వామ్మో..! ఎలుక పాలు 18 లక్షలా..!
నిత్య జీవితంలో పాలకి చాల ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. మనం సాధారణంగా గేదె లేదా ఆవు పాలను వినియోగిస్తుంటాము. కొందరు మేక పాలు కూడా వినియోగించుకుంటారు. అయితే గత కొంత కాలంగా కొన్ని వ్యాధులను నివారిస్తుంది అంటూ గాడిద, ఒంటె పాలను కూడా విక్రయిస్తున్నారు. ఈ పాల ధర వేళల్లో ఉంటుంది. దీనికే మనం ఆశ్చర్య పోతుంటాము. అయితే ఎక్కడైనా లీటరు పాల ధర లక్షల్లో ఉంటుందా..? అంటే ఉంటుంది అంటున్నారు కొందరు విజ్ఞావంతులు. అది కూడా పరిమాణం లో పెద్దగా ఉండే జంతువు పాలు కాదు. ఆ జంతువు పరిమాణంలో చాలా చిన్నగా ఉంటుంది. ఇంతకీ ఆ జంతువు ఏంటి అనుకుంటున్నారా..? అదే ఎలుక.. ఏంటి.. ఎలుక పాలకు లక్షల్లో ధర ఉందా..? చాల్లే నమ్మే వాళ్ళు ఉంటె ఏనుగు ఏరోప్లేన్ ఎక్కింది అని చెప్తారు మీరు అని అనుకుంటున్నారా..?
మమ్మల్ని కాదని కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రాదు: సీపీఐ నారాయణ
తమని కాదని కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కుదిరిందని, సీట్ల సర్దుబాటు ఇంకా కుదరాల్సి ఉందన్నారు. కమ్యూనిస్టులది విశాల హృదయం అని, చట్ట సభల్లో తమ వాయిస్ ఉండాలనేదే ఆలోచన అని నారాయణ తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీల మధ్య పొత్తుల గురించి చర్చలు జోరుగా జరుగుతున్నాయి.
గత ఎన్నికల్లో మహాకూటమిలో కమ్యూనిస్టు పార్టీలు అయిన సీపీఎం, సీపీఐలను కలుపుకున్న కాంగ్రెస్.. ఈ సారి కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో వామపక్ష పార్టీల ప్రాబల్యం ఉండటంతో.. దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్ ముమ్ముర ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గాల్లో పార్టీలు కూడా పొత్తుకు సై అంటున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పొత్తుల గురించి సీపీఎం, సీపీఐలతో చర్చలు సాగిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ పోటీ..? క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుండగా.. ఎన్నికల పోలింగ్ నవంబర్ 30 ఒకే ఫేజ్‌లో జరగనుంది.. ఇక, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3వ తేదీన ప్రకటించనున్నారు.. అయితే, తెలంగాణ ఎవరెవరు పోటీ చేస్తారు అనేది ఉత్కంఠగా మారింది.. ఇప్పటికే పోటీపై జనసేన క్లారిటీ ఇచ్చింది.. టీడీపీ సై అంటోంది.. ఏపీలో లాగా.. తెలంగాణలోనూ టీడీపీ-జనసేన కలిసి ముందుకు వెళ్తాయా? అనేది తెలియాల్సి ఉంది.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? తెలంగాణలో పోటీ చేస్తుందా? అనే చర్చ సాగుతోన్న సమయంలో.. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు..
ప్రజలు నా వైపే ఉన్నారు.. మళ్లీ గెలుపు నాదే: మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైకోర్టు తీర్పుపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. పని గట్టుకొని తనపై అక్రమ కేసులు వేసి ఇబ్బంది పెట్టారని.. చివరకు న్యాయం, ధర్మమమే గెలిచిందన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి ఈరోజు హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ.. 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
శ్రీనివాస్ గౌడ్ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించిన తర్వాత.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అది చట్టవిరుద్ధమని, శ్రీనివాస్ గౌడ్ ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఇరు వర్గాల తరఫున వాదనలు విన్న హైకోర్టు.. ఈరోజు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.
