ప్రధాని నరేంద్రమోదీ ఆస్తులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 3.7కోట్లకు చేరింది. ప్రతి ఏడాది ఆస్తులు, అప్పులు వివరాలను వెల్లడిస్తున్న మోడీ.. ఈ ఏడాది మార్చి 31 నాటి వివరాలను బహిర్గతం చేశారు. 2020లో 2.85కోట్లు ఉండగా.. ప్రస్తుతానికి ఆయన ఆస్తులు 22 లక్షలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి పొందే రూ. 2లక్షల జీతమే ప్రధానికి ముఖ్య ఆదాయ వనరుగా ఉంది. ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టడం, వాటివల్ల వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడమే ఆయన ఆదాయంలో వృద్ధికి కారణమని తెలుస్తోంది.