ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీల్.. ఏపీలో కలకలం.. సీబీఐ విచారణలో ఏం తేలింది?
విశాఖ బిగ్ డ్రగ్ రాకెట్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది.విచారణను సీబీఐ వేగవంతం చేసింది.మరిన్ని సాంకేతిక ఆధారాలు సేకరించే దిశగా వెళ్తోంది. మత్తు పదార్థాల నిర్ధారణ కోసం నార్కోటిక్స్ బ్యూరోను సైతం రంగంలోకి దించింది. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పరిశ్రమలో సీబీఐ సోదాలు ముగిశాయి. ఏడుగురు సీబీఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో మూడు రోజులుగా తనిఖీలు నిర్వహించింది. ఇప్పటికే పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించింది. ల్యాబ్‌ను పరిశీలించి ఫోరెనిక్స్ బృందాన్ని పిలిపించారు. వైజాగ్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం.. ల్యాబ్‌లో ఉన్న వివిధ శాంపిల్స్ సేకరించి విశాఖకు తీసుకెళ్లారు. బ్రెజిల్ టు వైజాగ్ వయా జర్మనీ. ఇదీ విశాఖ పోర్టులో సీబీఐ బ్రేక్ చేసిన డ్రగ్ రాకెట్. ఆపరేషన్ గరుడలో భాగంగా CBI దాదాపు 25 వేల కేజీల డ్రై ఈస్ట్ ను స్వాధీనం చేసుకుని వరుసగా మూడో రోజు విస్తృత విచారణ కొనసాగించింది. కంటైనర్ బుక్ చేసిన సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ ఉన్నత స్థాయి సిబ్బందిపై చర్యలకు సిద్ధమవుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన CBI బృందం లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. అంతర్జాతీయ డ్రగ్ నెట్ వర్క్ లింకులపైన ఆరా తీస్తోంది.
మన్యంలో పుష్ప సీన్ రిపీట్..!
ఆ మధ్య వచ్చిన పుష్ప సినిమాలో కొన్ని సీన్లు.. దొంగతనం ఎలా చేయాలో కళ్లకు కట్టినట్టు చూపించారు.. అధికారులు, పోలీసుల కళ్లుగప్పి.. ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేశారు.. ఎలా తప్పించుకున్నారో పలు కోణాల్లో చూపించారు.. అయితే, ఆ తర్వాత ఆ తరహా ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మన్యంలో అటవీ ప్రాంతంలో పుష్ప సీన్ రిపీట్ అయ్యింది.. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి నూర్పిడి అటవీ ప్రాంతంలో ఉన్న టేకు ప్లాంట్ లో మాయమైన టేకు చెట్ల బాగోతం.. అయితే, గుట్టుచప్పుడు కాకుండా 400పైగా భారీ టేకు, మారు జాతి వృక్షాలు మాయం చేశారు.. అధికారుల కనుసన్నల్లోనే 50 లక్షల రూపాలయ పైనే విలువైన టేకు చెట్లను అటవీ సిబ్బంది చొరవతోనే జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణ చేసిన అధికారులు.. కాగా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అవినీతి సిబ్బందిపై అటవీ ప్రాంతంలో మాయమైన టేకు చెట్ల వివరాలను సేకరిస్తున్నారు సీసీఎఫ్, స్క్వాడ్, విజిలెన్స్ టీం ఉన్నతాధికారులు .. టేకు చెట్ల అక్రమ దోపిడీపై ఇప్పటికే రాష్ట్ర స్థాయి, జిల్లాల నుండి ప్రత్యేక బృందాలు రంపచోడవరం డివిజన్ లోని అన్ని రేంజ్ పరిధిలో టెక్ ప్లాంటు లను పరిసలించి.. అవినీతి అధికారులు డేటాను విజిలెన్స్ అధికారులు, ప్రత్యేక బృందాలు పంపించాయి.. ఉన్నతాధికారులు ఆదేశాలతో ఇప్పటికే డిప్యూటీ రేంజ్ అధికారి,బీట్ అధికారిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.. దర్యాప్తు లో మరికొందరిపై వేటు పడుతుందని సమాచారం.. మరింత వేగంగా దర్యాప్తులో ఎంతమంది ఉన్నా కఠిన చర్యలు తప్పవంటూ రేంజర్ ఆజాద్ వెల్లడించారు.
