TGSRTC : డిపోలు ప్రైవేట్‌పరమంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు
- డిపోలు ప్రైవేట్‌పరమంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు
- టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేషన్స్
- డిపోల ప్రైవేట్‌పర దుష్ప్రచారాన్ని ఖండించిన టీజీఎస్‌ఆర్టీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ డిపోలను ప్రైవేట్‌పరం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ) యాజమాన్యం స్పష్టం చేసింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు చేస్తోన్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి సంస్థ తీసుకువస్తోందని పేర్కొంది. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్ నిర్వహణ పూర్తిగా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వెల్లడించింది.
కేంద్రప్రభుత్వ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుపాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఫేమ్)-1 స్కీమ్‌లో భాగంగా 2019 మార్చిలో 40 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఇదే విధానంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఒలెక్ట్రా కంపెనీతో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిన ఒప్పందం చేసుకుని పుష్ఫక్ పేరుతో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మార్గంలో ఈ బస్సులను సంస్థ నడుపుతోంది. హైదరాబాద్‌లోని కంటోన్మెంట్, మియాపూర్-2 డిపోల నుంచి వాటిని తిప్పుతోంది. బస్సుల మెయిన్‌టనెన్స్, చార్జింగ్ మినహా ఆపరేషన్స్ అంతా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతోంది.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
Thailand: థాయ్‌లాండ్ ప్రధానిపై వేటు.. కోర్టు యాక్షన్‌తో ఊడిన పోస్టు
2023 మార్చిలో కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం(ఎన్‌ఈబీపీ) కింద 500 ఇంటర్ సిటీ బస్సులను టెండర్ ద్వారా జేబీఎం కంపెనీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అందులో 48 ఈ-సూపర్ లగ్జరీ బస్సులు ప్రస్తుతం రాగా.. వాటిలో 35 కరీంనగర్-2 డిపోకు, 13 నిజామాబాద్-2 డిపోనకు సంస్థ కేటాయించింది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం అవసరమైన చార్జింగ్ స్టేషన్ల నిర్మాణం డిపోల్లో పూర్తి కావస్తుండటంతో.. వాటిని త్వరలోనే ప్రారంభించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.
Chiyan Vikram: తంగలాన్ లో రెండు క్యారెక్టర్స్ చేశా.. తన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది: విక్రమ్ ఇంటర్వ్యూ
అలాగే, ప్రజల రవాణా అవసరాలు, కాలుష్య నివారణను దృష్టిలో పెట్టుకుని 2023లో 550 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లను సంస్థ పిలిచింది. అందులో 500 సిటీ బస్సులు, హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులున్నాయి. అందులో ప్రస్తుతం సిటీలో 74 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా.. విజయవాడ మార్గంలో ఈ-గరుడ పేరుతో 10 బస్సులు తిరుగుతున్నాయి. దశలవారీగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ అందుబాటులోకి తెస్తోంది.
ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంలో దేశవ్యాప్తంగా అవలంభిస్తోన్న ఈవీ పాలసీనే 2019 నుంచి టీజీఎస్‌ఆర్టీసీ అమలు చేస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులను నేరుగా కొనాలంటే వ్యయంతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ మేరకు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిన అంటే బస్సు తిరిగే కిలోమీటర్ల ప్రకారం కంపెనీలకు చెల్లింపులు చేయడం జరుగుతుంది.
ప్రతి డిపో పరిధిలో రూరల్, అర్బన్, తదితర భిన్నమైన రూట్లు ఉంటాయి. ఎలక్ట్రిక్ బస్సులను అన్ని రూట్లలో తిప్పడం సాధ్యపడదు. ఎలక్ట్రిక్ బస్సులు తిరిగే కిలోమీటర్ల సామర్థ్యాన్ని బట్టి రూట్లను సంస్థ గుర్తిస్తుంది. ప్రతి డిపోలోనూ ఎలక్ట్రిక్, డీజిల్ మిశ్రమం ఉంటుంది. ప్రైవేట్ అద్దె బస్సుల మాదిరిగానే ఎలక్ట్రిక్ బస్సులన్నీ టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఆ బస్సుల ద్వారా వచ్చే టికెట్ ఆదాయం నేరుగా సంస్థకే వస్తోంది. ఒప్పందం ప్రకారం తిరిగిన కిలోమీటర్ల లెక్కన కంపెనీలకు నగదును చెల్లిస్తుంది. డిపోలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తాయనడంలో నిజం లేదు. కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సిబ్బందికి, ప్రజలకు సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..