సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నారు. నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. బీసీసీఐ మెగా వేలంలో వేలం వేయడానికి 204 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ జాబితాలో రెండు సెట్ల మార్క్యూ ప్లేయర్‌లను తయారు చేశారు. అంతే కాకుండా.. వేలంలో ఎంపికైన 204 మంది ఆటగాళ్లలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాళ్లు, అత్యంత వయస్సు గల ఆటగాళ్లు ఉన్నారు.