కడపలో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒంటిమిట్ట రెవెన్యూ అధికారులు తమ భూమిని ఆన్లైన్ చేయడంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని మనస్థాపానికి గురైన సుబ్బారావు ఆయన భార్య పద్మ.. వాళ్ల కుమార్తె వినయతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పద్మ, వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా.. భర్త సుబ్బారావు మాత్రం ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్వాపరాలను విచారిస్తున్నారు. అసలు రెవెన్యూ అధికారులు వారి భూమిని ఆన్లైన్లో ఎక్కించకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.. ఆ భూమిపై ఉన్న సమస్యలు ఏంటి? లాంటి వివరాలపై కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. భూమి వ్యవహారంలోనే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారా? ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగుతున్నట్టు సమాచారం.
బీసీలకు ప్రాధాన్యత విషయంలో వైసీపీని ఏ పార్టీ దాటలేదు..
బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ పార్టీ దాటలేదు అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రాజ్యసభలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వని చంద్రబాబు.. వైసీపీని చూసి తల ఎక్కడ పెట్టుకుంటారు..? అని ఫైర్ అయ్యారు. ఇక, బీజేపీ, టీడీపీలో చంద్రబాబు తన సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించారని విమర్శించారు. మమ్మల్ని విమర్శించిన చంద్రబాబు.. కడప నుంచి అభ్యర్దిని తీసుకు వచ్చి ఏలూరు పార్లమెంట్‌కు పెట్టడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కడప నుంచి ఎక్స్పోర్ట్ చేసిన వ్యక్తి యనమల అల్లుడైతే ఏలూరు ప్రజలు ఓట్లు వేస్తారా..? అని నిలదీశారు. మరోవైపు.. టీడీపీ-జనసే-బీజేపీ బహిరంగ సభలపై సెటైర్లు వేశారు కారుమూరి.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు.. వైసీపీ సిద్ధం సభలను చూసి మూడు (టీడీపీ-జనసేన-బీజేపీ) పార్టీలు సభలు పెడుతున్నా ఆదరణ దక్కడం లేదన్నారు. ఇక, చంద్రబాబు నీచకృత్యాలు ఆయన అనుచరుల రూపంలో బయట పడుతున్నాయి.. డ్రగ్స్ తీసుకు వచ్చి కోట్లాది రూపాయలు కొల్లగొట్టలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ ప్లాన్ వర్కవుట్ కాకపోవటంతో చంద్రబాబు అనుచరులు డ్రగ్స్ పై పడ్డారని విమర్శించారు. మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కాపులు కొరుకుంటుంటే.. కాపు పెద్దలకు ఎక్కడ సీట్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
కొంత మందికి సీట్లు ఇవ్వలేకపోవచ్చు.. కానీ, వాళ్లు త్యాగాన్ని మరువలేను..
ఈ ఎన్నికల్లో కొంత మంది నేతలకు సీట్లు ఇవ్వలేకపోవచ్చు.. కానీ, వాళ్లు చేసిన త్యాగాన్ని నేను మరువలేను అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రం కోసం.. దేశం కోసం జట్టు కట్టాం. సంప్రదాయ రాజకీయాలు ఉండుంటే మనం కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవాళ్లమన్న ఆయన.. ఏపీలో వైసీపీ ఓడిపోకుంటే రాష్ట్రం నాశనం అవుతుందని పవన్ కల్యాణ్ భావించారు. ఓటు చీలకూడదని పవన్ సంకల్పం తీసుకున్నారని తెలిపారు. పొత్తులతో.. పొత్తుల్లేకుండా కూడా పోటీ చేశాం. పొత్తుల వల్ల కొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోయాం అన్నారు. మూడు పార్టీల్లోనూ పోరాడిన వాళ్లున్నారు. పొత్తుల వల్ల టీడీపీ కోసం పని చేసిన 31 మంది నేతలకు టిక్కెట్లు ఇవ్వలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పొత్తులతో సంబంధం లేకుండా కొందరి సీనియర్లకు కూడా టిక్కెట్లు ఇవ్వలేకపోయామని.. పెట్టిన అభ్యర్థులు గెలిచేలా బేరీజు వేసుకునే మూడు పార్టీల అభ్యర్థులను నిలబెడుతున్నాం అన్నారు. పార్టీ పరంగానే కాకుండా సొంతంగా ఓట్లేయించుకునే అభ్యర్థులను ఎంచుకున్నాం అని తెలిపారు చంద్రబాబు.. సోషల్ ఇంజనీరింగ్ చేపట్టాం.. బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చేలా చూశాం. సోషల్ రీ-ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సేవా భావంతో ఉన్న వాళ్లని రాజకీయాల్లో ప్రొత్సహించాల్సిన అవసరం ఉంది అన్నారు. విభిన్న వర్గాల్లో ప్రత్యేకమైన ఆలోచనా ధోరణి ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. వివిధ రంగాల్లో స్థిరపడిన వారికి కూడా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనే ఆలోచనలు కలుగుతున్నాయన్నారు. రాజకీయాలను ఇంకా ప్రక్షాళన చేయగలిగితే.. మరింత మంది మంచి వారు వస్తారు. రాగద్వేషాలకు, రికమెండేషన్లకు అతీతంగా అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఈ మూడు పార్టీల వేసిన పునాది భవిష్యత్తుకు ఊతమిచ్చేలా ఉండాలని ఆకాక్షించారు.
