ECET Results 2023: తెలంగాణ ఈసెట్ -2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి విడుదల చేశారు. ఈ ఫలితాలను మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ వెల్లడించారు. ఈసెట్ ఫలితాల్లో ఈ ఏడాది 93.07 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపారు. ఈ పరీక్షను మే 20వ తేదీన రెండు సెషన్లలో నిర్వహించిన సంగతి తెలిసిందే.
Read Also: Adipurush: తెలుగు బుకింగ్స్ ఓపెనే అవ్వలేదు.. కానీ లక్ష టికెట్లు అమ్ముడయ్యాయ్?
ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 22వేల454 మంది విద్యార్థులు హాజరైనట్టు ఈసెట్ కన్వీనర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. అందులో ఉత్తీర్ణత సాధించిన వారు 20,899 మంది విద్యార్థులు ఉన్నారు. ఈసెట్ కు సంబంధించి 176 కాలేజీల్లో 9 వేల సీట్లు ఉన్నాయి. జులైలో ఈసెట్ కౌన్సెలింగ్ జరుగనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పాలిటెక్నిక్, బీఎస్సీ (గణితం) పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ/ బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తుంటారు. TS ECET Results 2023 ను https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Read Also: Cyclone Biparjoy: భీకర తుఫానులో కోస్ట్‌గార్డ్ సాహసం.. సముద్రం నుంచి 50 మంది రెస్క్యూ..
మరోవైపు తెలంగాణలో బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు (TS EdCET result) కూడా విడుదలయ్యాయి. విశ్వవిద్యాలయం (MGU) ఆధ్వర్యంలో గత నెలలో ఈ పరీక్ష జరగగా.. వాటి ఫలితాలను ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. మే 18న రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 26,994 అభ్యర్థులు (98.18%) ఉత్తీర్ణత సాధించినట్టు లింబాద్రి వెల్లడించారు. ఎడ్‌సెట్ ఫలితాలను https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.