Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Film Celebrity Interviews Chiyan Vikram Interview For Thangalaan Movie

Chiyan Vikram: తంగలాన్ లో రెండు క్యారెక్టర్స్ చేశా.. తన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది: విక్రమ్ ఇంటర్వ్యూ

Published Date :August 14, 2024 , 5:17 pm
By Bhargav Chaganti
Chiyan Vikram: తంగలాన్ లో రెండు క్యారెక్టర్స్ చేశా.. తన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది: విక్రమ్ ఇంటర్వ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chiyan Vikram Interview for Thangalaan Movie: చియాన్ విక్రమ్ నటించిన శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి చిత్రాలెన్నో నటుడిగా, స్టార్ హీరోగా ఆయన ప్రత్యేకతను చూపించాయి. ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రేక్షకుల్ని అలరించే చియాన్ విక్రమ్ “తంగలాన్” తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. “తంగలాన్” సినిమాలో పార్వతి తిరువొతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. “తంగలాన్” సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోన్న నేపథ్యంలో సినిమాలోని హైలైట్స్ ను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు చియాన్ విక్రమ్.

– నేను నటించిన శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి మూవీస్ లాగే తంగలాన్ ఒక డిఫరెంట్ మూవీ. ఇదొక ఎమోషనల్ మూవీ, రా కంటెంట్ తో ఉంటుంది. ఈ స్క్రిప్ట్ చేసిన తర్వాత రంజిత్ ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయాడు. సినిమా గ్రామర్ పాటించని సినిమా ఇది. పాటలు, ఫైట్స్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఇలా పా.రంజిత్ డిజైన్ చేయలేదు. తంగలాన్ లో ఒక లైఫ్ ఉంటుంది. తంగలాన్ ఒక డిఫరెంట్ మూవీ. కొన్నిసార్లు ఒక సీన్ ఒకే షాట్ లో చేశాము. లైవ్ సౌండింగ్ లో చేసేవాళ్లం. ఈ సినిమా నాకొక బ్యూటిఫుల్ ఎక్సీపిరియన్స్. ఎందుకంటే ఇప్పటిదాకా నేను లైవ్ సౌండింగ్ లో సినిమా చేయలేదు. నా ప్రతి సినిమాలో కొంత గొంతు మార్చి మాట్లాడుతుంటా.

Also Read

  • Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్య వివాహం
  • Bhoghi : 'కందుల సులోచన రాణి'గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది
  • Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు
  • May 1st Releases : టాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ Vs డబ్బింగ్ మూవీస్

– ఈ సినిమాలోనూ అలాగే డైలాగ్స్ చెప్పాను. రోజంతా రెస్ట్ లేకుండా పనిచేసేవాళ్లం. ఆ ప్రాంతం వాళ్లు ఎలాంటి లైఫ్ లీడ్ చేశారో..మేమూ అలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తూ షూటింగ్ చేశాం. నేను ఇప్పటిదాకా ఇలాంటి మూవీ చేయలేదు. ఇంత కష్టపడి చేయలేదు. దానికి కారణం..మా డైరెక్టర్ పా.రంజిత్. ఆయన నా దగ్గరకు ఒక కమర్షియల్ కథ తీసుకురాలేదు. పా.రంజిత్ కెరీర్ లో కమర్షియల్ మూవీస్ తో పాటు ఆర్టిస్టిక్ మూవీస్ చేస్తూ బ్యాలెన్స్ గా కెరీర్ సాగిస్తున్నారు. తన సినిమాలతోనే దర్శకుడిగా ఆయన ఐడియాలజీ, స్పెషాలిటీ చూపించారు. పా.రంజిత్ చేసిన గొప్ప సినిమాల్లో తంగలాన్ ఒకటి అవుతుంది.

– ప్రేక్షకుల్ని తంగలాన్ తన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. జ్ఞానవేల్ నాకు ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇది మా కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ ..ఇకపైనా మేము సినిమాలు చేస్తాం. గతంలో బాలీవుడ్ సినిమా గురించే దేశమంతా మాట్లాడుకునేది. ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ వంటి సౌత్ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. కేజీఎఫ్, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు దీన్ని ప్రూవ్ చేశాయి. ఆర్ఆర్ఆర్ తో మనం కూడా ఆస్కార్ గెల్చుకోవచ్చు అని నిరూపించారు దర్శకుడు రాజమౌళి గారు. ఈ వేదిక నుంచి ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. తంగలాన్ లో రెండు క్యారెక్టర్స్ చేశాను.

– క్యారెక్టర్స్ లో సహజంగా కనిపించేందుకు శారీరకంగా చాలా శ్రద్ధ తీసుకున్నాను. ఆహారం దొరకని పరిస్థితిలో ఉన్న క్యారెక్టర్ లో కనిపించాలంటే నేను హీరో బాడీతో ఉంటే ఎవరికీ నచ్చదు. తెలుగు సినిమాలకు తమిళనాట ఆదరణ లేదు అనడం సరికాదు. అక్కడ తమిళ స్ట్రైట్ సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన పరభాషా చిత్రాలున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతారను తమిళ ఆడియెన్స్ బాగా ఆదరించారు.

– తంగలాన్ బ్యూటిఫుల్ అడ్వెంచరస్ మూవీ. డైరెక్టర్ రంజిత్ తన ఆర్ట్ ఫామ్ లో అందంగా రూపొందించాడు. తంగలాన్ ఒక మంచి సినిమా. మీరంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తారా అని వెయిట్ చేస్తున్నాను. రంజిత్ గారు నా డ్రీమ్ డైరెక్టర్. ఆయనతో పని చేయాలని ఎప్పటి నుంచో అనుుకుంటున్నా. ఎందుకో గానీ కుదరలేదు. తంగలాన్ గురించి ఆయన చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. మీకు సర్ ప్రైజ్ గా ఉండాలని సినిమా గురించి ఏమీ రివీల్ చేయడం లేదు. ఈ సినిమాలో అడ్వెంచర్, మెసేజ్, మ్యాజిక్, ఎమోషన్స్ ఉన్నాయి. ఇది నాకు దొరికిన ది బెస్ట్ రోల్ అని అనుకుంటున్నా. జ్ఞానవేల్ రాజా గారు మాకు ఫుల్ లిబర్టీ ఇచ్చి మూవీ ప్రొడ్యూస్ చేశారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. ఇది పాన్ ఇండియా కాదు వరల్డ్ స్టేజీ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు జ్ఞానవేల్ రాజా గారు. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ ఇష్టపడి సినిమా కోసం వర్క్ చేశారు. మీరు థియేటర్స్ కు వచ్చినప్పుడు తప్పకుండా ఈ కంటెంట్ తో కనెక్ట్ అవుతారు. పార్వతీ, మాళవిక చాలా బాగా పర్ ఫార్మ్ చేశారు.

– తంగలాన్ తెలుగు, తమిళ, కన్నడ అని కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యే స్టోరీ. బంగారం వేట అనేది హైలైట్ అవుతున్నా..ఈ కథలో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ఉంది. ఇది ఒక వర్గానికి ఆపాదించలేం. మన జీవితాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు అసమానతలకు గురవుతూ ఉంటాం. అలాంటి వారి కోసం దర్శకుడు పా రంజిత్ సినిమా అనే మాధ్యమం ద్వారా తన అభిప్రాయాలు చెబుతున్నారు. సార్పట్ట సినిమా చూసినప్పుడు ఆ కథలోకి లీనమవుతాం గానీ మిగతా విషయాలు పట్టించుకోం. అలాగే ఈ సినిమా కథ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఎవరినీ ఇబ్బంది పెట్టే పేర్లు, మాటలు ఈ సినిమాలో ఉండవు. ఆ జాగ్రత్తలు దర్శకుడు పా రంజిత్ తీసుకున్నారు. “తంగలాన్” అనేది ఒక తెగ పేరు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ లుక్స్ చూసినప్పుడు ఒక్కోసారి ఒక్కో అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ టైమ్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఇది కేజీఎఫ్ లా ఉంటుందా అన్నారు. మరోసారి తెగ నాయకుడి గెటప్ రిలీజ్ చేసినప్పుడు ఇది రా అండ్ రస్టిక్ గా ఉంటుందని అన్నారు. కానీ “తంగలాన్” లో అన్ని అంశాలు ఉన్నాయి.

– ఈ క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు కొన్ని గంటల పాటు మేకోవర్ కు పట్టేది. మళ్లీ మేకప్ తొలగించుకునేందుకు కనీసం రెండు గంటలు అయ్యేది. చలిలో, వేడిలో అలాగే షూటింగ్ చేశాం. మనకు ఇష్టమైన పని దొరికినప్పుడు ఆకలి, నిద్ర మర్చిపోతుంటాం. అలా నేను నా సినిమాల్లో నటిస్తున్నప్పుడు మిగతా విషయాలేవీ పట్టించుకోను. ఆ పాత్రకు తగినట్లు మారానా లేదా అనేదే ఆలోచిస్తాను. అవార్డులు నాకు ఇష్టమే. కానీ మీ నుంచి వచ్చే ప్రశంసలు మరింత సంతోషాన్ని ఇస్తాయి. ఆఫ్రికన్ ట్రైబ్స్ సహా ప్రపంచంలోని కొన్ని తెగలు ఎలా ఉంటాయో నేను తెలుసుకున్నాను. అవి ఈ మూవీ చేయడంలో హెల్ప్ అయ్యాయి. నాతో పాటు ఆర్టిస్టులంతా సింగిల్ షాట్ లో సీన్స్ చేశాం. ఆ సీన్ లో 30 టేక్స్ ఉన్నా..సింగిల్ షాట్ లోనే చేసేవాళ్లం. ఇవాళ సినిమాకు భాషాంతరాలు లేవు. పాన్ ఇండియా అని మనమే అంటున్నాం. నేను ఎక్కడ నటించినా అది అన్ని భాషల ప్రేక్షకులకు రీచ్ అవుతోంది. థియేటర్ లో మిమ్మల్ని ఈ సినిమా సర్ ప్రైజ్ చేస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiyan Vikram Interview
  • thangalaan movie

తాజావార్తలు

  • Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!

  • AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల..

  • Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మంచి జీతం

  • Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్‌ కీలక వ్యాఖ్యలు!

  • SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ ‘నో-లుక్’ షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!

ట్రెండింగ్‌

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions