ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటీఎంలను అంతరాష్ట్ర ముఠాలు కొల్లగొట్టాయి. 48 గంటల వ్యవధిలో మూడు ఏటీఎంలను దోచేశారు ఆగంతకులు. సుమారు 50 లక్షల రూపాయలు చోరీ అవ్వగా.... దొంగలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలను లక్ష్యంగా చేసుకున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 80 శాతం పోలింగ్ లక్ష్యంగా పెట్టుకోవడంతో ప్రతి ఒక్క ఓటరుకు అవకాశం కల్పించాలని ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికే పోలింగ్ బూత్లకు పోలింగ్ మెటీరియల్ తరలింపు పూర్తయింది. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అప్పన్న స్వామి భక్తులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సింహాచలంలోని కేశ ఖండన శాలలో పైకప్పు పెచ్చులు కూలిపడ్డాయి.
విశాఖ జిల్లాలో తహశీల్దార్ హత్య కేసు సంచలనం సృష్టించింది. ఎమ్మార్వో ఇంటికి వెళ్లి ఓ ఆగంతకుడు రాడ్‌తో కొట్టి చంపేశాడు. రెవెన్యూ సిబ్బందిపై ఈ తరహా దారుణం విశాఖలో మొదటి సారి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది.
విశాఖలో అర్ధరాత్రి దుండగులు చెలరేగి పోయారు. విజయనగరం జిల్లా బంటుమిల్లి తహాసీల్దార్ రమణయ్యను ఇనుపరాడ్డులతో తలపై కొట్టి పరారయ్యారు దుండగులు. కొమ్మాదిలోని తహశీల్దార్ రమణయ్య నివశిస్తున్న అపార్ట్ మెంట్‌లోకి చొరబడి ఆయనపై దాడి చేశారు. వాచ్‌మెన్ గట్టిగా కేకలు వేయడంతో ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.