Cyclone Montha : మొంథా తుఫాన్ వరంగల్ జిల్లాను ముంచేసింది. మొన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్థంభించిపోయింది. లోతట్టు ముంపు ప్రాంతాలు మొత్తం నీటిలో మునిగాయి. శాఖ రాసి కుంట, శివనగర్, బి ఆర్ నగర్, ఎస్సార్ నగర్, ఎన్టీఆర్ నగర్, కిల్లా వరంగల్ ప్రాంతాలలో ఇళ్లల్లోకి వరద నీళ్లు వచ్చాయి. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో…
Sigachi Blast : సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఫేజ్-3 లోని సిగాచి (Sigachi) పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) బృందం నేడు సంఘటన స్థలాన్ని సందర్శించనుంది. NDMA బృందం, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (SDMA) తో కలిసి పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై సవివరంగా అధ్యయనం చేయనుంది. ప్రమాదానికి కారణమైన పరిస్థితులు, భద్రతా లోపాలు, గ్యాస్ లీక్ లేదా…
Sigachi Blast : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశామైలారం లోని సిగాచి ఇండస్ట్రీస్ (Sigachi Industries) ఫార్మా కంపెనీలో ఇటీవల జరిగిన భారీ పేలుడు అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 39కి చేరింది. ఇప్పటికే 38 మంది మృతి చెందగా, తాజాగా ధృవ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మరో కార్మికుడు మరణించడంతో మరణాల సంఖ్య పెరిగిందని వైద్యులు తెలిపారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన భీమ్‌రావుగా…
Pashamylaram : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో నిన్న జరిగిన ఘోర రసాయన ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. సిగాచి ఇండస్ట్రీస్‌కి చెందిన ఈ రసాయన కర్మాగారంలో సంభవించిన పేలుడు, మంటల వల్ల ఇప్పటివరకు 37 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరెన్నో శవాలు ఇప్పటికీ గుర్తుతెలియని స్థితిలో ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో వర్షం పడుతున్నా కూడా సహాయక చర్యలు…
CM Revanth Reddy: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్పందించిన ఆయన, బాధితుల కుటుంబాలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం (జులై 1) ఉదయం 10 గంటలకు స్వయంగా ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు. సహాయక చర్యల పురోగతిపై ఎప్పటికప్పుడు మంత్రి దామోదర…
Gujarat Govt : దేశ చరిత్రలో అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది. దేశంలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా ఇది నిలిచింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 275 మంది చనిపోయినట్టు గుజరాత్ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఇందులో 241 మంది ప్రయాణికులు ఉండగా.. 34 మంది స్థానికులు ఉన్నట్టు గుజరాత్ ఆరోగ్యశాఖ స్పస్టం చేసింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పుడే అధికారికంగా గుజరాత్ ఈ వివరాలను వెల్లడించింది. Read Also : Rammohan…
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం అని డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం – టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాము. వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది. ఈ దుర్ఘటనలో మృతులకు దేశం బాసటగా ఉండాల్సిన సమయం ఇది అని పవన్ కళ్యాణ్ ఒక…
Bhadradri Incident : భద్రాచలం పట్టణంలో ఒక ఆధ్యాత్మిక సంస్థ నిర్మించిన ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ భవనాన్ని శ్రీనివాస్ అనే వ్యక్తి పాత భవనంపై నిర్మించారు. అయితే, దీనిపై 120కు పైగా ఫిర్యాదులు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గతంలో కూడా ఈ భవనం నాణ్యతలేమి, నిర్మాణం ప్రామాణికతలేకపోవడం గురించి స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ, కేవలం తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేయడమే…