6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TECNO CAMON Slim Launched: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించేలా టెక్నో (TECNO) నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో కామోన్ స్లిమ్ (TECNO CAMON Slim)ను అధికారికంగా లాంచ్ చేసింది. కేవలం 6.39 మి.మీ. అల్ట్రా స్లిమ్ 3D కర్వ్డ్ యూనీబాడీ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ స్టైలిష్ లుక్‌తో పాటు శక్తివంతమైన AI ఫీచర్లు, అడ్వాన్స్డ్ కెమెరా వ్యవస్థ, భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తోంది.
ఆకట్టుకునే డిజైన్:
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ సమ్మెట్రికల్ 3D కర్వ్డ్ డిజైన్‌తో రూపొందించబడింది. ఫోన్ వెనుక భాగంలో 354 మినీ LED లైట్లతో కూడిన కొత్త మూడ్ లైటింగ్ సిస్టమ్‌ను అందించారు. కాల్స్, మెసేజ్‌లు, గేమింగ్, ఛార్జింగ్ వంటి నోటిఫికేషన్లకు అనుగుణంగా మొత్తం 55 రకాల లైటింగ్ ఎఫెక్ట్ లను అందించగలదు. అంతేకాదు యూజర్లు తమకు నచ్చిన యానిమేషన్లను కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం 5 ప్రత్యేక డిజైన్ వేరియంట్లలో లభిస్తుంది. UV కాంతికి స్పందించే “New Mondrian”, 3D క్రిస్టల్ డైమండ్ ఎఫెక్ట్‌తో “Prism Black”, “Jungle Green”, స్టార్ర్రీ నైట్ ఆర్ట్ ప్రేరణతో రూపొందిన “Van Gogh Blue”, మ్యాట్ ఫినిష్‌తో “Burgundy Red” రంగులు అందుబాటులో ఉన్నాయి.
Also Read
- ASUS ROG Laptops: ASUS నుంచి కొత్త AI ల్యాప్టాప్స్.. క్రియేటర్లు, గేమర్ల కోసం ప్రీమియం ROG లైనప్ విడుదల
- Realme P4x 4G: 8000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, 50MP కెమెరాతో.. రియల్మీ P4x 4G విడుదల
- AI: ఏఐ తీసుకొస్తున్న భారీ ముప్పు.. నెలల్లోనే అంతా స్మాష్..?
- Redmi 17C: 5,160mAh బ్యాటరీతో రెడ్మీ 17C విడుదల.. 120Hz డిస్ప్లే, హీలియో G81 అల్ట్రా చిప్సెట్
సోనీ కెమెరా:
ఫోన్లో 50MP సోనీ LYT-600 ప్రధాన కెమెరాను అమర్చారు. పెద్ద సెన్సార్ కారణంగా తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఫోటోలు తీయవచ్చు. టెక్నో ప్రత్యేక నైట్ ఇమేజింగ్ అల్గారిథమ్స్ ఫోటోలలో నాయిస్‌ను తగ్గించి సహజ రంగులను అందిస్తాయి. అలాగే AI ఆధారిత మోషన్ డిటెక్షన్, షట్టర్ కంట్రోల్ టెక్నాలజీలతో బ్లర్ తగ్గించి క్లియర్ ఫోటోలను అందిస్తుంది. ముందు భాగంలో 92.4 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో అనేక AI ఆధారిత ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. AI స్నాప్ పోస్టర్ ద్వారా ఫోటోలను ఆటోమేటిక్‌గా ప్రొఫెషనల్ పోస్టర్లుగా మార్చుకోవచ్చు. AI పెట్ టుగెథర్ ఫీచర్ ద్వారా పెంపుడు జంతువులతో కలిసి ప్రత్యేక ఫోటోలను రూపొందించవచ్చు.
భారీ బ్యాటరీ:
ఈ మొబైల్ కేవలం 6.39mm మందం ఉన్నపటికీ.. 6000mAh (కొన్ని మార్కెట్లలో 5600mAh) భారీ బ్యాటరీని అందించారు. 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 2000 ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా బ్యాటరీ హెల్త్ 80% వరకు నిలిచి ఉంటుందని కంపెనీ తెలిపింది.
144Hz AMOLED డిస్ప్లే:
ఫోన్ ముందు భాగంలో 6.78 అంగుళాల 1.5K రిజల్యూషన్‌తో కూడిన 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్, Gorilla Glass 7i రక్షణతో ఇది మరింత ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.
ప్రాసెసర్:
ఈ ఫోన్లో MediaTek Helio G200 Ultimate ప్రాసెసర్, 8GB RAM, 128GB/256GB స్టోరేజ్, డ్యూయల్ స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, IR బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే IP68, IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌తో పాటు MIL-STD-810 మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ కూడా అందించారు. TECNO CAMON Slim ప్రస్తుతం పలు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల అవుతోంది. ధర, ప్రాంతాల వారీ విడుదల తేదీలను కంపెనీ త్వరలో ప్రకటించనుంది.
తాజావార్తలు
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Rajnikanth : నేను మాట్లాడినా సమస్యే.. మాట్లాడకపోయినా సమస్యే
-
India Iran Travel Advisory: ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు వద్దు.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
-
Sachin Tendulkar-ICC: హ్యాట్సాఫ్.. ఐసీసీపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు!
ట్రెండింగ్
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!