రాజస్థాన్ రాష్ట్రం పాలి జిల్లాలోని బిలారా రాష్ట్ర రహదారిపై మాండ్లా గ్రామ సమీపంలో మూడు రోజుల క్రితం ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను హత్య చేసి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళ భర్త తన ప్రియురాలి సోదరుడితో కలిసి ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. హత్యా నేరం కింద మహిళ భర్త, అతని ప్రియురాలి సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.
READ MORE: Alcohol and Foods: ఆల్కహాల్ తాగేటప్పుడు ఇవి తినండి.. రుచిని ఎప్పటికీ మరచిపోలేరు..
పాలి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చునారామ్ జాట్ కథనం ప్రకారం.. జూన్ 19న మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె ఉత్తరాఖండ్ నివాసి. ఆమె అత్తమామలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నారు. మృతి చెందిన మహిళ భర్త అడ్వకేట్. అతడి పేరు విశాల్. విశాల్ తన మోహిత్ సోదరిని ప్రేమిస్తున్నాడు. దీన్ని విశాల్ భార్య వర్ష వ్యతిరేకించింది. విశాల్ ప్రియురాలు తనతోనే కలిసి ఉంటానని అతడిని బలవంతం పెట్టింది. మోహిత్ కూడా విశాల్ పై ఒత్తిడి తెచ్చాడు. దీంతో విశాల్ తన భార్యను తప్పించాలని ప్లాన్ చేశాడు. వర్షను తీసుకు వచ్చేందుకు రాజస్థాన్ వెళ్లాడు. మోహిత్ కూడా అతనితో ఉన్నాడు. వర్షాను జూన్ 19న తీసుకొస్తుండగా.. బిలారా రాష్ట్ర రహదారిపై విశాల్ కారున ఆపాడు. వర్ష ఛాతిలోకి రెండు బుల్లెట్లు కాల్చాడు. పక్కనే ఉన్న మోహిన్ పదునైన ఆయుధంతో వర్ష మెడపై దాడి చేశాడు.
READ MORE: Blackmail: సోషల్ మీడియాలో స్నేహం.. బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాదిన్నరగా యువతిపై అత్యాచారం
దీంతో వర్ష అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత నిందితుడు, అతని సహచరుడు మృతదేహాన్ని పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే పట్టుబడతామన్న భయంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయి ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని వర్షనా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ విశాల్ తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు భార్త విశాల్, విశాల్ ప్రియురాలి సోదరుడు మోహిత్ ను హంతకులుగా తేల్చారు. వారిద్దరినీ ఉత్తర్ ప్రదేశ్‌లోని మధుర జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు.