గంజాయి వ్యాపారులు, డ్రగ్ డీలర్లు, బ్లేడ్ బ్యాచ్‌లకు జగన్‌ను గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందేమో అని పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. గంజాయి అమ్మడం, ఆడపిల్లలను వేధించడం నేరం కాదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయన్నారు. తాజాగా జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. గతంలో మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజలంటే జగన్ కి కోపం రోజురోజుకూ పెరిగిపోతోందని ఆరోపించారు.
సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తనకు తెలియదని జగన్ చెప్పడం అతని మానసిక స్థితికి నిదర్శనమని ఆరోపించారు. జగన్ లోని సైకోయిజానికి తోడు పిచ్చికూడా బాగా ముదిరినట్టుందని మండిపడ్డారు.
Ayyanna Patrudu Arrest: మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్నది అభియోగం.
విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను టీడీపీ నేతలు నక్కా ఆనంద్‌బాబు, పీతల సుజాత, మాణిక్యాలరావు, ఎంఎస్ రాజు కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌కు టీడీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అనంతబాబు విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. అనంతబాబును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరామన్నారు. ఏజెన్సీ ఏరియాలో అనంతబాబు…
కాకినాడ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. ఏపీలో పొత్తు రాజకీయాల చర్చకు దారి తీశాయి. అధికార పార్టీ నేతలందరూ ఒక్కాసారిగా దిగొచ్చి.. చంద్రబాబుకు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేదని, అందుకే పొత్తులకు సిద్ధమయ్యారంటూ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రంగంలోకి దిగి, తన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలంటూ తాను కాకినాడలో…
ఏపీలో కొత్త జిల్లాల విభజనపై మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శలు చేశారు. వేమూరు నియోజకవర్గ ప్రజలకు ఈరోజు దుర్దినం అని ఆయన అభివర్ణించారు. అప్పుడు రాష్ట్ర విభజన వల్ల ఎంత బాధపడ్డామో.. ఇప్పుడు జిల్లాల విభజన వల్ల అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ రెండు ఘటనలు ప్రజలకు చీకటి దినాలుగా నిలిచిపోతాయన్నారు. జిల్లాల విభజనతో వేమూరు నియోజకవర్గ ప్రజలకు తీరని నష్టం కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేమూరుకు శతాబ్దాలుగా తెనాలితో ఉన్న అనుబంధం…