పొన్నం ప్రభాకర్ ను ఆవేశం స్టార్ అని పిలవాలి..
పొన్నం ప్రభాకర్ ఆవేశాన్ని చూస్తుంటే ఆవేశం స్టార్ అని పిలవాలని ఉందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని మరోసారి స్పీకర్ ని కోరుతున్నానని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పిచ్చి పిచ్చి గా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఓట్లేసి మమ్మల్ని ప్రజలు గెలిపించారు.. అటువంటి మమ్మల్ని అధికార కార్యక్రమంలో భాగస్వామ్యం చేయొద్దని ఎలా అంటారని తెలిపారు. ఆర్డీవో కి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు.. సీఎస్ కి కంప్లైంట్ చేశానని అంటున్నారు మంత్రి అని అన్నారు. ప్రమాణం కి భిన్నంగా ప్రవర్తిస్తున్న మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయవద్దు? అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ ఆవేశాన్ని చూస్తుంటే ఆవేశం స్టార్ అని పిలవాలని ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇట్లాంటి పనులు చేస్తేనే కరీంనగర్ ప్రజలు తన్ని తరిమితే ఎక్కడికో పారిపోయారన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల కు తోడు ఏడో గ్యారంటీ ఈ మంత్రి ఆవేశం మని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తే ఇబ్బందులు పడతారన్నారు. మంత్రి మాటలు వింటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టు అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలెక్షన్ కోడ్ వున్నప్పుడు నిన్న కమలపూర్ లో కల్యాణ లక్ష్మీ చెక్కులు పంచారు.. తులం బంగారం ఏదీ…? అని ప్రశ్నించారు. పోలీసుల అలవెన్స్ లు పిఆర్సీలు ములుగులో సీతక్క ఇచ్చారు కరీంనగర్ లో ఎందుకు ఇవ్వడం లేదు..? అని అన్నారు. కరీంనగర్ లో లక్ష ఓట్ల మెజార్టీతో ఎంపీ సీట్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
టీ, సమోసాల నుంచి అభ్యర్థుల అన్ని ఖర్చులపై కన్నేసిన ఎలక్షన్ కమిషన్
దేశంలో లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించబడ్డాయి. మొదటి ఓటింగ్ ఏప్రిల్ 19న, ఎన్నికల ఫలితాలు జూన్ 4న ప్రకటించబడతాయి. కాగా, ఎన్నికల ఖర్చులను నియంత్రించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాలు జారీ చేసింది. జిల్లా మేజిస్ట్రేట్లతో పాటు అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు (సీఈఓలు) ఏరియాను బట్టి అభ్యర్థుల ఖర్చులను నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సీఈవోలందరూ ఎన్నికల సంఘానికి నివేదికలు పంపారు. నీళ్ల నుంచి పటాకుల వరకు, టీ నుంచి పబ్లిసిటీ వరకు ఖర్చుపై పరిమితి విషయంలో అభ్యర్థులు నిబంధనలు పాటించగలరా లేదా అనేది చూడాలన్నారు. అలాగే కమిషన్ ముందు ఎన్ని ఉల్లంఘన కేసులు వస్తున్నాయో పరిశీలించాలని ఆదేశించారు. దీంతో అభ్యర్థులు ప్రతి పైసా బిల్లును, లెక్కను ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సి ఉంటుంది. కమిషన్ సూచనల మేరకు జిల్లా స్థాయిలో అభ్యర్థులకు వస్తువుల ధరల జాబితాను విడుదల చేశారు. ఇందులో అభ్యర్థుల ఖర్చు రేట్లను కూడా ఖరారు చేశారు. ఈసారి యూపీలో టీ, సమోసా ధర రూ.10గా నిర్ణయించగా, జిలేబీ ధర కిలో రూ.150గా ఉంచారు. సింగిల్ నాన్ ఏసీ గది ధర రూ.1150, డబుల్ బెడ్ రూ.1550గా నిర్ణయించారు. దీంతో పాటు రెండు లీటర్ల శీతల పానీయం బాటిల్ ధర రూ.90, శాఖాహారం ప్లేట్ రూ.80, నాన్ వెజిటేరియన్ ప్లేట్ ధర రూ.200గా ఉంచారు. అరలీటర్ వాటర్ బాటిల్ ధర రూ.10, లీటర్ రూ.20, రెండు లీటర్ రూ.30గా నిర్ణయించారు.
