Modi’s Name 9 Lakh 9 Thousand Times: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని అమేఠీకి చెందిన శత్రుజ్ఞ బరన్‌వాల్ అనే వృద్ధుడు.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరును ఏకంగా 9 లక్షల 9 వేల సార్లు రాసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే, ఇలా మోడీ పేరు రాయడానికి ఓ కారణం కూడా ఉంది.. ఆయన వ్యక్తిత్వం నాకు ఎంతగానో నచ్చింది.. నా దృష్టిలో దేవుడు తర్వాత మోడీనే.. దేశానికి, సమాజానికి, మన మతానికి ఎంతో సేవ చేశారు అని శత్రుజ్ఞ బరన్‌వాల్ అనే వృద్ధుడు చెప్పుకొచ్చాడు.
Read Also: Ashika Ranganth: నువ్వు ఇక్కడే ఉండిపో అమ్మాయి… యూత్ ఫ్యానిజం చేస్తారు
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో రామాలయం కట్టిస్తున్నారు అనే విషయాన్ని కూడా శత్రుజ్ఞ బరన్‌వాల్ అనే వృద్ధుడు పేర్కొన్నారు. రాంలాలా ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొంటున్నారు.. మోడీని నేను మనస్పూర్తిగా అభిమానిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రధానిని నేరుగా కలవాలన్నదే నా కోరిక.. మోడీ పేరును ఇలా లక్షలాది సార్లు రాస్తే ఆయన్ను కలిసే ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను అంటూ 68 ఏళ్ల బరన్‌వాల్ వెల్లడించారు.