Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
- ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన
- తొక్కిసలాటలో అభిమానులకు తీవ్ర గాయాలు
- ప్రవేశానికి ఒక్క గేట్ మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stampede Scare at Ranchi Stadium: ఐపీఎల్ 2025 ఫైనల్ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలిసారి ట్రోఫీని గెలుచుకోవడంతో.. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ విషాదకర సంఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. అలాంటి ఘటనే దేశంలో మరొకటి చోటుచేసుకుంది. ఝార్ఖండ్ టీ20 లీగ్ 2026 ఫైనల్ సందర్భంగా రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం బయట తొక్కిసలాట చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో కొందరు అభిమానులు గాయపడ్డారు. పోలీసులు క్షగాత్రులను సమీప ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో మంగళవారం (జూన్ 23) జంషెడ్పూర్ స్టీలర్స్, చోటా నాగ్‌పూర్ రాయల్స్ తలాడ్డాయి. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే వేలాది మంది అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. అయితే ప్రేక్షకుల ప్రవేశానికి వెస్ట్ గేట్ మాత్రమే తెరిచి ఉంచడంతో.. భారీ రద్దీ ఏర్పడింది. అదే సమయంలో భద్రతా తనిఖీలు నెమ్మదిగా సాగడంతో బయట వేచి ఉన్న అభిమానుల్లో అసహనం పెరిగింది. దీంతో ఒక్కసారిగా తోపులాట, నెట్టుకొనే పరిస్థితి ఏర్పడి తొక్కిసలాటకు దారితీసింది.
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
గేట్ వద్ద అభిమానులు ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ క్రమంలో కొందరు కిందపడిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అభిమానుల ఒత్తిడికి స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు, గేట్లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అదనపు భద్రతా బలగాలను మోహరించి.. అభిమానులను వరుసగా స్టేడియంలోకి అనుమతించారు. దీంతో కొద్దిసేపటికి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. అనంతరం ఫైనల్ మ్యాచ్ ఎలాంటి అంతరాయం లేకుండా షెడ్యూల్ ప్రకారమే జరిగింది.
ఈ ఘటనపై రాంచీ ఎస్ఎస్పీ రాకేశ్ రంజన్ మాట్లాడుతూ.. ‘అభిమానుల ప్రవేశానికి ఒక్క గేట్ మాత్రమే తెరిచి ఉండటంతో భారీ రద్దీ ఏర్పడింది. సెక్యూరిటీ తనిఖీల కారణంగా ఏంటి ఆలస్యం కావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం. కొందరు గాయపడ్డారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉంది’ అని తెలిపారు. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు కమల్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఒక్కసారిగా భారీ సంఖ్యలో రావడం వల్ల తాత్కాలికంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని, అయితే భద్రతా సిబ్బంది సహకారంతో వెంటనే అదుపులోకి తీసుకువచ్చామని చెప్పారు. గాయపడిన వారిలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదని వెల్లడించారు. ఈ ఘటన మరోసారి మైదానాల వద్ద ప్రేక్షకుల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తింది.
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు