హాట్ హాట్‌గా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈనెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీకి వాయిదా వేశారు. మళ్లీ రెండవ రోజు (సోమవారం) ప్రారంభమైన అసెంబ్లీ.. ఈరోజుతో 7 రోజులు సమావేశాలు వాడీవేడిగా సాగాయి.
ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిరవధిక వేయిస్తున్నట్లు ప్రకటించారు. 10 రోజులపాటు కొనసాగిన సభలో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. మొత్తం 59 గంటల 57 నిమిషాల పాటు సభ కొనసాగింది.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల తరఫు లాయర్ రేపు వాదనలు వినిపించనున్నారు. ఈరోజు విచారణలో మొదట ఎమ్మెల్యే కడియం శ్రీహరి తరఫున న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదించారు.
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. అయితే.. నేడు తీర్పు వెలువడుతుందని అనుకున్నప్పటికీ.., తీర్పు వాయిదా పడింది.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది. ఈ నెల 24కు విచారణ వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడింది. ఈ సమావేశాల్లో అసెంబ్లీ 9 బిల్లులకు ఆమోదం తెలిపింది. కాగా.. ఈనెల 5న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు జరిగాయి. 10 గంటల 2 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి.
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లంచ్ మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. శాసనసభ సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మండలి ఛైర్మన్ జారీ చేసిన నోటీసులను ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. వీటిపై సోమవారం వాదనలు…
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసు విచారణ జరిగింది. చంద్రబాబుకు స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీం కోర్టులో సవాలు చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో విచారణ చేపట్టగా, ధర్మాసనం ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. అంతేకాకుండా.. కౌంటర్ దాఖలు చేసేందుకు బాబు తరపు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో కేసును వాయిదా వేశారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో జస్టిస్ బేలా ఎం త్రివేదీ,…
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తైన తర్వాత ఏసీబీ కోర్టు గంట పాటు కేసును వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. రేపు (శుక్రవారం) ఉదయం గం.10.30 సమయానికి ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును విచారించేందుకు కస్టడీకి అనుమతించాలని ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు సాయంత్రమే దీనిపై తీర్పు వస్తుందని అంతా భావించారు. మొదట ఈ కేసు తీర్పును 10 నిమిషాలు వాయిదా వేసిన న్యాయమూర్తి.. ఆ తరువాత రేపు తీర్పు వెల్లడిస్తానని తెలిపారు.