జగిత్యాలలో మైనర్ బాలిక మిస్సింగ్ .. 24 గంటలు అయినా దొరకని ఆచూకీ
జగిత్యాలలో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక మిస్సింగ్ కలకలం రేపింది. 24 గంటలు అయినా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని విజ్‌డమ్ హైస్కూల్ హాస్టల్లోనే ఇబ్రహీం పట్నంకు చెందిన బాలిక పదవ తరగతి చదువుకుంటుంది. నిన్న మధ్యాహ్నం భోజన సమయంలో స్నేహితులని కలిసి వస్తానని తోటి విద్యార్థినులకు చెప్పి వెళ్లింది. అర్ధరాత్రి అయినా మళ్లీ హాస్టల్‌కు తిరిగి రాలేదు. దీంతో స్కూల్ యాజమాన్యం బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పాఠశాల వద్దకు చేరుకున్న బాలిక కుటుంబ సభ్యులు మెట్‌పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
వైఎస్ వివేకా కేసు.. వారికి సుప్రీంకోర్టు నోటీసులు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన కూతరు సునీతరెడ్డి.. ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి హైకోర్టు జారీ చేసిన బెయిలు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. అంతేకాకుండా వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మరో పిటిషన్ వేసింది సీబీఐ.. ఇక, సునీత రెడ్డి, సీబీఐ పిటిషనల్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.. మరోవైపు తదుపరి విచారణ మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు..
తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ విగ్రహం పెట్టట్లేదు కదా.. కేటీఆర్ పై లక్ష్మణ్ ఫైర్..
సోనియా గాంధీ తెలంగాణ తల్లి.. తెలంగాణ తల్లిగా సోనియాగాంధీ విగ్రహం పెట్టట్లేదు కదా? కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడితే చేసేదేమీ లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. విజయోత్సవ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారు అంటున్నాడు కేటీఆర్.. పదేళ్లు మూత పడ్డ కాలేజీలు తెరిచామని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి మేము అంబేద్కర్ పేరు పెట్టామన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ పేరు మార్చారని గుర్తుచేశారు. కేసీఆర్ సీఎంవోలో ఒక్క దళిత ఐఏఎస్ అధికారి ఐనా ఉన్నారా..? అని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్‌పై విజయసాయిరెడ్డి ట్వీట్ వైరల్..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.. అయితే, ఉన్నట్టుండి ఆయన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఎంపీ సాయిరెడ్డి ట్వీట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఇక, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్‌లో తాజాగా చేసిన పోస్ట్ (ట్వీట్) విషయానికి వస్తే.. “ఏపీకి నాయకత్వం, ప్రాతినిధ్యం వహించటానికి ఏపీ ప్రభుత్వ ఎన్డీయే లీడర్లలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదర్శవంతమైన వ్యక్తి.. ” అంటూ ప్రశంసలు కురిపించారు విజయసాయిరెడ్డి.. ఇదే సమయంలో.. “ఏపీ లాంటి ఒక యువ రాష్ట్రానికి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించ లేడు” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై సెటైర్లు వేసిన ఆయన.. “పవన్ కల్యాణ్‌కు ఉన్న జాతీయ ప్రజాదరణ, వయసు రీత్యా నేను ఇది నమ్ముతున్నాను..” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.. అయితే, పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది..
రెవెన్యూ సదస్సులో వీఆర్‌వోపై ఫిర్యాదు.. తక్షణమే సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశాలు
ఏపీలో ఈ రోజు రెవెన్యూ గ్రామ సభలు ప్రారంభమయ్యాయి.. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది.. అయితే, నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పల్లెలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక, సీఎం సహాయ నిధికి, సంబంధించి స్థానిక వీఆర్వో గంగన్న తనను 2 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడని, గ్రామ సభలో ఓ మహిళ మంత్రికి ఫిర్యాదు చేసింది. దీంతో.. వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు మంత్రి.
కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను అపాయింట్‌మెంట్ అడిగాం..
తెలంగాణ ప్రభుత్వం విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సచివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈనెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కూడా ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తారని తెలిపారు. దీంతో ప్రభుత్వం తరపున ఆహ్వాన పత్రిక అందించేందుకు ఇప్పటికే కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వారి సిబ్బందికి సమాచారం ఇచ్చామని మంత్రి పొన్నం అన్నారు.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలకు నెల రోజుల్లో పరిష్కారం
వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి కబ్జాలకు పాల్పడ్డారని మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. సెంటు భూమి నుంచి వేల ఎకరాల వరకూ వైసీపీ ప్రభుత్వంలో కబ్జా జరిగిందన్నారు. పరిశ్రమలు, పోర్టులను సైతం కబ్జా చేశారని ఆరోపించారు. గత అరాచక ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, నాయకులు దోపిడీ చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. నెల్లూరు సిటీ నియోజగవర్గంలోని ఏసీ నగర్‌లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో మంత్రి నారాయణ, కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు.
ఏపీలోని నాలుగు పంచాయతీలకు అవార్డులు.. అభినందించిన పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అనుసరిస్తున్న విధానం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలోని నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అత్యుత్తమ పనితీరును కనబరిచిన పంచాయతీలకు కేంద్ర సర్కారు ఇచ్చే జాతీయ స్థాయి పురస్కారాలుకు నాలుగు గ్రామాలు ఎంపిక కావడం విశేషం. రాష్ట్రంలోని నాలుగు పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు లభించాయి. నాలుగు విభాగాల్లో అవార్డులు లభించగా.. అవార్డులు పొందిన పంచాయతీలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.
నాడు బీఆర్ఎస్ ఉద్యోగ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది
అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా నాలుగు నెలల కోసం వోట్ ఒన్ అకౌంట్ బడ్జెట్ పెట్టామని, 3లక్షల 69 వేల 286 మంది రెగ్యులర్ ఉద్యోగులకు, 2 లక్షల 86 వేల పెన్షనర్లకు నెల మొదటి రోజే జీతాలు చెల్లిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉద్యోగుల ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు నెలనెలా జీతాలు చెల్లిస్తున్నామని, నాడు బీఆర్ఎస్ ఉద్యోగ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆయన ఆరోపించారు. నాటి మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. డిసెంబర్ వరకు 52 వేల 118 కోట్లు అప్పు తెచ్చారని, గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు. 64516 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. 24 వేల కోట్లు క్యాపిటల్ ఎక్స్ పెండించర్ అని, 61,194 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. తెచ్చుకున్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ గాలికి వదిలేసిందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశామని, రాబోయే రోజుల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను upsc మారిదిగా మారుస్తామన్నార భట్టి విక్రమార్క. ఇది ప్రజా విజయం. మేము ఏ విషయం దాచలేదు. అన్నింటికీ శ్వేతపత్రం విడుదల చేసామన్నారు.
ప్రజలు సంతోషంగా ఉన్నందునే ప్రభుత్వం పండగ నిర్వహిస్తోంది
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) శుక్రవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరి ఆనందానికి కారణమవుతోందని పేర్కొన్నారు. “ప్రజలు సంతోషంగా ఉన్నందునే ప్రభుత్వం పండగ నిర్వహిస్తోంది. ఈ ప్రజాపాలన పండగలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు. మహేష్ గౌడ్ ప్రకటన ప్రకారం, గత పదేళ్లలో బీఆర్ఎస్ కేవలం 50 వేల ఉద్యోగాలను అందించగలిగితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాది కాలంలో 50 వేలకుపైగా ఉద్యోగాలను కల్పించిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాన్ని ప్రజలు ఇంకా గుర్తుంచుకున్నారన్నారు. విద్యార్థుల కోసం మెస్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలను పెంచి, ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామన్నారు.