Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
- ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్
- రిషభ్ పంత్ ప్రయాణంలో కీలక మలుపు
- ఐపీఎల్ 2026లో వైభవ్ రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్
- వైభవ్ ఇంపాక్ట్ స్కోర్ 2490.35
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Delivers RS 35 Crore Performance in IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషభ్ పంత్ ప్రయాణం కీలక మలుపు తిరిగింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) రూ.27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన పంత్.. రెండు సీజన్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌లో రూ.15 కోట్లకే తిరిగి చేరాడు. ఈ ట్రేడ్ కేవలం ఒక స్టార్ ఆటగాడి బదిలీ మాత్రమే కాదు.. ఐపీఎల్ మార్కెట్లో ఆటగాళ్ల విలువ, వారి ప్రదర్శనల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బయటపెట్టింది.
రూ.27 కోట్లకు న్యాయం ఎక్కడ:
రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి రావడాన్ని చాలామంది భావోద్వేగ నిర్ణయంగా చూస్తున్నప్పటికీ.. ఆర్థిక కోణంలో చూస్తే ఇది మార్కెట్ కరెక్షన్కు ఓ నిదర్శనంగా నిలిచింది. ఢిల్లీ తరఫున తొమ్మిది సీజన్లు ఆడిన పంత్.. జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అయితే ఎల్ఎస్జీలో రెండు సీజన్లలో అతడి ప్రదర్శన రూ.27 కోట్లకు న్యాయం చేయలేదని అభిప్రాయం క్రికెట్ నిపుణుల్లో ఉంది. అందుకే అతడి మార్కెట్ విలువ దాదాపు రూ.12 కోట్లు తగ్గింది. ఐపీఎల్ 2026 సీజన్లో పంత్ 14 మ్యాచ్‌ల్లో 312 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్ 138.05గా నమోదైంది. అత్యధిక స్కోరు 68 పరుగులు. ఈ గణాంకాలు మరీ తీసిపారేసివి కాకపోయినా.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ మొత్తం అదనుకున్న ధరకు ఈ మాత్రం న్యాయం జరగలేదని విశ్లేషణలు అంటున్నారు. రూ.27 కోట్ల ధరకు న్యాయం చేయలేదనే అభిప్రాయం అందరిలో ఉంది.
Also Read
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
- Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
వైభవ్ విలువపై పెద్ద చర్చ:
రిషభ్ పంత్ ధర తగ్గడం ఒక వైపు అయితే.. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విలువపై పెద్ద చర్చ మొదలైంది. రాజస్థాన్ రాయల్స్ కేవలం రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసిన వైభవ్.. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి టోర్నీలో అత్యదిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 48.50 సగటుతో పాటు 237.31 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు బాదిన బుడ్డోడు.. మొత్తం 63 ఫోర్లు, 72 సిక్సర్లు కొట్టాడు. వైభవ్ కొట్టిన 72 సిక్సర్ల ద్వారానే 432 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లేలో మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యాన్ని బేబీ బాస్ చూపించాడు.
ఇంపాక్ట్ స్కోర్ 2490.35:
ఐపీఎల్ 2026లో వైభవ్ ప్రదర్శనను ఆధారంగా తీసుకుని రూపొందించిన కొన్ని విశ్లేషణాత్మక మోడళ్ల ప్రకారం.. బుడ్డోడి అసలు మార్కెట్ విలువ దాదాపు రూ.34.97 కోట్లుగా అంచనా వేశారు. అంటే రాజస్థాన్ రాయల్స్ కేవలం రూ.1.10 కోట్ల పెట్టుబడితో.. దాదాపు రూ.34 కోట్లకు పైగా విలువైన ప్రదర్శనను పొందిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభావ సూచికల పరంగా కూడా వైభవ్ అగ్రస్థానంలో నిలిచాడు. మొత్తం సీజన్ ఇంపాక్ట్ స్కోర్‌లో రెండో స్థానంలో, బ్యాటింగ్ ఇంపాక్ట్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. అతడి ఫైనల్ ఇంపాక్ట్ స్కోర్ 2490.35గా నమోదవగా.. పంత్ ఇంపాక్ట్ స్కోర్ 905.33 మాత్రమే. అంటే ప్రభావ పరంగా వైభవ్ దాదాపు మూడింతలు మెరుగైన ప్రదర్శన కనబరిచినట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
వైభవ్ సూర్యవంశీ తోపు:
ఒకవేళ రిషభ్ పంత్ ధర అతడి ప్రదర్శన ఆధారంగా రూ.27 కోట్ల నుంచి రూ.15 కోట్లకు తగ్గితే.. వైభవ్ వంటి ఆటగాడు ఇంకా రూ.1.10 కోట్ల స్థాయిలో ఉండటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐపీఎల్లో పేరుకన్నా ప్రదర్శనకే విలువ ఇవ్వాలనే భావన బలపడుతున్న తరుణంలో.. వైభవ్ భవిష్యత్ వేలం లేదా ట్రేడ్ మార్కెట్లో భారీ ధర దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న గణాంకాలు, ప్రభావం, మ్యాచ్‌లపై చూపిన ప్రభావాన్ని బట్టి చూస్తే.. ఐపీఎల్లో తదుపరి భారీ మొత్తం బుడ్డోడికే దక్కుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం తెలిసిన ఫాన్స్.. ‘వైభవ్ సూర్యవంశీ తోపు’, ‘ఐపీఎల్ 2026లో బేబీ బాస్ రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్ చేశాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..