నాకు ప్రాణహాని ఉంది.. డీజీపీకి పోసాని ఫిర్యాదు
నారా లోకేష్ నుంచి నాకు ప్రాణహాని ఉంది.. నేను చస్తే దానికి కారణం లోకేషే అంటూ సంచలన ఆరోపణలు చేసిన ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి.. ఈ రోజు ఏపీ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకేష్ వల్ల నాకున్న ప్రమాదాన్ని డీజీపీకి చెప్పాను.. టీడీపీలో చేరమని నన్ను అడగటం, నేను నిరాకరించటం జరిగింది.. దీంతో లోకేష్ ఇగో హర్ట్ అయ్యిందని.. నాకు తెలిసినవాళ్లు నన్ను హెచ్చరించారు.. డీజీపీ దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్లానని వెల్లడించారు.. నాకు భద్రత కల్పిస్తానని డీజీపీ భరోసా ఇచ్చారని తెలిపారు పోసాని కృష్ణ మురళి. ఇక, ఎన్టీ రామారావునే వేసిన వాడు చంద్రబాబు.. నేనెంత? అని ప్రశ్నించారు పోసాని.. కాపు వర్గంపై ప్రేమ ఉందని చంద్రబాబు అంటున్నాడు.. నా కుటుంబం అంతా రాజకీయ సన్యాసం చేస్తున్నాం.. పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేస్తాను అని చంద్రబాబు చెప్పగలడా? అంటూ సవాల్ విసిరారు.. హత్య చేసే వాడు ఆధారాలు ఇస్తాడా? రామారావుకు వెన్నుపోటు పొడిచే ముందు చంద్రబాబు చెప్పాడా? అంటూ ప్రశ్నించారు. మరోవైపు.. జీవితంలో పోటీ చేయను.. టికెట్ ఇచ్చినా గెలువలేను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పోసాని.. సీఎం వైఎస్ జగన్ అంటే నాకు పిచ్చి, ప్రాణం.. కానీ, లోకేష్ తో నేను తూగ గలనా..? అంటూ ఎద్దేవా చేశారు. ఇక, బట్టలు విప్పదీసి ఏం చూస్తారు? ప్రతిపక్ష నేతలు ఎందుకు ఇలా మాట్లాడతారు? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి.
టీడీపీకి టికెట్ ఇచినప్పుడు వల్లభనేని పశువుల డాక్టర్ కాదా? దేవతల డాక్టరా..? కొడాలి సైంటిస్టా..?
ఈ మధ్య గన్నవరం పాలిటిక్స్ మళ్లీ హీట్ పెంచాయి.. వైసీపీకి గుడ్‌బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ కండువా కప్పుకున్నారు.. మరోవైపు.. టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత వైసీపీలో చేరిన వల్లభనేని వంశీపై, కొడాలి నానిపై తెలుగుదేశం నేతలు ఆరోపణలు గుప్పిస్తు్నారు.. వాటికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని.. 2019లో గన్నవరం టికెట్ ఇచ్చినప్పుడు వల్లభనేని వంశీ పశువుల డాక్టర్ కాదా? అప్పుడు దేవతల డాక్టరా? 2004, 2009లో టీడీపీ టికెట్ పై గెలిచినప్పుడు కొడాలి నాని మైక్రోసాఫ్ట్ ఇంజనీరా? ఇస్రో చంద్రయాన్ సైంటిస్టా? అంటూ టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. వంశీ 2014లో టీడీపీ ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా పశువుల డాక్టరే అని గుర్తుచేసిన ఆయన.. ఇప్పుడు మాట్లాడుతున్న ఆ నాయకుడు వంశీ దగ్గర డబ్బులు అడుక్కున్నారు అని విమర్శించారు. వైసీపీలో ఉంటే కప్పులు కడుక్కునే వాడు, లారీ డ్రైవరా? మరి కప్పులు కడిగే వాడంటే ఇప్పటికీ చంద్రబాబు ప్యాంటు ఎందుకు తడుస్తోంది? అంటూ మండిపడ్డారు