కలుషిత మద్యం తాగి 21 మంది మృతి..
పంజాబ్ రాష్ట్రంలో కలుషిత మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 21కి చేరింది. సంగ్రూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరిపేందుకు పంజాబ్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. సంగ్రూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రకారం.. ఇథనాల్ కలిపిన నకిలీ మద్యం తాగా ఇప్పటివరకు 40 మంది ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. బుధవారం నలుగురు వ్యక్తులు నకిలీ మద్యం తాగి మరణించారు. చాలా మంది ఆస్పత్రి పాలయ్యారు. మరుసటి రోజు పాటియాలోని రాజింద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. శుక్రవారం మరో 8 మంది మరణించారు. మరసటి రోజు ఐదుగురు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 21కి చేరింది. ఈ కేసులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఓ ఇంట్లో విషపూరితమైన మద్యం తయారుచేస్తున్నట్లు పట్టుబడిన వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి 200 లీటర్ల ఇథనాల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, దోషులను విడిచిపెట్టమని డీఐజీ హర్చరణ్ సింగ్ భుల్లర్ శుక్రవారం తెలిపారు.
మాస్కోలో దాడి.. మూడో ప్రపంచ యుద్ధానికి సిగ్నలా ?
రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం ఉగ్రదాడి జరిగింది. మాస్కో సమీపంలోని ఒక కాన్సర్ట్ హాలులో ఐదుగురు ముష్కరులు కాల్పులు జరిపారు. ఇందులో ఇప్పటివరకు 140 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ ఉగ్రదాడి ఎవరు చేశారన్నది ఇంకా వెల్లడి కానప్పటికీ.. ఈ దాడికి సంబంధించి అమెరికాలో అనేక కుట్రలు జరుగుతున్నాయి. రష్యాపై ఈ దాడి ఏ సిద్ధాంతం వల్ల జరిగిందో తెలుసుకుందాం. శుక్రవారం రష్యాలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి అనేక సిద్ధాంతాలు వెలువడ్డాయి. ఇందులో మొదటి సిద్ధాంతం ఏమిటంటే.. అమెరికా, నాటో రష్యాపై ఈ దాడి చేశాయి. తద్వారా రష్యా కోపం తెచ్చుకుంటుంది. దీంతో మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. దాడి తరువాత మూడవ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించడానికి ఇది మొదటి మెట్టు కావచ్చని స్పష్టంగా సూచిస్తోంది. దీని కారణంగా రష్యా ఆగ్రహం చెందుతుంది. ఆలోచన లేకుండా కొన్ని చర్యలు తీసుకుంటుందనేది దాని అభిప్రాయం కావొచ్చు. ఈ దాడికి సంబంధించిన రెండవ సిద్ధాంతం ప్రకారం, రష్యా యుద్ధంలో ముందుకు సాగడానికి పెద్ద కారణం లభించేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ మళ్లీ రష్యాకు నాయకత్వం వహించారు.
