Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Water Bottle Cleaning: మనం ప్రతిరోజూ ఉపయోగించే ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. సరైన విధంగా శుభ్రం చేయకపోతే బాటిల్లో బ్యాక్టీరియా, ఫంగస్, దుర్వాసనలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా జిమ్, ఆఫీస్, స్కూల్ వంటి ప్రదేశాలకు తీసుకెళ్లే బాటిళ్లను ప్రతిరోజూ శుభ్రం చేయడం ఆరోగ్యానికి మంచిది. ఇంట్లో సులభంగా లభించే వెనిగర్, బేకింగ్ సోడా, డిష్ సోప్, బ్లీచ్ వంటి పదార్థాలతో బాటిల్‌ను ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు చూద్దాం..
వెనిగర్‌తో శుభ్రం:
వైట్ వెనిగర్ బాటిల్ లోని బ్యాక్టీరియాను తొలగించడమే కాకుండా దుర్వాసనను కూడా పోగొడుతుంది. బాటిల్లో ఐదో వంతు వరకు వైట్ వెనిగర్ పోసి, సగం వరకు గోరువెచ్చని నీటిని నింపాలి. బాటిల్‌ను బాగా షేక్ చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఆ ద్రావణాన్ని పారబోసి గోరువెచ్చని నీటితో బాగా కడగాలి. అవసరమైతే బాటిల్ బ్రష్ లేదా టూత్‌బ్రష్‌తో లోపల భాగాన్ని రుద్దాలి. ఆ తర్వాత పూర్తిగా ఆరనివ్వాలి.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
బేకింగ్ సోడా:
బాటిల్లో పేరుకుపోయిన మురికిని తొలగించడంలో బేకింగ్ సోడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నాలుగు కప్పుల గోరువెచ్చని నీటిలో పావు కప్పు బేకింగ్ సోడా కలిపి బాటిల్లో నింపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా ఉంచిన తర్వాత బాటిల్ బ్రష్‌తో లోపల భాగాన్ని శుభ్రం చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి పూర్తిగా ఆరబెట్టాలి.
డిష్ సోప్:
రోజూ బాటిల్‌ను శుభ్రం చేయడానికి డిష్ సోప్ ఉత్తమ మార్గం. బాటిల్‌ను సగం వరకు గోరువెచ్చని నీటితో నింపి 3 నుంచి 5 చుక్కల డిష్ సోప్ వేయాలి. మూత పెట్టి సుమారు 30 సెకన్ల పాటు బాగా షేక్ చేయాలి. ఆ తర్వాత సబ్బు నీటిని పారబోసి శుభ్రమైన నీటితో కడగాలి. లోపల మురికి ఎక్కువగా ఉంటే బాటిల్ బ్రష్ లేదా స్పాంజ్‌తో రుద్దాలి.
డిష్వాషర్లో శుభ్రం:
మీ బాటిల్‌పై డిష్వాషర్-సేఫ్ గుర్తు ఉంటే దాన్ని డిష్వాషర్లో కూడా శుభ్రం చేయవచ్చు. బాటిల్ మూత, స్ట్రా వంటి భాగాలను విడదీసి డిష్వాషర్ పై ర్యాక్‌లో ఉంచాలి. వాషింగ్‌తో పాటు డ్రైయింగ్ సైకిల్‌ను కూడా ఎంపిక చేస్తే బాటిల్ పూర్తిగా శుభ్రం అవుతుంది.
బ్లీచ్‌తో డీప్ క్లీనింగ్:
బాటిల్‌ను పూర్తిగా శానిటైజ్ చేయాలనుకుంటే బ్లీచ్ ఉపయోగించవచ్చు. ఒక భాగం బ్లీచ్‌కు తొమ్మిది భాగాల నీటిని కలిపి బాటిల్లో పోయాలి. బాటిల్‌ను షేక్ చేసి లోపలి భాగం మొత్తం తడిసేలా చూడాలి. తర్వాత బ్రష్‌తో శుభ్రం చేసి, బ్లీచ్ పూర్తిగా తొలగేలా రెండు నుంచి మూడు సార్లు నీటితో కడగాలి. బ్లీచ్ కాస్త విషపూరితమైనది కాబట్టి.. పూర్తిగా తొలగించడం చాలా ముఖ్యం.
డెంచర్ టాబ్లెట్లు:
డెంచర్ క్లీనింగ్ టాబ్లెట్లు కూడా బాటిల్ శుభ్రపరచడంలో ఉపయోగపడతాయి. బాటిల్‌ను నీటితో నింపి ఒక టాబ్లెట్ వేయాలి. టాబ్లెట్ పూర్తిగా కరిగేందుకు సుమారు 30 నిమిషాలు వేచి ఉండాలి. ఆ తర్వాత ద్రావణాన్ని పారబోసి బ్రష్‌తో లోపలి భాగాన్ని శుభ్రం చేయాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!