సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. రేవంత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాడు ఎన్ పెద్దిరాజు. ఈ కేసులో ఇప్పటికే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవంటూ పిటిషన్ ను క్వాష్ చేసిన తెలంగాణ హైకోర్టు. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేశాడు ఎన్ పెద్దిరాజు. అతడు వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం. ఎన్ పెద్దిరాజుతోపాటు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్ కు కోర్టు…
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు తరఫున సి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని హైకోర్టుకు తెలిపారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ప్రభాకర్ రావు వెంటనే హైదరాబాద్ తిరిగొస్తారని ఆయన న్యాయవాది తెలిపారు. ప్రభాకర్ రావు 30ఏళ్లకు పైగా ప్రభుత్వ సర్వీసులో వివిధ హోదాల్లో పనిచేశారని తెలిపారు. Also Read:Kerala:…
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్‌లకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.. ఏపీ, తెలంగాణకు చెందిన 1,200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు శుభవార్త చెప్పింది సుప్రీంకోర్టు.. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామక జీవోను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించగా.. వాటిపై స్టేటస్ కో విధించింది సుప్రీంకోర్టు..
TG High Court: బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహెల్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. ఈ నెల 16వ తేదీన పంజాగుట్ట పోలీసుల ముందు సాహెల్ హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై మండిపడింది
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల తరఫు లాయర్ రేపు వాదనలు వినిపించనున్నారు. ఈరోజు విచారణలో మొదట ఎమ్మెల్యే కడియం శ్రీహరి తరఫున న్యాయవాది మయూర్రెడ్డి వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది గండ్ర మోహన్రావు వాదించారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలపై అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. అక్రమ కట్టడం పేరుతో తన కన్వెన్షన్ సెంటర్ ను ఇవాళ కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ అక్కినేని నాగార్జున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ జరిపారు.