పేర్నినాని.. మోడీ కప్పులు కడగలేదా? అని ప్రశ్నించిన ఆయన.. ఓట్ల కోసం లారీ డ్రైవర్ల భుజాలపై చేతులు వేసి మాట్లాడుతున్నారు.. ప్రత్యర్థులను విమర్శించటానికి ఆ పేద వాళ్లను అవమానిస్తున్నాడు.. ఇది పెత్తందారి స్వభావం, కుల అహంకారం కాదా? అని విమర్శించారు. గుడివాడలో టీడీపీకి అభ్యర్థి పెట్టుకునే పరిస్థితి లేదన్న ఆయన.. లోకేష్ కు సిగ్గు శరం ఉంటే గుడివాడలో పోటీ చేయాలని సవాల్ చేశారు. లోకేష్ పనికి శుంఠ కావటం వల్లనే చంద్రబాబు దత్త పుత్రుడిని తెచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. తమ పాలనను తిరిగి తెస్తాం అని చెప్పుకోలేని దిక్కుమాలిన పరిస్థితి చంద్రబాబు, లోకేష్ ది అని సెటైర్లు వేశారు. అధికారం ఇస్తే జగన్ పథకాలను తెస్తాను అంటున్నాడు లోకేష్.. గతంలో హెరిటేజ్ పాలు, పెరుగు, నెయ్యి అమ్ముకోవడానికి పథకాలు పెట్టారు.. అన్నా క్యాంటీన్లు మూసేశారని అంటున్నారు. అసలు పెట్టింది ఎప్పుడు తీసేయటానికి? అని నిలదీశారు.
బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం రాజీనామా..
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రకటించారు. వారం పది రోజుల్లో ఏ పార్టీలోకి వెళ్లాలనేది నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన నకిరేకల్ లో తన అనుచరులతో సమావేశం అయ్యారు. నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ కోసం పనిచేసాను అని వేముల వీరేశం అన్నారు. నన్ను, నా అనుచరులను కేసులతో వేధించారు.. నా ఇబ్బందులను, కష్టాలను జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి చెప్పుకున్నా స్పందన రాలేదు.. నాలున్నర ఏళ్లు ఓపిక పట్టిన.. జిల్లాలో గ్రూప్ లను మంత్రి ప్రోత్సహిస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
ఆ రెండు పార్టీల్లో ఎవరికి ఓటేసినా.. మజ్లిస్ కు ఓటేసినట్లే..
చేవెళ్లలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరినీ చైతన్యం చేసి తెలంగాణను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి బీఆర్ఎస్ పార్టీని, అహంకార పూరిత కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీలు.. ఇద్దరూ ఇప్పుడు ఏకమై పనిచేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పగటికలలు కంటున్నది.. తెలంగాణలో 75 శాతం మంది.. ఈ అవినీతి, అక్రమ, అహంకార పూరిత, నియంతృత్వ పూరిత ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారు అని కిషన్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫి పేరుతో రైతులను మోసం చేస్తున్నారు.. నాలుగున్నర సంవత్సరాలుగా.. వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ పేరుతో.. లక్ష.. ఇంకో లక్ష అయింది.. ప్రభుత్వ భూములను అమ్ముకుంటా.. రైతు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ అంటున్నారు అని కిషన్ రెడ్డి ఆరోపించారు. కానీ, 60 శాతం రైతుల అకౌంట్లలో రుణమాఫి పడలేదని ఆయన అన్నారు.
ఉద్విగ్న క్షణాల్లో భారతావని.. షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్ ప్రక్రియ
చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టేందుకు అంతా సిద్ధమైంది. జాబిల్లిపైకి మన వ్యోమనౌక చంద్రయాన్-3 అద్భుతమైన క్షణాల కోసం యావత్ భారతావని ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. నెట్టింట ఆ ఉత్కంఠ కనిపిస్తోంది. చంద్రుడిపై ల్యాండర్ సురక్షితంగా దిగి, చరిత్ర సృష్టించాలని ప్రతీ ఒక భారతీయుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో ల్యాండర్ సురక్షితంగా దిగాలని ఆలయాల్లో హోమాలు, దర్గాల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేస్తుకున్న వ్యోమనౌక దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌కు ఉపక్రమిస్తోంది. ఇదిలా ఉండగా.. చంద్రయాన్-3 వ్యోమనౌక షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్ కానుంది. ఈ సాయంత్రం 5.44 గంటలకు ల్యాండర్ మాడ్యూల్ నిర్దేశిత ప్రాంతానికి చేరుకోనుంది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వెల్లడించింది. ” ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్(ఏఎల్‌ఎస్)ను ప్రారంభించేందుకు అంతా సిద్ధంగా ఉందని ఇస్రో ట్విట్టర్ వేదికగా తెలిపింది. “సాయంత్రం 5.44 గంటలకు ల్యాండర్ మాడ్యూల్ నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశానికి రానుంది. ఏఎల్‌ఎస్ కమాండ్‌ను స్వీకరించిన వెంటనే ల్యాండర్ మాడ్యూల్ థ్రాటల్‌బుల్ ఇంజిన్ల వేగాన్ని తగ్గించుకుంటూ ముందుకెళ్తుంది’’ అని ఇస్రో రాసుకొచ్చింది. ల్యాండింగ్ ప్రక్రియను సాయంత్రం 5.20 గంటల నుంచే ఇస్రో తమ వెబ్‌సైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. సాయంత్రం 5.44 గంటల తర్వాత ల్యాండింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత 17 నిమిషాల పాటు సాగే ప్రక్రియ సంక్లిష్టంగా ఉండనుంది. అందుకే దీన్ని ‘17 మినిట్స్ ఆఫ్ టెర్రర్’గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. గంటకు దాదాపు 6 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వ్యోమనౌక జోరుకు ఈ 17 నిమిషాల్లోనే కళ్లెం వేసి, చందమామ దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దించాలి. దీన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు. ల్యాండింగ్ పూర్తయిన తర్వాత వెంటనే వ్యోమనౌక కాళ్లలోని ‘టచ్‌డౌన్ సెన్సర్లు’.. ఆన్‌బోర్డ్ కంప్యూటర్‌కు మెసేజ్‌ను పంపుతాయి.
ట్యాంకర్, రోల్స్ రాయిస్ ఢీ.. ట్రక్కులోని ఇద్దరు మృతి, కారులోని వారు సేఫ్
హర్యానాలోని నూహ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్, రోల్స్ రాయిస్ కారు ఢీకొన్న ఘటనలో ట్యాంకర్‌లో ఉన్న ఇద్దరు మరణించగా.. లగ్జరీ కారులోని ప్రయాణికులు ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో రోల్స్ రాయిస్ తుక్కు తుక్కైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ-ముంబయి-బరోడా ఎక్స్ ప్రెస్ హైవేపై హర్యానాలోని నూహ్‌లో లగ్జరీ కారు రోల్స్ రాయిస్‌ను వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఉమ్రి గ్రామ సమీపంలో రాంగ్ రూట్‌లో వచ్చిన ఆయిల్ ట్యాంకర్ వేగంగా వెళ్తున్న రోల్స్ రాయిస్‌ను ఢీకొట్టినట్లు తెలిసింది. ట్యాంకర్ బోల్తాపడగా లగ్జరీ కారుకు మంటలంటుకున్నాయి. ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ నడుపుతున్న డ్రైవర్ రామ్‌ప్రీత్ , అతని హెల్పర్ కుల్దీప్ చనిపోయారు. ట్యాంకర్‌లో ఉన్న మరో వ్యక్తి గౌతమ్ గాయపడినట్లు తెలుస్తోంది. రోల్స్ రాయిస్‌లో ప్రయాణిస్తున్న చండీగఢ్ నివాసితులు దివ్య, తస్బీర్‌లుగా , మరొకరు ఢిల్లీ వాసి వికాస్‌గా గుర్తించారు. వీరు ముగ్గురు గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో రోల్స్ రాయిస్‌కి కొంచెం దూరంలో కారులో వస్తున్న వారి బంధువులు తక్షణం స్పందించి రక్షించినట్లు సమాచారం. ప్రమాదంలో మరణించిన ట్యాంకర్ డ్రైవర్ రామ్ ప్రీత్ , అతని హెల్పర్ కుల్దీప్‌లను ఉత్తరప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రుల నుంచి ప్రమాద వివరాలను సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని ఏఎస్‌ఐ తెలిపారు.