రామ్ చరణ్ బర్త్ డే సర్ ప్రైజ్ లు రెడీ.. మెగా ఫ్యాన్స్ కు పండగే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు.. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఇక ఇప్పుడు ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు తో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఆ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు.. ఇదిలా ఉండగా మే 27 న రామ్ చరణ్ పుట్టినరోజు రాబోతుంది.. ఇక ఈ ఏడాది గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలను చేసేందుకు మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు… అంతేకాదు రామ్ చరణ్ నటిస్తున్న మూవీల నుంచి బర్త్ డే సర్ ప్రైజ్ లను టీమ్ రెడీ చేస్తుంది.. ఈక్రమంలోనే అదిరిపోయే అప్డేట్స్ ని రెడీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి సాంగ్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.. అలాగే ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేసిన RC16 మూవీ నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతుందట. ఈ చిత్రానికి పెద్ది, కలియుగ భీమా అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నారు.. మరి బుచ్చిబాబు ఏది ఫైనల్ చేస్తారో చూడాలి.. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను అనౌన్స్ చేయబోతున్నారు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.. మొత్తానికి రామ్ చరణ్ బర్త్ డే సర్ ప్రైజ్ లు అదిరిపోయాయిగా..
ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయిన తెలుగు సినిమా.. ఇప్పటికి అదే రికార్డ్..!
2005లో ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా. సిద్ధార్థ, త్రిష హీరోహీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా మొత్తం తొమ్మిది భాషల్లో రీమేక్ అయింది. ఏ సూపర్ హిట్ సినిమా అయినా సరే కేవలం రెండు లేదా మూడు భాషల్లో రీమేక్ అవడం చూస్తుంటాం. మరి అయితే నాలుగు లేదా ఐదు భాషల్లో పెద్ద హీరోల సినిమాలు రీమేక్ కావడం చూస్తూ ఉంటాం. కాకపోతే మొదటగా తెలుగులో విడుదలైన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా మాత్రం ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేక్ జరిగింది. ఇక ఇప్పటికీ అత్యధిక భాషలో రీమేక్ అయిన ఇండియన్ సినిమాగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా రికార్డ్ నెలకొల్పింది. తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం, హిందీలో అమితాబ్ నటించిన డాన్ సినిమాలో కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయాయి. దృశ్యం సినిమాని మోహన్ లాల్ మొదటగా మలయాళంలో నటించి విడుదల చేయగా.. ఆ తర్వాత ఆ సినిమాని 8 భాషలలో రీమేక్ చేశారు. అలాగే డాన్ సినిమా కూడా కేవలం 5 భాషల్లో మాత్రమే రీమేక్ చేశారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా రిలీజ్ అయ్యి 19 సంవత్సరాల గడుస్తున్న.. ఇప్పటికీ ఆ రికార్డు ను ఏ సినిమా బ్రేక్ చేయలేకపోయింది. ఈ చిత్రం కన్నడ, బెంగాలీ, మణిపురి, హిందీ, తమిళ్, పంజాబీ, బంగ్లాదేశ్, నేపాలి, ఒడియ భాషల్లో రీమేక్ జరిగింది. విచిత్రం ఏమిటంటే అన్ని భాషల్లో కూడా ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. 2005లో ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వగా ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నిలిచింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డుల లిస్టులో కూడా ఈ సినిమా తన స్టామినాను చూపించింది. సినిమా పరంగా మొత్తం 5 కేటగిరీలలో నంది అవార్డులను కైవసం చేసుకుంది.
ఏంటి అజిత్.. నువ్వు కూడా ఇలా షాక్ ఇస్తావేంటి?
తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి.. అందుకే తెలుగులో కూడా అజిత్ పేరు అందరికి సుపరిచితమే.. మాస్ అండ్ యాక్షన్స్ కథలతో ఎక్కువగా అజిత్ సినిమాలు వస్తుంటాయి.. గతంలో వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఇక ఈ ఏడాది కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన “గుడ్ బ్యాడ్ అగ్లీ”అనే సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంది.. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెగకేక్కిస్తున్నారు.. అజిత్ కు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉందని తెలుస్తుంది. ఇప్పటికే భారీ పారితోషికం అందుకుంటున్న కోలీవుడ్ హీరోల లిస్ట్ లో ఉన్న అజిత్ కూడా ఒకరు.. ఇప్పుడు ఈ సినిమాతో రెమ్యూనరేషన్ ను పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక తమిళ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు..