India Iran Travel Advisory: ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు వద్దు.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
- ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు వద్దు
- భారత ప్రభుత్వం మరోసారి కీలక ట్రావెల్ అడ్వైజరీ జారీ
- ఇరాన్లో ఉన్న భారతీయులకు కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్లో భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం మరోసారి కీలక ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన తాజా సూచనల ప్రకారం, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భారత పౌరులు ఇరాన్‌కు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇటీవల పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ, పూర్తిస్థాయిలో సాధారణ స్థితి నెలకొనలేదని రాయబార కార్యాలయం పేర్కొంది.
అనవసర ప్రయాణాలు మానుకోవాలి
రాయబార కార్యాలయం ప్రకారం, అవసరం లేకపోతే ప్రస్తుతం ఇరాన్‌కు ప్రయాణించకపోవడమే మంచిదని సూచించింది. ప్రాంతీయ భద్రతా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పరిస్థితులకు అనుగుణంగా తదుపరి సూచనలు జారీ చేస్తామని వెల్లడించింది.
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
ఇరాన్లో ఉన్న భారతీయులకు కీలక సూచనలు
ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న లేదా అక్కడికి అత్యవసరంగా వెళ్లాల్సిన భారతీయులు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారుల సూచనలను పాటించాలి. తాజా భద్రతా సమాచారం కోసం అధికారిక ప్రకటనలను గమనించాలి. భారత రాయబార కార్యాలయంతో నిరంతర టచ్ లో ఉండాలి అని సూచించింది.
రాయబార కార్యాలయంలో నమోదు తప్పనిసరి
ఇరాన్లో ఉన్న భారత పౌరులు, అలాగే త్వరలో అక్కడికి వెళ్లే వారు తమ వివరాలను టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి ఈ నమోదు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
శాంతి చర్చల తర్వాత వచ్చిన సలహా
ఇటీవల ఇరాన్, అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయని సమాచారం వచ్చినప్పటికీ, భద్రతా పరమైన అనిశ్చితి పూర్తిగా తొలగిపోలేదని అధికారులు భావిస్తున్నారు. అందుకే భారత ప్రభుత్వం జాగ్రత్త వైఖరిని కొనసాగిస్తోంది.
అధికారిక సమాచారం ఎక్కడ చూడాలి?
భారత పౌరులు తాజా సూచనలు, భద్రతా హెచ్చరికలు, అత్యవసర సమాచారాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికారిక వెబ్సైట్, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలుసుకోవాలని సూచించారు.
— India in Iran (@India_in_Iran) June 24, 2026
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!