కానిస్టేబుల్ ఉద్యోగాల పేరుతో టోకరా.. నకిలీ డీఎస్పీ అరెస్ట్
పోలీసునంటూ అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తి గుట్టు రట్టు చేశారు పోలీసులు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలసకు చెందిన వినోద్ కుమార్ (28) కొన్నాళ్ల క్రితం బస్సులో యువతిని చూసి.. పొడుగ్గా ఉన్నావు, పోలీసు ఉద్యోగానికి పనికి వస్తావని మాట కలిపాడు. తనను డీఎస్పీగా పరిచయం చేసుకొని, కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. డిగ్రీ పూర్తి చేసిన ఆమె అతని మాటలు నమ్మింది. పాల వ్యాపారం చేస్తూ కూడబెట్టిన రూ.2.70 లక్షలను బాధితురాలి కుటుంబ సభ్యులు ఆ కేటుగాడికి ముట్టజెప్పారు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఉద్యోగం రాకుండా పోతుందని చెప్పుకొచ్చాడు.
కొన్ని రోజుల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో యువతికి అనుమానం వచ్చి గ్రామీణ పోలీసులను ఆశ్రయించింది. దీంతో నకిలీ డీఎస్పీ గుట్ట బయటపడింది. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మరిన్ని విషయాలు తెలిశాయి. బాధిత యువతినే కాకుండా.. కానిస్టేబుల్ ఉద్యోగాల పేరుతో చాలా మంఇ యువతీ యువకులకు టోకరా వేసినట్లు గుర్తించారు. ఒక్కొక్కరి వద్ద దాదాపు రూ.3 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు వినోద్ కుమార్ ను విచారిస్తున్న పోలీసులు.. మద్యానికి బానిసై ఇలాంటి మోసలాకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు.
1000 మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పనున్న బైజూస్
దేశంలోని అతిపెద్ద ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ మరోసారి రిట్రెంచ్‌మెంట్ కోసం యోచిస్తోంది. ఖర్చు తగ్గింపు,మెరుగైన ఆపరేషన్ కోసం కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించనుంది. అయితే ఈసారి కంపెనీ సుమారు 1000 మంది ఉద్యోగులకు వీడ్కోలు చెప్పవచ్చని సమాచారం. ఇంతకు ముందు కూడా కంపెనీ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ రిట్రెంచ్‌మెంట్ ప్లాన్ చేయడం ఇది రెండోసారి.
దేశంలో రిట్రెంచ్‌మెంట్ ప్రక్రియ ఆగిపోతుందన్న వార్తలో నిజంలేదు. ఒకదాని తర్వాత మరొకటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద ఎడ్‌టెక్ కంపెనీపై ఈసారి ఉద్యోగాల తొలగింపు కత్తి వేలాడుతోంది. తొలగించబడే చాలా మంది వ్యక్తులు ఆన్-గ్రౌండ్ సేల్స్‌లో పాల్గొనవచ్చు. కంపెనీ ఈ వ్యక్తులను కాంట్రాక్ట్‌పై తీసుకుంటుంది. ఈ ఉద్యోగులను థర్డ్ పార్టీల ద్వారా నియమించుకుంటారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఈసారి బైజస్ దాదాపు 1,000 మంది ఉద్యోగులను రిట్రెంచ్‌మెంట్‌లో తొలగించవచ్చు. ఉద్యోగుల అభిప్రాయం ప్రకారం, ఇది ఆశ్చర్యం కలిగించదు. ఎడ్‌టెక్ కంపెనీ ఇక్కడ కాస్ట్ కటింగ్ చేయాలనుకుంటోంది. ఇందుకోసం ఆయన ఉద్యోగుల బలాన్ని తగ్గించుకోవాల్సి వస్తోంది. కారణం కంపెనీ వృద్ధి ప్రస్తుతం నిలిచిపోయింది. ఆకాష్‌తో హైబ్రిడ్ ప్లే చేయడంపై కంపెనీ దృష్టి సారించింది.
ఖమ్మం నడి బోడ్డునే పార్టీలో జాయిన్ అవుతా.. క్లారిటీ ఇచ్చిన పొంగులేటి
లక్షల మంది అభిమానుల మధ్య నే ఖమ్మం నడి బోడ్డునే పార్టీ లో జాయిన్ అవుతా అని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఖమ్మంలో ఎస్.ఆర్ కాన్ వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నా కోసం వచ్చిన నా కుటుంబ సభ్యుల అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిలా మారుమూల ప్రాంతాల నుండి ఒక్క పిలుపుతో వచ్చారని అన్నారు. పార్టీ మార్పు విషయంపై మీ అందరింతో చర్చించే నిర్ణయం తీసుకుంటా అని గతంలోనే చేప్పానని గుర్తు చేశారు. కురుక్షేత్ర యుద్దం ప్రకటించి 5 నెలల 10 రోజులు అవుతుందని అన్నారు. అధికార పార్టీ నాయకులు మనల్ని ఏగతాళి చేశారు పార్టీ జెండా లేదు ఆజేండా లేదని చవాకులు పెలారని మండిపడ్డారు. వాళ్లు ఎన్ని చేసిన మీ అధికార పార్టీ ట్రాప్ లో శ్రీనన్న కానీ శ్రీనన్న అభిమానులు కానీ పడరని క్లారిటీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా వేరే పార్టీ లో జాయిన్ అవుతున్న అని మీడియాలో రావటాంతో కొందరు అధికార పార్టీ నాయకులు మందు విందు చేసుకొని పండగా చేసుకున్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆస్తమా వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా శనివారం అర్ధరాత్రి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించనుంది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్, పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించారు పోలీసులు. దీంతో ట్రాఫిక్ రద్దీని బట్టి ట్రాఫిక్ మళ్లింపులు ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుండా సస్పెన్షన్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. పోలీసులకు ప్రయాణికులు సహకరించాలని కోరారు.