రెండు విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్ క్లియరెన్స్.. తప్పిన పెనుప్రమాదం
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తృటిలో పెనుప్రమాదం తప్పింది. రెండు విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుమతి ఇచ్చారు. చివరి క్షణాలను టేకాఫ్‌ను రద్దు చేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ఇచ్చిన ఆదేశాలతో టేకాఫ్‌ను నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లు అధికారులు వెల్లడించారు. రెండూ.. విస్తారా ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన విమానాలే కావడం గమనార్హం. ఆ రెండు విమానాల్లో ఒకటి టేకాఫ్ తీసుకోనుండగా, మరొకటి ల్యాండింగ్‌కు సిద్ధమైంది. ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్‌డోగ్రాకు వెళ్తున్న విమానం యూకే725 టేకాఫ్ తీసుకోనుండగా, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానం రన్‌పై ల్యాండింగ్ కానుంది. అయితే ఒకేసారి రెండింటికి సిగ్నల్స్ ఇవ్వడంతో రన్‌వేపై ఆ రెండు విమానాలు ఢీకొనే పరిస్థితి ఏర్పడింది. కానీ ఏటీసీ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ ప్రమాదం తప్పింది. దీంతో వెంటనే తమ తప్పును గుర్తించిన ఏటీసీ అధికారులు.. టేకాఫ్ ఆపేయాలని దిల్లీ-బాగ్‌డోగ్రా విమానం పైలట్‌కు సూచించారు. దీంతో వెంటనే ఆ విమానం వెనక్కి రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమయంలో రెండు విమానాల మధ్య దూరం కేవలం 1.8 కిలోమీటర్లు మాత్రేమే ఉంది. సాధారణంగా విమానం టేకాఫ్ అయ్యేప్పుడు రన్‌వేపైకి ఇతర విమానాలు, వాహనాలకు అనుమతి ఉండదు. అలాగే, ఒక రన్‌వేపై విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో పక్కనే ఉన్న మరో రన్‌వేపై విమానం ల్యాండింగ్‌కు అనుమతించరని ఏటీసీ అధికారి తెలిపారు.
భయపెట్టిన నైటీ.. ఇలా ఎవరైనా చేస్తారా అంటూ గగ్గోలు పెట్టిన మహిళ
రాత్రి పూట నిద్రపట్టక ఓ మహిళ బాల్కనీలోకి వచ్చింది. అటూ ఇటూ తిరుగుతూ తమ ఎదురుగా ఉండే ఒక ఇంటివైపు చూసింది. అక్కడ ఏదో వేలాడుతున్నట్లు కనిపించింది. దూరం నుంచి చూస్తే అది ఒక అమ్మాయిలాగా అనిపించింది. అంతేకాదు అది గాలికి అటు ఇటు ఊగుతూ కనిపించింది. దాంతో ఒక్కసారిగా ఆమె మైండ్ బ్లాంక్ అయ్యింది. దానిని చూసి ఆమె దెయ్యం అనుకుంది. ఇంకేముంది భయంతో ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వచ్చి తలుపులు వేసుకుంది. తెల్లార్లు బిక్కుబిక్కుమంటూ గడిపింది. తెల్లారాక ధైర్యం చేసి అదేంటో తెలుసుకోవాలనుకుంది. నెమ్మదిగా వచ్చి ఆ ఇంటివైపు చూసి షాక్ తింది. దీనికా నేనే భయపడింది అనుకుంది. ఇంతకీ ఆమె ఆ రాత్రి చూసింది ఒక నైటీని. అది గాలిలో తీగలపై వేలాడుతూ ఉంది. చీకటిలో కనిపించకపోయే సరికి దానిని దెయ్యం అనుకుంది. ఇక ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఇలా ఎవరైనా ఆరేస్తారా? భయంతో రాత్రంతా చచ్చా.. పదిసార్లు హనుమాన్ చాలీసా చదువుకున్నా అని తెలిపింది. ఇది చూసిన వారందరూ ఆమెను ఓ నైటీ భయపెట్టిందని నవ్వుకుంటున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో వివరాలు మాత్రం తెలియదు. రాత్రిపూట ఇలాంటివి జరగడం కామన్ అయినా రాత్రంతా ఎలా గడిపావో అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు.