చంద్రబాబు క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. అదే రోజు వాదనలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.. కాగా, సీఐడీ తరపున నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.. తనపై పెట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని పేర్కొంటూ క్వాష్ పిటిషన్ వేసిన విషయం విదితమే.
కాగా, సుప్రీంకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఈ రోజు వాడివేడిగా వాదనలు జరిగాయి.. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.. 17ఏ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అప్పికొండ బీచ్ యువతి కేసులో మరో ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..
అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్య చిక్కున్న మచిలీపట్నంకి చెందిన కావ్య అనే యువతిని జాలర్లు కాపాడారు. యువతి తన ప్రియుడితో కలిసి బీచ్ కి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమాదానికి గురైంది. NTV తో మాట్లాడిన యువతి తల్లి.. తన కూతుర్ని వర్మ అనే యువకుడు కొండ పై నుండి తోసేసి యువతి దగ్గర ఉన్న డబ్బులు నగలు తీసుకుని పారిపోయాడని ఆరోపించింది. కాగా యువతి మాత్రం కొండ పై నుండి జారిపడినట్లు చెప్పింది. అయితే ప్రస్తుతం మరో ట్విస్ట్ ని తెలియచేసారు గాజువాక సౌత్ ఎసిపి త్రీనాథ్. NTV తో మాట్లాడిన గాజువాక సౌత్ ఎసిపి త్రీనాథ్ ఈ ఘటన గురించిన విషయాలను వెల్లడించారు. నిన్న అప్పికొండ సముద్ర తీరంలో ఓ అమ్మాయి పడిపోయి ఉంటే స్థానికంగా ఉన్న మత్యకారులు రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నామని.. కాగా యువతి కాళ్లకు బలమైన గాయాలు తగిలి ఉండడంతో ఆమెను కెజిహెచ్ కు తరలించామని పేర్కొన్నారు.
ఇజ్రాయిల్ ప్రధానితో మాట్లాడిన నరేంద్ర మోడీ.. అండగా ఉంటామని హామీ..
ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూతో భారత ప్రధాని నరేంద్రమోడీ ఫోన్‌కాల్ లో మాట్లాడారు. ఇజ్రాయిల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఖండిస్తోందని నరేంద్రమోడీ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
నెతన్యాహుతో ఫోన్ కాల్ లో మాట్లాడానని, ఈ క్లిష్ట సమయంలో భారత్ ఇజ్రాయిల్ కి అండగా ఉంటుందని, భారతదేశం అన్ని రూపాల్లోని తీవ్రవాదాన్ని ఖండిస్తోందని పోస్టు చేశారు. అంతకుముందు శనివారం ఇజ్రాయిల్‌పై హమాస్ మెరుపుదాడి తర్వాత భారత ప్రధాని మోడీ ఇజ్రాయిల్ కి అండగా ఉంటామని ప్రకటించారు. చాలా మంది ప్రజలు చనిపోవడం తనను షాక్‌కి గురిచేసిందని అన్నారు.
16న కొత్తపల్లిలో బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తా
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం చిట్కుల్ గ్రామంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నేత నీలం మధు ముదిరాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్నారు. కార్యకర్తల అభిప్రాయాలు, అభిష్టం మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు నీలం మధు. దుర్గాదేవి పండుగ సందర్భంగా ఈ నెల 16న తేదీ నుంచి మీ బిడ్డనై ఇంటింటికీ వస్తున్నా అని ఆయన వెల్లడించారు. 16 తేదీన కొత్తపల్లిలో బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తానని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. ఏ పార్టీ అవకాశం ఇచ్చినా ఆ కండువా కప్పుకుని బరిలో దిగుతా అని ఆయన స్పష్టం చేశారు.
