Chiranjeevi-Anil Ravipudi: చిరంజీవి-అనిల్ ‘మెగా’ స్పీడ్.. త్వరలోనే సెకండ్ హాఫ్?
- విశ్వంభర సినిమా చేస్తున్న చిరంజీవి
- అనిల్ రావిపూడితో చిరంజీవి సినిమా
- టీమ్‌తో కలిసి స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసిన డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీపై భారీ అంచనాలున్నాయి. కుదిరితే సమ్మర్ లేదా ఆగష్టులో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది విశ్వంభర చిత్ర యూనిట్. మరోవైపు గ్రాఫిక్స్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో చిరంజీవి సినిమా చేయబోతున్నారు.
పోయిన సంక్రాంతికి అనిల్ రావిపూడి ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో 300 కోట్లు కొల్లగొట్టాడు. ఇప్పుడు అదే జోష్‌లో చిరంజీవి సినిమాను పట్టాలెక్కించడానికి పరుగులు పెడుతున్నాడు. మెగాస్టార్ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా స్క్రిప్ట్ స్టేజీలోనే ఉంది. ఇటీవల వైజాగ్‌లో తన టీమ్‌తో కలిసి డైరెక్టర్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడు. కానీ అప్పుడే డైలాగ్ వెర్షన్‌తో సహా ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్‌ను లాక్ చేశాడట. త్వరలోనే హైదరాబాద్‌లో సెకండ్ హాఫ్‌ని కూడా పూర్తి చేయనున్నారట.
Also Read
- Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.?
- Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
Also Read: Raja Saab: ‘ది రాజాసాబ్’ నెక్స్ట్ లెవల్.. టీజర్ లోడింగ్?
మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయంలో కీలక పాత్ర పోషించిన భీమ్స్ సిసిరోలియో చిరంజీవి మూవీకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేశాడట భీమ్స్. సమ్మర్‌లో రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేసి.. 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసేలా చిత్ర యూనిట్ టార్గెట్ పెట్టుకుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. మరి మెగాస్టార్‌తో అనిల్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.?
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
-
Asus: Asus Vivobook లైనప్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లు.. S14, S16, 14 Flip, S14 Flip, Vivobook 16 లాంచ్
-
The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!