పీపుల్స్ మార్చ్ కు 85వ రోజు.. చందంపేట ప్రజలకు భట్టి పలకరింపు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా 85వ రోజు నేడు నల్గొండ జిల్లా చందంపేట మండలం మురుపునూతల గ్రామం పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ మహిళా కూలీల వద్దకు వెళ్లి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డిండి మండలం బోయినపల్లి గ్రామం నుంచి పత్తి విత్తనాలు నాటడానికి అచ్చంపేట మండలం మురిపి నూతల ఊరికి వచ్చామని వ్యవసాయ కూలీలు చెప్పారు. సీఎం కేసీఆర్ ఇల్లు లేనటువంటి వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చామని చెప్తున్నారు మీకు వచ్చాయా? అని భట్టి విక్రమార్క వారిని అడిగినప్పుడు మా ఊర్లో ఒకరి కూడా ఇల్లు రాలేదని మహిళలు కడారి భాగ్యమ్మ, జంగమ్మ నడింపల్లి, ఈశ్వరమ్మ, రాములమ్మ, సంతోష, కృష్ణమ్మలు, చెప్పారు. శివర్ల జంగమ్మ, కడారి భాగ్యమ్మ మాట్లాడుతూ తన భర్తకు 64 సంవత్సరాలు వచ్చిన ఇప్పటి వరకు పించను ఈ ప్రభుత్వ ఇవ్వడం లేదని చాలాసార్లు దరఖాస్తు పెట్టుకున్న ఎవరు పట్టించుకోవడంలేదని చెప్పింది. బద్దెల యాదమ్మ మాట్లాడుతూ చనిపోయిన తర్వాత నాలుగైదు సార్లు తాహాసిల్దార్ కార్యాలయం వెళ్లి దరఖాస్తు చేసుకున్న వితంతు పెన్షన్ మంజూరు కాలేదని మీరైనా ఇప్పించాలని వేడుకొంది.
శరద్ పవార్, సుప్రియా సూలేలను చంపేస్తాం.. ట్విట్టర్లో హత్య బెదిరింపులు
ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ప్రాణహాని ఉంది. సౌరభ్ పింపాల్కర్ అనే వ్యక్తి ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఈ బెదిరింపు వచ్చింది. ఆ ట్వీట్‌లో అభ్యంతరకర విషయాలు రాస్తూ శరద్ పవార్ ఫలితం కూడా షాకింగ్‌గా ఉంటుందని అంటున్నారు. శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఫిర్యాదు చేసేందుకు ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. సుప్రియా సూలే పోలీసు కమిషనర్‌ను కలిసి మీడియాతో వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సుప్రియా సూలే మాట్లాడుతూ, ‘గౌరవనీయమైన పవార్ సాహెబ్ పేరుతో నా వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. ఇది బెదిరింపు సందేశం. ఈ విషయాన్ని ముంబై పోలీస్ కమిషనర్‌కు తెలియజేశాను. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒక మహిళగా, పౌరురాలిగా, నేను మహారాష్ట్ర, దేశం హోం మంత్రి నుండి న్యాయం కోరుతున్నాను. శరద్ పవార్‌కు ఏదైనా జరిగితే దేశం, రాష్ట్ర హోం మంత్రి బాధ్యత వహించాలి. బాధ్యత ప్రభుత్వ నిఘా యంత్రాంగంపై ఉంది. మహారాష్ట్రలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో భయానక వాతావరణం నెలకొంది.
పదవికి విరమణ ఇచ్చాను కానీ మాట్లాడే పెదవులకు విరమణ లేదు
గుంటూరు ఆర్‌వీఅర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాల ఎనిమిదవ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. యువతను మేల్కోల్పడం నాకు ఇష్టమైన పని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలతో గడపడం నాకు ఇష్టమని ఆయన పేర్కొన్నారు. పదవికి విరమణ ఇచ్చాను కానీ మాట్లాడే పెదవులకు విరమణ లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా.. విద్యావిధానాన్ని భారతీయకరణ చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో యువ శక్తి ఎక్కువగా ఉన్న దేశం మనదని ఆయన అన్నారు.
చెరువులో పడ్డ మంత్రి గంగుల కమలాకర్
బోటు ప్రమాదం నుంచి తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సురక్షితంగా బయటపడ్డారు. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఊరూర చెరువుల ఉత్సవాల్లో మంత్రి గంగుల పాల్గొన్నారు. ఈ క్రమంలో చెరువులో పడవ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మంత్రి ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడి నీటిలో పడిపోయాడు. కానీ అతను పడిన చెరువు లోతు తక్కువగా ఉండడంతో ప్రమాదం తప్పింది.