తప్పు చేసిన వారు ఎంతటి వారైనా న్యాయస్థానాల ముందు నిలబడాల్సిందే
టీడీపీపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా న్యాయస్థానాల ముందు నిలబడాల్సిందేనని అన్నారు. అన్నీ ఆధారాలతోనే దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టాయని.. ఎన్ని కేసులు పెట్టినా భయపడనని చెప్పిన లోకేష్ ఢిల్లీ వెళ్లి కూర్చున్నాడని మంత్రి తెలిపారు. 20 మంది అడ్వకేట్లను చుట్టూ కూర్చోబెట్టుకుని బెయిల్ కోసం ప్రార్దనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ స్కాంలో ఆయన పాత్ర స్పష్టమైందని చెప్పారు. ఇవి రాజకీయ ప్రేరేపిత కేసులు కావని.. వాళ్ళు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. కేసుల రద్దుకు, బెయిల్ కోసం ఎన్ని పిటిషన్లు వేసినా ఏమయ్యాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకుని ఈరోజు కేసులు వచ్చాయంటే ఎలా అని విమర్శించారు.
ఎవరు అవునన్నా కాదన్నా మూడోసారి బీఆర్ఎస్ విజయం ఖాయం
హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. హుస్నాబాద్ లోని కార్యకర్తల మీద నమ్మకంతో సీఎం కేసీఆర్ హుస్నాబాద్ లో మొదటి ఎన్నికల సభ పెడుతున్నారన్నారు. హైదరాబాద్ కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ కలిసి వచ్చిన నియోజకవర్గమని సీఎం కేసీఆర్ అన్నారన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా మూడోసారి బిఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు. ఆసత్య సర్వేల పేరిట అధిరంలోకి వస్తామని కాంగ్రెసోల్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దాయనియ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు హరీష్ రావు.
ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు సమీక్ష
ఈ నెల 15 నుంచి ఇంద్రకీలాద్రిపై ప్రారంభం కానున్న దసరా ఉత్సవాల ఏర్పాట్ల పై అధికారులు సమీక్షించారు. ఈ సమీక్షలో ఎండోమెంట్ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని, వీఎంసీ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్, ఈఓ భ్రమరాంబ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎండోమెంట్ సీఎస్ కరికాల్ వలవన్ మాట్లాడుతూ.. దసరాకి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిగా పరిశీలించామని తెలిపారు. క్యూలైన్లు, కేశఖండనశాల, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాలు, లడ్డు ప్రసాదాల కౌంటర్లు పరిశీలించామన్నారు.
మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించాం
నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలోనే కల్లుగీత కార్మికులకు న్యాయం జరిగిందన్నారు. 70 వేల కుటుంబాలకు ఉపాధి పొందారని, కల్లుగీత కార్మికుల భీమా ను 5 లక్షలకు పెంచామననారు కవిత. అంతేకాకుండా.. 2014 తర్వాత కల్లుషాపు లను పునరిద్దరించి ఈత, తాటి వనాలు ప్రోత్సహించామని, మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. డిసెంబర్ 3 తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ పాలనలో బీసీ లకు అన్యాయమన్నారు. బీసీలకు హాస్టళ్లు లేవని, డిగ్రీ కాలేజీ లు లేవని, తెలంగాణలో 7 లక్షల మంది బీసీ లకు కల్యాణ లక్ష్మీ వర్తింపజేశామన్నారు. మాది బీసీ ల ప్రభుత్వమని ఎమ్మెల్సీ కవిత ఉద్ఘాటించారు.
చంద్రబాబు అరెస్ట్ తనకు తెలియదని జగన్ చెప్పడం అతని మానసిక స్థితికి నిదర్శనం
సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తనకు తెలియదని జగన్ చెప్పడం అతని మానసిక స్థితికి నిదర్శనమని ఆరోపించారు. జగన్ లోని సైకోయిజానికి తోడు పిచ్చికూడా బాగా ముదిరినట్టుందని మండిపడ్డారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు అతని తల్లి, చెల్లి తప్ప ఎవరూ మాట్లాడలేదని తెలిపారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాల నుంచి తప్పించుకోవడానికే జగన్ నంగనాచి కబుర్లు చెబుతున్నాడని నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేయడమంటే.. చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపినంత తేలిక్కాదు జగన్ పై ఆనంద్ బాబు ఫైరయ్యారు. ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి.. కేసుల భయంతో మోడీ, అమిత్ షా కాళ్లు పట్టుకోవడమేనా జగన్ విశ్వసనీయత అని దుయ్యబట్టారు.