కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా నా సామిరంగ. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ మూవీలో నాగార్జున పక్కన హీరోయిన్ గా నటించింది కన్నడ బ్యూటీ అషిక రంగనాథ్. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయిన అషిక రంగనాథ్ మొదటి సినిమాతోనే ఆడియన్స్ ని మెప్పిచింది. “ఎన్నో రాత్రులు వస్తాయిగానీ” సాంగ్ లో అషిక రంగనాథ్ ని చూసి యూత్ ఫిదా అయ్యారు. స్కిన్ షో ఎక్కువగా చేయకుండానే గ్లామర్ గా కనిపించగలగడం అషిక రంగనాథ్ స్టైల్ అనే చెప్పాలి. అమిగోస్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అషిక రంగనాథ్ తెలుగు కెరీర్ కాస్త బ్రేక్ అయినట్లు అనిపించింది కానీ నా సామిరంగ సినిమాతో మళ్లీ తెలుగులో తన లక్ ని టెస్ట్ చేసుకోబోతుంది. ఈ సినిమా హిట్ అయితే అషిక రంగనాథ్ కెరీర్ కూడా సెట్ అయిపోయినట్లే.
కన్నడలో ఇప్పటికే మంచి హీరోల పక్కన నటించిన అషిక రంగనాథ్ తెలుగులో కూడా అలాంటి కెరీర్ ని మైంటైన్ చేయాలి అంటే నా సామిరంగ సినిమా హిట్ అవ్వాల్సిందే. మరి జనవరి 14న అషిక రంగనాథ్ రెండో సినిమాతో మొదటి హిట్ అందుకుంటుందేమో చూడాలి. ఇదిలా ఉంటే అషిక రంగనాథ్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలని పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా బ్లాక్ సారీలో అషిక రంగనాథ్ కొన్ని ఫోటోస్ ని పోస్ట్ చేసింది. ఈ ఫోటోస్ లో అషిక రంగనాథ్ చాలా అందంగా కనిపిస్తోంది. మరి ఈ అందానికి కింగ్ నాగ్ ఫస్ట్ హిట్ ఇస్తాడో లేదో చూడాలి.
Naa Saami ranga 🖤🔥 pic.twitter.com/Dc7iChmVBL
— Ashika Ranganath (@AshikaRanganath) January 12, 2024