Redmi 17C: 5,160mAh బ్యాటరీతో రెడ్మీ 17C విడుదల.. 120Hz డిస్ప్లే, హీలియో G81 అల్ట్రా చిప్సెట్
- రెడ్మీ 17C విడుదల
- 5,160mAh బ్యాటరీ
- 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 799 (సుమారుగా రూ. 12,000)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షియోమి సబ్-బ్రాండ్ రెడ్మీ తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ 17Cను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన ఫీచర్లు, పెద్ద బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. గత ఏడాది విడుదలైన రెడ్మీ 15Cకు వారసుడిగా ఈ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చింది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,160mAh బ్యాటరీని ప్యాక్ చేసింది. రెడ్మీ 17సి మూడు రంగుల ఆప్షన్లలో విడుదలైంది. ఇది 4GB RAMతో పాటు మీడియాటెక్ హీలియో చిప్సెట్తో పనిచేస్తుంది. రెడ్మీ 17సిలో 13-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా ఉంది. ఈ కొత్త ఫోన్, సెప్టెంబర్ 2025లో విడుదలైన రెడ్మీ 15సికి సక్సెసర్ గా వచ్చింది.
రెడ్ మీ 17సి ధర
రెడ్మీ 17C 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 799 (సుమారుగా రూ. 12,000). అదే RAM తో కూడిన 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 899 (సుమారుగా రూ. 13,000). ఈ ఫోన్ బ్లాక్, డాంక్సియా రెడ్, సీ బ్రీజ్ బ్లూ రంగులలో లభిస్తుంది.
Also Read
- Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
- BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
- డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
- 7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
రెడ్మి 17C స్పెసిఫికేషన్లు
డ్యూయల్-సిమ్ రెడ్మీ 17C షియోమి తాజా హైపర్ఓఎస్ 3 పై పనిచేస్తుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇచ్చే 6.88-అంగుళాల HD+ (720×1,640 పిక్సెల్స్) డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్. 600 నిట్స్ గ్లోబల్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఈ స్క్రీన్ TÜV రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్, సర్కాడియన్ ఫ్రెండ్లీ, ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్లను పొందింది.
పనితీరు పరంగా చూస్తే, రెడ్మీ 17C ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G81 అల్ట్రా చిప్సెట్తో పనిచేస్తుంది. దీనికి ARM మాలి-G52 MC2 GPU, 4GB RAM, 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, రెడ్మీ 17Cలో 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంది. ముందు వైపు, సెల్ఫీల కోసం 5-మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
రెడ్మీ 17C లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 4G VoLTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.4, Wi-Fi డైరెక్ట్, GPS, BeiDou, Galileo, GLONASS, AGNSS, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. సెన్సార్లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం, దీనికి సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. రెడ్మీ 17C 5,160mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 18W వరకు వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే, కంపెనీ రిటైల్ బాక్స్‌లో 10W ఛార్జర్‌ను మాత్రమే అందిస్తుంది.
తాజావార్తలు
-
Virender Sehwag: “కుర్రోడు కుమ్మేశాడు”.. గిల్, వైభవ్ సూర్యవంశీ క్లబ్లో చేరిన వీరేంద్ర సెహ్వాగ్ ముద్దుల కొడుకు..
-
Traffic Rules: పాత బైక్‌లు, కార్లు రోడ్డుపైకి వస్తే సీజ్.. బీఎస్-3, బీఎస్-4 వాహనాలపై బ్యాన్!
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Vangaveeti Radha: జనసేన కార్పొరేటర్లకు సన్మానం.. బెజవాడ అభివృద్ధిపై వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు
-
India Unemployment Rate 2026: దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం.. 5.1 శాతానికి పడిపోయిన నిరుద్యోగ రేటు!
ట్రెండింగ్
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు