మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్.. చిన్నారి వైద్యానికి భారీ సాయం..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక పలివెల బ్లెస్సీ కొన్నాళ్లుగా తలనొప్పితో బాధపడుతోంది. దీనిపై వైద్యులను సంప్రదించారు బాలిక తల్లిదండ్రులు.. అక్కడే వారికి ఊహించలేని విషయం తెలిసిందే.. ఆ చిన్నారి బ్రెయిన్ క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు. అయితే, చికిత్స చేయించడానికి రూ.41.50 లక్షలు అవుతుందని చెప్పడంతో.. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో.. బిడ్డకు చికిత్స ఎలా చేయించాలో తెలియక ఆర్థిక స్తోమత లేని తండ్రి రాంబాబు గుండెలుపగిలేనా రోధించాడు.. ఇదే సమయంలో.. సీఎం జగన్ ఈ నెల 11న అమలాపురం పర్యటనకు వెళ్లారు.. మంత్రి పినిపే విశ్వరూప్ ద్వారా సీఎం వైఎస్ జగన్ దృష్టికి తన బిడ్డ సమస్యను తీసుకెళ్లాడు రాంబాబు.. ఆ చిన్నారి సమస్య విని చలించిపోయిన సీఎం జగన్.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. అయితే, ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి విశ్వరూప్ భార్య బేబీమీనాక్షి, కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.. చికిత్స చేయించుకుని ఆ చిన్నారి పూర్తి అనారోగ్యంతో రావాలని ఆకాక్షించారు.
దొంగ ఓట్లపై చంద్రబాబు ఫిర్యాదు హాస్యాస్పదం.. పవన్ గురించి మాట్లాడడం సమయం వృథా..!
ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్ల వ్యవహారం ఇప్పుడు కాకరేపుతోంది.. ఏకంగా ఢిల్లీ వరకు చేరింది.. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అధికార, ప్రతిపక్ష నేతలు పోటీపోటీగా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఫిర్యాదు చేశారు.. దొంగ ఓట్లు ఎలా చేర్చుతున్నారు.. విపక్షాల ఓట్లు ఎలా తొలగించారో ఆధారాలతో సహా ఈసీకి ఇచ్చామని చంద్రబాబు చెబితే.. అసలు చంద్రబాబు హయాంలోనే దొంగ ఓట్లు నమోదు చేశారు.. వాటితోనే ఆయన విజయం సాధించారంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది వైసీపీ.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి ఉషాశ్రీ చరణ్.. తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్లను నమోదు చెయ్యించింది చంద్రబాబు ప్రభుత్వ హయంలోనే అని ఆరోపించారు. దొంగ ఓట్లుపై చంద్రబాబు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు.. ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో చంద్రబాబు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు ఉషాశ్రీ చరణ్.. రాబోవు ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే.. జగనన్న మళ్లీ సీఎం కాబోతున్నారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి ఉషాశ్రీ చరణ్. మరోవైపు మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు దొంగ ఓట్లతో విజయం సాధించారని ఆరోపించారు.. దొంగ ఓట్లను తొలగించాల్సిందే.. అర్హత ఉన్నవారి ఓట్లను కొనసాగించాల్సిందే అన్నారు. ఇక, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడడం అంటే.. సమయం వృథా చేసుకోవడమే అని ఎద్దేవా చేశారు మంత్రి నాగార్జున. కాగా, ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం తీవ్ర ఆరోపణలకు దారి తీసింది.. మీ హయాంలోనే దొంగ ఓట్లు నమోదు చేశారంటే.. మీ హయాంలోనే మాకు అనుకూలంగా ఓట్లను తొలగిస్తున్నారంటూ పరస్పర విమర్శలకు దిగుతున్నారు అధికార, ప్రతిపక్ష నేతలు.
ఆందోళనకు సిద్ధమైన డాక్యుమెంట్ రైటర్స్.. రిజిస్ట్రేషన్లపై తీవ్ర ప్రభావం..?
ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనకు సిద్ధమవుతున్నారు డాక్యుమెంట్ రైటర్స్.. రిజిస్ట్రేషన్ శాఖలో కార్డ్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్ అమలుపై నిరసనకు దిగనున్నారు డాక్యుమెంట్ రైటర్స్.. ఈ నెల 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు పెన్ డౌన్ ద్వారా నిరసన తెలపాలని డాక్యుమెంట్ రైటర్స్ కు సంబంధించిన ఓ అసిసోయేషన్ నిర్ణయించింది.. అయితే, ఈ 2 రోజుల నిరసనకు దూరంగా ఉంటున్నట్టు మరో అసోసియేషన్ పేర్కొంది.. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 3వ తేదీన సమావేశమై కార్యాచరణ సిద్ధం చేస్తామని చెబుతున్నారు రెండో అసోసియేషన్ నేతలు.. మరోవైపు.. కొత్త సాఫ్ట్‌వేర్ వల్ల డాక్యుమెంట్ రైటర్స్ కి ఏ ఇబ్బంది ఉండబోదని చెబుతున్నారు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు.. ఇలా ఎలా ఉన్నా.. డాక్యుమెంట్ రైటర్స్‌లోని అసోసియేషన్లలో విబేధాల నేపథ్యంలో.. వారి నిరసన కార్యక్రమం రెండు రోజుల పాటు ఎలా కొనసాగుతుంది.. మిర వారి ఆందోళన ప్రభావం రిజిస్ట్రేషన్లపై ఏ స్థాయిలో పడుతుందో వేచిచూడాల్సిన అవసరం ఉంది.
మహబూబాబాద్ ఎస్పీ సడెన్ ట్రాన్స్‌ఫర్.. బదిలీలో రాజకీయ కోణమా..?
మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా ఉన్న శరత్ చంద్ర పవార్ సోమవారం ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆయనను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ (కమాండ్ కంట్రోల్) ఎస్పీగా పనిచేస్తున్న గుండేటి చంద్రమోహన్‌ను ఎస్పీగా నియమించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ప్రస్తుత ఎమ్మెల్యే రేఖానాయక్ కు ఎస్పీ శరత్ చంద్ర పవార్ అల్లుడు. డిసెంబర్ 26, 2021న మహబూబాబాద్ ఎస్పీగా శరత్‌చంద్ర పవార్ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన హఠాత్తుగా బదిలీ కావడం వెనుక రాజకీయ కోణం దాగి ఉందనే ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించినా రేఖానాయక్ పేరు జాబితాలో లేదు. ఆమె స్థానంలో భూక్యా జాన్సన్ నాయక్‌కు టికెట్ కేటాయించారు. దీంతో ఆమె పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం తనను మోసం చేసిందని మండిపడ్డారు. మంత్రి పదవి డిమాండ్ చేయాలనే ఉద్దేశంతోనే టికెట్ ఇవ్వలేదని రేఖా నాయక్ అన్నారు. టిక్కెట్ ఇవ్వకున్నా మళ్లీ పోటీ చేస్తానన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఖానాపూర్ కాంగ్రెస్ టికెట్ ఆశించారు. గాంధీభవన్‌లో ఆమె తరపున దరఖాస్తు కూడా సమర్పించారు. రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. రేఖా నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నట్టు రేఖా నాయక్ సోమవారం ప్రకటించారు. తాను కాంగ్రెస్ నుంచి వచ్చానని, మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్తానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతానని అన్నారు. ఆమె ప్రకటన చేసిన కొద్దిసేపటికే మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా ఉన్న ఆమె అల్లుడు శరత్‌చంద్ర పవార్‌ను హఠాత్తుగా బదిలీ చేశారు. కోడలుపై అత్త కోపాన్ని ప్రదర్శించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సరికొత్త డిమాండ్.. ‘శివశక్తి’ రాజధానిగా హిందూ దేశంగా చంద్రుడు..!
చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి విజయం సాధించిన ఇస్రో.. చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులు, ఇతర అంశాలపై అధ్యయయాన్ని మొదలు పెట్టింది.. మరోవైపు.. చంద్రయాన్ -3 సక్సెస్‌ను పురస్కరించుకుని శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ప్రధాని మోడీ.. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ.. శనివారం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి వెళ్లి చంద్రయాన్ -3 విజయంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను అభినందించారు. ఇక, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్ -3లోని విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన ప్రదేశానికి ‘శివశక్తి’ అని పేరు పెట్టాలని సూచించారు. ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటామని కూడా ప్రకటించారు ప్రధాని మోడీ.. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన శివశక్తి పాయింట్ రాజధానిగా చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తు్నారు అఖిల భారత హిందూ మహాసభ నాయకుడు స్వామి చక్రపాణి.. దీనిపై పార్లమెంట్ ఓ ప్రకటన చేయాలని, ఐక్యరాజ్యసమితి కూడా తీర్మానం చేయాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారాయన. అంతేకాదు.. జిహాదీ భావజాలం కలిగిన వ్యక్తులు చంద్రుడిపైకి వెళ్లకముందే, చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటిస్తూ.. భారత పార్లమెంట్ తీర్మానం చేయాలని సూచించిన ఆయన.. ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి సైతం దీనిపై ఓ ప్రకటన చేయాలని కోరారు. మరోవైపు.. విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తి పాయింట్‌గా నామకరణం చేసినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు స్వామి చక్రపాణి.. చంద్రుడ్ని హిందూ సనాతన దేశంగా ప్రకటించాలి.. ల్యాండింగ్ ప్రాంతం ‘శివశక్తి పాయింట్’ను రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆకాక్షించారు.. అయితే, దీనికి సంబంధించిన కామెంట్లు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.. ఇస్రో విజయం సాధిస్తే.. ఇలాంటి వారి వాల్ల వారి పరువు కూడా పోయే పరిస్థితి వచ్చిందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి ఐడియాలు అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
శాస్త్రవేత్తను కత్తులతో వెంబడించిన గుండాలు.. కారు అద్దం పగులగొట్టి ఆపై..
ఎలక్ట్రానిక్ సిటీ బెంగుళూరులో ఈ మధ్య క్రైమ్ రేట్ ఎక్కువైపోతుంది. రోడ్డుపైనే దుండగులు రెచ్చిపోయి దాడి చేస్తున్నారు. ఇలాంటి కేసులు కొన్ని నెలల నుంచి వరుసగా జరుగుతున్నాయి. తాజాగా ఓ సైంటిస్ట్ ను కొంత మంది లోకల్ గూండాలు కత్తులతో వెంబడించారు. ఈ ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాలను ఆ శాస్త్రవేత్త ఎక్స్(ట్విటర్) వేదికగా పంచుకోవడంతో వెలుగులోకి వచ్చింది. ఇక విషయంలో వెంటనే స్పందించనందుకు ఆయన పోలీసులపై కూడా ఫైర్ అయ్యారు. అసలేం జరిగిందంటే.. ఆగస్టు 24వ తేదీన మధ్యాహ్నం 12:45గంటలకు కారులో వెళుతుండగా రౌతనహళ్లి రోడ్డు వద్ద కొంత మంది రౌడీలు అశుతోష్ సింగ్ అనే సైంటిస్ట్ కారును ఆపడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా పెద్ద పెద్ద కత్తులతో వారు ఆయన వెంటపడ్డారు. దాడిలో ఆయన కారు అద్దాన్ని వారు ధ్వంసం చేశారు. ఎలాగొలా వారి బారి నుంచి తప్పించుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు ఇంతవరకు సరిగా స్పందించకపోవడంతో ఆయన ఎక్స్(ట్విటర్) ద్వారా జరిగిన విషయంతో పాటు పగలగొట్టిన తన కారు ఫోటోలను షేరు చేశారు. దీంతో ఈ ఘటనపై కర్ణాటక అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్( ట్రాఫిక్ అండ్ సేఫ్టీ) అలోక్ కుమార్ స్పందించారు.
చైనాకు సరికొత్త టెన్షన్.. త్వరగా పెళ్లి చేసుకుంటే రివార్డులు..!
భారత్‌లో లాంటి దేశాల్లో గణనీయమైన జననాల రేటు ఉంది.. అది రేపటి యువతరానికి సూచిక.. ఇప్పటికే భారత్‌లో కావాల్సిన యువత ఉంది.. ప్రపంచదేశాలను సైతం భారత్ శాసిస్తోంది.. ఎక్కడ చూసినా.. భారత్ యువతే కీలక బాధ్యతల్లో ఉన్నారు. అయితే, మరికొన్ని దేశాలను ఇది కలవరపెడుతోంది.. జననాల రేటు గణనీయంగా పడిపోవడంతో చైనా లాంటి దేశాల్లో కొత్త ఆందోళనలు నెలకొన్నాయి.. అయితే, ఈ సమస్యకు చెక్ పెట్టుందుకు అప్రమత్తం అవుతోంది చైనా సర్కార్.. ఉద్యోగాలు, ఉపాధి అంటూ పెళ్లిని వాయిదా వేస్తున్న నేటి తరాన్ని.. పెళ్లివైపు అడుగులు వేసేలా రివార్డులు ప్రకటించింది.. 25 ఏళ్లు లేదా అంతకంటే ముందుగానే వివాహం చేసుకునే యువతులకు మాత్రమే ఈ రివార్డు అందజేయనుంది.. చైనాలోని జెజియాంగ్ రాష్ట్రంలోని చాంగ్‌షాన్ కౌంటీ ఈ మేరకు నిర్ణయం ఓ నిర్ణయం తీసుకుంది.. గత వారం చాంగ్‌షాన్ కౌంటీ యొక్క అధికారిక వెచాట్ ఖాతాలో ప్రచురించబడిన నోటీసు ప్రకారం.. మొదటి త్వరగా వివాహాలు చేసుకునేలా మరియు పిల్లలను కనడాన్ని ప్రోత్సహించేలా రివార్డు ఉంటుంది పేర్కొంది.. వధువు వయస్సు 25 లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, తూర్పు చైనాలోని ఒక కౌంటీ జంటలకు 1,000 యువాన్ల (137 డాలర్లు) రివార్డ్‌గా ప్రకటించింది. జనన రేటు తగ్గుముఖం పట్టడంపై పెరుగుతున్న ఆందోళన మధ్య యువకులను వివాహం చేసుకునేలా ప్రోత్సహించడానికి ఈ చర్యకు పూనుకుంది.. ఇది పిల్లలను కలిగి ఉన్న జంటలకు పిల్లల సంరక్షణ, సంతానోత్పత్తి మరియు విద్య సబ్సిడీల శ్రేణిని కూడా కలిగి ఉంది. ఆరు దశాబ్దాలలో చైనా యొక్క మొదటి జనాభా తగ్గుదల ఓవైపు.. వృద్ధాప్య జనాభా పెరగడం మరోవైపు ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్థిక ప్రోత్సాహకాలు మరియు మెరుగైన పిల్లల సంరక్షణ సౌకర్యాలతో సహా జనన రేటును పెంచడానికి కూడా అత్యవసరంగా అనేక చర్యలకు పూనుకుంటుంది.
మహిళ మెదడులో పరాన్నజీవి.. ప్రపంచంలో తొలి కేసు
వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఓ విచిత్రమై కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ మెదడులో ఏకంగా 3 అంగుళాల పరాన్నజీవిని వైద్యులు బయటకు తీశారు. మెదడులో పరాన్న జీవి రౌండ్ వార్మ్‌ను చూసి డాక్టర్లే ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలోనే ఈ తరహా కేసు మొదటిదని చెబుతున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ కేసును నివేదించింది. ఆస్ట్రేలియాకు చెందిన 64 ఏళ్ల ఓ మహిళ గత రెండేళ్లుగా న్యూమోనియా, కడుపునొప్పి, డయేరియా, పొడిదగ్గు, జ్వరం, రాత్రిలో చమటలు పట్టడం, నిరాశ, జ్ఞాపకశక్తి లోపాలతో సహా అనేక లక్షణాలతో బాధపడుతోంది. వీటి కోసం చికిత్స తీసుకుంటోంది. 2022లో ఆమె పరిస్థితి మరింత దిగజారడంతో వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 3 అంగుళాలు అంటే 8 సెంటీమీటర్ల వానపాము లాంటి రౌండ్ వార్మ్ ఉందని గుర్తించారు. కాన్‌బెర్రాలోని ఇన్పెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ సంజయ్ సేనానాయకే ఈ విషయాన్ని వివరించారు.
“మీరెందుకు పాకిస్తాన్ వెళ్లలేదు”.. విద్యార్థులపై టీచర్ మతపరమైన వ్యాఖ్యలు..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్‌లో ఓ స్కూళ్లో టీచర్ ఆదేశించడంతో ముస్లిం విద్యార్థిని, మరికొందరు విద్యార్థులు చెంపపై కొట్టడం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. త్రిప్తా త్యాగి అనే ఉపాధ్యాయురాలు చేసిన ఈ పనిపై విమర్శలు వెళ్లువెత్తాయి. అయితే ఈ చర్యలో ఎలాంటి మతపరమైన విద్వేషం లేని సదరు ఉపాధ్యాయురాలు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఢిల్లీలోని ఓ పాఠశాలలో ఓ టీచర్ మతపరమైన వ్యాఖ్యలు చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నలుగురు విద్యార్థులను ఉద్దేశిస్తూ.. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ఎందుకు వెళ్లలేదు..? అని టీచర్ ప్రశ్నించారు. ఇప్పుడు ఇది వివాదాస్పదం అయింది. ఢిల్లీ గాంధీనగర్ లోని ప్రభుత్వం సర్వోదయ బాల విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు హేమా గులాటీ అనే ఉపాధ్యాయురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సముద్రగర్భంలో యుద్ధం… యంగ్ టైగర్ సిద్ధం!
ఎట్టిపరిస్థితుల్లోను నవంబర్ వరకు దేవర షూటింగ్ కంప్లీట్ చేసి… నెక్స్ట్ వార్ 2లో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకే నాన్ స్టాప్ షెడ్యూల్‌తో దూసుకుపోతోంది దేవర సినిమా షూటింగ్. ఫస్ట్ టైం బౌండరీస్ దాటి పాన్ ఇండియా రేంజ్‌లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా దేవరను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. దాదాపు ఏడాది పాటు కేవలం ప్రీప్రొడక్షన్ వర్క్ మాత్రమే చేసిన కొరటాల… షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మూడున్నర నెలల్లోనే నాలుగు మేజర్ షెడ్యూల్స్‌ని జెట్ స్పీడ్‌లో కంప్లీట్ చేసాడు. ఈ లెక్కన కొరటాల శివ ఎంత పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగాడో అర్ధం చేసుకోవచ్చు. అయితే సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో… విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఒక్కో షెడ్యూల్‌ను ఒక్కో యుధ్దంలా డిజైన్ చేస్తున్నాడు కొరటాల. దేవర యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ఎలాంటా అప్డేట్ బయటికొచ్చినా… ఆ హైని తట్టుకోలేకపోతున్నారు నందమూరి ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమాలో అండర్ వాటర్ సీన్స్ కోసం తారక్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. ముంబాయి నుంచి వచ్చిన ట్రైనర్ల నెపథ్యంలో సముద్ర గర్భంలో యుద్ధానికి ప్రీపెర్ అవుతున్నాడట ఎన్టీఆర్. దీంతో దేవర పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. పైగా అన్ని పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్‌లే కాబట్టి… దేవర థియేటర్లోకి రావడమే ఆలస్యం బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయ్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. ఏప్రిల్ 5న దేవర రిలీజ్‌కు రెడీ అవుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా… సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. మరి జనతా గ్యారేజ్‌తో రీజనల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఎన్టీఆర్, కొరటాల… పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
మహేష్, ప్రభాస్, నాగార్జున, రవితేజ… అందరు హీరోలకి ఒకటే కావాలి
సంక్రాంతి సీజన్ అనగానే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎక్కడా లేని జోష్ వస్తుంది. లాంగ్ లీవ్స్, ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఉండడం కలెక్షన్స్ కి మంచి బూస్ట్ ఇస్తాయి. ఈ సీజన్ లో ఒక యావరేజ్ సినిమా పడినా కలెక్షన్స్ కెరీర్ బెస్ట్ అనిపించే రేంజులో ఉంటాయి. అందుకే సంక్రాంతి సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. 2024 సంక్రాంతి సీజన్ రిలీజ్ ని టార్గెట్ చేస్తూ ఈ ఏడాది స్టార్టింగ్ లోనే అనౌన్స్మెంట్ వచ్చాయి అంటే సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే వచ్చే సంక్రాంతికి కూడా భారీ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాన్ వరల్డ్ రేంజులో చేస్తున్న మొదటి సినిమా ప్రాజెక్ట్ కల్కిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు వైజయంతి మూవీస్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. పాన్ ఇండియా సినిమా హనుమాన్ కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా డిలే అవుతూ ఉంది. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్న రవితేజ కూడా సంక్రాంతి ఈగల్ మూవీని రిలీజ్ చేయనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. దీంతో పాటు ఎట్టి పరిస్థితిలో హనుమాన్ ని సంక్రాంతి బరిలో నిలపాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నాడు. రామ్ చరణ్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న గౌతమ్ తిన్నునూరి స్పై థ్రిల్లర్ కూడా సంక్రాంతికి రిలీజ్ అవనుంది. ఈ మూవీ గురించి ఖుషి రిలీజ్ అయ్యాకే అప్డేట్స్ బయటకి రానున్నాయి.