే ఓ ముదిరాజ్ తల్లి నాకు పాలు పట్టింది. ఆనాడు సాగు నీళ్లు లేని సిద్దిపేటకి మొండి ధైర్యంతో మీ దివేనలతో ముందుకు వెళ్లిన. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది సిద్దిపేట గడ్డనే. నేను ఎక్కడికి పోయినా కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని మొక్కి పోతా. సిద్దిపేట ఎలా అభివృద్ధి జరిగిందో చెబితే హరీష్ రావుని పొగిడినట్టు అవుతుంది. నేను ఉప ఎన్నిక కోసం కరీంనగర్ వెళ్తే ఆరడుగుల బులెట్ హరీష్ రావుని మీకు ఇచ్చి పోయిన. హరీష్ రావు మీద మన మంత్రులు జోక్ వేస్తారు.