జాలిరెడ్డి ఈసారి అంతకు మించి చూపిస్తాడట
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఐకాన్ స్టార్ గా మార్చింది. పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకొని టాలీవుడ్ సత్తా ఏంటో దేశం మొత్తం చూపించింది. ఇక ఈ సినిమా పార్ట్ 2 త్వరలోనే రానుంది. పుష్ప 2 తో ఈసారి బన్నీ గ్లోబల్ స్టార్ గా మారడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యి ఎంతటి సెన్సేషన్ ను క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప లో నటించిన విలన్స్.. వేరే భాషల్లో స్టార్ హీరోస్ అని అందరికి తెల్సిందే. షెకావత్ గా నటించింది మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కాగా .. జాలిరెడ్డిగా నటించింది కన్నడ హీరో ధనుంజయ. కథ, పాత్ర నచ్చడంతో మారు మాట్లాడకుండా వీరు ఈ సినిమాలో నటించారు. ఇక పుష్ప 2 లో కూడా వీరి పాత్రలను సుకుమార్ ఓ రేంజ్ లో మలుస్తున్నాడు. ఇప్పటికే ఫహద్ పుట్టినరోజున ఆయన పోస్టర్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ తెలిపిన మేకర్స్ తాజాగా నేడు ధనుంజయ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ” ట్యాలెంటెడ్ నటుడు ధనుంజయ కు పుష్ప 2 టీమ్ బర్త్ పే విషెస్ తెలుపుతుంది.. ఈసారి స్కోర్‌లను పరిష్కరించేందుకు జాలీ రెడ్డి తిరిగి రానున్నారు” అని చెప్పుకొచ్చింది. అయితే జాలిరెడ్డి నార్మల్ ఫోటోను మాత్రమే షేర్ చేయడంతో పుష్ప 2 లోని పోస్టర్ ను షేర్ చేయొచ్చుగా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక పుష్ప లో జాలిరెడ్డి పాత్ర గుర్తుంది గా.. కనిపించిన అమ్మాయిని సొంతం చేసుకుంటూ ఉంటాడు. చివరికి పుష్పగాని లవర్ శ్రీవల్లి మీద చేయి వేయడంతో.. జాలిరెడ్డిని పుష్ప చితకబాదుతాడు. ఇక పార్ట్ 2 లో పుష్పను చంపడానికి జాలిరెడ్డి ఓ రేంజ్ లో స్కెచ్ లు వేసాడట.. మరి ఈసారి ఏ రరేంజ్ లో విలనిజాన్ని చూపిస్తాడో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
‘స్లమ్ డాగ్ హస్బెండ్’ ఈ కామెడీ మూవీ చూసి నవ్వుకోవాలనుకుంటున్నారా? ఓటీటీలో స్ట్రీమింగ్ అప్పుడే
టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ ఇటీవల ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సునీల్, బ్రహ్మాజీ, రఘు కారుమంచి, యాదమ్మ రాజు, సప్తగిరి తమ పాత్రలతో నవ్వించారు. తెలుగమ్మాయి ప్రణవి మానుకొండ ఈ సినిమాతో కథానాయికగా పరిచమయ్యింది. పిట్టకథ సినిమాతో హీరోగా పరిచయమైన సంజయ్ రావ్ ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ చిత్రాన్ని తీశాడు. అయితే ఈ సినిమా థియేటర్ల వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ సినిమా ఆద్యంతం నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది. మంచి కామెడీ ఎంటర్ టైనర్ ఈ చిత్రం. అయితే ఎంత మంచి కాన్సెప్ట్ అయిన ఈ సినిమా ప్రమోషన్స్ విషయంతో అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ప్రేక్షకులకు దగ్గరకాలేకపోయింది. ట్రైలర్ లోనే సినిమా స్టోరీ దాదాపు అర్థం అయిపోయింది. దాంతో థియేటర్ కు వెళ్లడానికి చాలా మంది ఇష్టపడలేదు. అయితే కామెడీ సినిమా కాబట్టి చాలా మంది ఓటీటీలో చూసే అవకాశం ఉంది.