మొదట్లో మారుతితో సినిమా వద్దంటే వద్దని ప్రభాస్ ఫ్యాన్స్ నెగెటివ్ ట్రెండ్ చేశారు. కానీ ప్రభాస్ మాటిచ్చేశాడు కాబట్టి.. సైలెంట్‌గా మారుతితో షూటింగ్ మొదలు పెట్టేశాడు. అక్కడి నుంచి చిత్ర యూనిట్ మెల్లిగా ఈ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ముందుగా లీక్డ్ ఫోటోలు అంటూ కొన్ని లీకులు బయట పెట్టారు. ఆ ఫోటోలో ప్రభాస్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. చెప్పినట్టుగానే మారుతి వింటేజ్ డార్లింగ్‌ను చూపించబోతున్నాడనే ఆశలు పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్, ప్రభాస్ ఓల్డ్ లుక్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రాజాసాబ్ ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా? అనేలా వెయిట్ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్.
Also Read: Pawan Kalyan-Chiranjeevi: పవర్ స్టార్ ఫిక్స్.. మరి మెగాస్టార్ పరిస్థితేంటి?
కానీ ఈ మధ్య రాజాసాబ్ సౌండే లేకుండా పోయింది. అసలు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు. ఏప్రిల్ 10న రాజాసాబ్‌ను రిలీజ్ చేస్తామని డేట్ లాక్ చేసి పెట్టారు. ఇక్కడి నుంచి చూసుకుంటే విడుదలకు మరో మూడు నాలుగు వారాల సమయం కూడా లేదు. కాబట్టి రాజాసాబ్ వాయిదా పడినట్టే. కానీ మేకర్స్ మాత్రం కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం లేదు, ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. లేటెస్ట్‌గా కమెడియన్ సప్తగిరి మాత్రం ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉంటుందనే హైప్ ఇచ్చాడు. సప్తగిరి లేటెస్ట్ ఫిల్మ్ ‘పెళ్లి కాని ప్రసాద్’ ప్రమోషన్స్‌లో భాగంగా రాజాసాబ్‌లో ప్రభాస్ చేసే కామెడీకి మామూలుగా ఉండదని, రాజాసాబ్ ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తుందని అన్నాడు. ఈ అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేసింది. ఇక కొత్త రిలీజ్ డేట్‌తో పాటు రాజాసాబ్ టీజర్‌ను వచ్చే నెలలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. టీజర్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించి.. ఇక్కడితో ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారట. బహుశా ఏప్రిల్ 10న రాజాసాబ్ టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే.. ఇదే రాజాసాబ్ అప్డేట్.